కిడ్స్ డైరీ


కిడ్స్ డైరీ 

పిల్లల ఫోటోలు ఎన్నో తీసి దాచుకుంటాం. వాటిని  చూస్తుంటే అప్పుడే ఎదిగిపోయారా అనే ఆశ్చర్యంతో పాటూ ఎక్కడో కొంచెం బాధగా కూడా ఉంటుంది. ఫోటోలను తీసి దాచుకున్నట్టు పిల్లల బుజ్జి బుజ్జి మాటలు కూడా దాచుకుంటే బాగుంటుంది కదా!

వారు అడిగే ప్రశ్నలలో వారి అమాయకత్వం, గడుసుతనం రెండూ ఉంటాయి. ఒక్కోసారి  ఆశ్చరంగాను మరోసారి అబ్బురంగాను ఉంటుంది.చాలా వరకూ  ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అప్పుడే మురుసుకుని అంతలోనే మరిచిపోతాం. ఇలా గుర్తు తెచ్చుకుంటే  ఎలా ఉంటుందో చదవండి….

చిన్న పిల్లలు ఉన్న అందరి ఇళ్ళలోనూ అతి సాదారణంగా సాగే సంభాషణలే ఇవి.

టన్నుల కొద్దీ   పెన్సిల్లె స్వాహా చేస్తారే

pencilsప్రతి రోజు స్కూల్ బాగ్ లో కొత్త పెన్సిల్స్ పెట్టటం…తిరిగి వచ్చేసరికి పెన్సిల్ పోవటమో లేక పావు అయిపోవటమో జరుగుతుంది. నా సగం జీతం ఈ పెన్సిళ్ళుకే సరిపోతుంది.

ఇంక లాభం లేదు…. అప్పు తీసుకుంటే ఎలాగూ తీర్చలేం, అందుకని ప్రపంచ బ్యాంకుకు కన్నం వేసి పెన్సిల్, sharpener, ఎరేసర్ ఫ్యాక్టరీ పెట్టి మేమే తయారు చేసుకుని మేమే వాడేసుకుంటాం.

 

Teacher is always right

teacher

కొత్త స్కూల్ బాగ్ పై KG II అని మార్కర్ పెన్ తో రాయటం ఎంత పెద్ద తప్పైపోయిందో!
“11 (eleven) రాసావేంటి, 2 రాయాలి కదా, kg 2 అని రాయాలి”
“I I …ఇలా కుడా రాయొచ్చు, దీన్ని రోమన్ నెంబర్ అంటారు”
“మా టీచర్ 2 అనే చెప్పారు..నువ్వు అబద్ధం చెబుతున్నావు,” ఏడుపు మొదలు…
ఇంకేం చేస్తాం…I I కొట్టేసి, 2 అని రాయాల్సి వచ్చింది…
At this age kids are so attached to the teacher..:)

 

మొక్కల పెంపకం 

plants

go green పధకం కింద ఓ రెండు ఇండోర్ ప్లాంట్స్, మందార, బంతి, ఇంకేవో పూల మొక్కలు కొనుక్కొచ్చాము. ఉన్న రామాయణం సరిపోనట్టు మరో కొత్త రామాయణం మొదలయ్యింది.

మా బుడ్డాలిద్దరూ గంటకోసారి ఆ మొక్కలకి నీళ్ళు పొయ్యా,  ఒక మేధావేమో “look look plant grow అయ్యింది” అనా…

ఇంకో మేధావేమో “ఇంకా grow అవ్వలేదు, let’s put some more water “….

ఇదిగో ఇలా సాగుతుంది రామాయణం.
ఈ వింటర్ holidays అయ్యేదాకా అన్న ఆ మొక్కలు బతకాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను…మొక్కలు ఆయుష్మాన్ భవ…

 సినిమాలు బా బా బోయ్ 

movie

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తున్నాం.   మా వాడు కాళ్ళుతో వాళ్ళ నాన్నని తన్నాడు. మొదట పొరపాటున తగిలిందేమో అనుకున్నాం. అదే పనిగా కాళ్ళు ఊపుతూ తంతున్నాడు.

“అది బాడ్ హాబిట్, Keep your legs properly ,” అంటే  “మరి 100 % సినిమాలో అలాగే చేసారు కదా, అప్పుడేమో తప్పు అనలేదుగా! ” అని ఎదురు అడిగాడు.

ఏమి చెపుతాం… సినిమా వాడికి చూపించినందుకు మమ్మల్ని  అనుకోవాలి.  అలాంటి అనుభవమే ఇక్కడ

ఎర్త్ చూపించు

ఆ రోజు  earthడాబా పైకి వెళ్ళాం.

“Hey kids come here… look at the moon, how beautiful it is. Tell me what the shape is?”

“Crescent.”

“Good boys ”

“అమ్మా, earth ని చూపించు.”

“This is earth “…. చెయ్యి కిందకు చూపిస్తూ చెప్పాను.

“ఇది earth ఏంటి? This is apartment ”

“ఓహో..అలాగా. మనం కిందకు వెళితే నేల కనపడుతుంది కదా. That is called earth .”

“అమ్మా…You don’t even know that. కిందకి వెళితే రోడ్ వుంటుంది.”

“హ్మ్…రోడ్, ఇల్లు, షాప్స్ ఇవన్నీ మనం earth పైన కట్టుకున్నాము.”

“మరి నువ్వు earth sky లో వుంటుంది అని చెప్పావు కదా. మూన్ ని చుపించినట్టే earth ని కూడా చూపించు sky లో. ”

“అవును కన్నా, మనం ఉంటున్న earth కూడా sky లోనే వుంటుంది.”

“అమ్మా, నీకేమి తెలీదు…..sky is up and we are down ”

“Dad….Dad…..come here ….”

[{నీకేమి తెలీదు}]@…….చ ఛ ఛా….ఇన్నేళ్ళలో ఒక్క స్టూడెంట్ కూడా నన్ను ఆ మాట అనలేదు…

 

మంచి పనయింది..నాన్నకు టీవీ టైం కట్

news

అనగనగా ఒక నాన్న. ఒక రోజున ఆ నాన్నగారేమో పిల్లలకు పాత పాటలు నేర్పించాలి అనుకున్నారంట.
“గాంధీ పుట్టిన దేశమా ఇది , నెహ్రు కోరిన సంఘమా ఇది,” నాన్న పాడుతున్నారు, వెనుకే పిల్లకాయలు అనుసరిస్తున్నారు. ….. ఇంతవరకూ కధ బాగానే సాగింది .
అసలు కధ ఇప్పుడు మొదలైంది!

“సామ్యవాదం…..”, నాన్నాగారి గొంతు హై పిచ్ లో పలికింది.
“సోనియా గాంధీ “……పిల్లలు ఇలా ఎత్తుకున్నారు !
నాన్న కు కళ్ళు బైర్లు కమ్మి , గొంతు మూగబోయింది .
పాపం పిల్లలు మాత్రమేమి చేస్తారు ? నాలిక తిరగకపోవటం ఒక కారణమైతే, టీవీలో ఈ మాట పదే పదే వినటం అసలు కారణం.

Moral of the story is, fathers shouldn’t watch news more than half an hour per day.

అమ్మకు చదవటం రాదు

mom

“అమ్మా, ఎంత సేపు ఆ బుక్ చూస్తూ ఉంటావు? నీకు చదవటం రాదా?”
“నాకు చదవటం రాదా!!!,?,” ఆశ్చర్యంగా నేను.
“Then why are you staring at that page……read ”
“ఓహ్..అదా big people గట్టిగా చదవరు. నువ్వు small కాబట్టి పైకి చదవాలి”
“నేను కూడా big boy అయిపోయాను. You don’t ask me to read aloud..OK”

 

యాహూ….మా బాబుకి తెలుగు అక్షరాలు వచ్చేసాయోచ్ 

telugu

 

 

 

 

 

 

ఇది మూడేళ్ళ క్రితం సంబరం. హిందీ క కి తెలుగు క ఒత్తు పెట్టి కాన్ఫుస్ అయిపోతుంటే ఆపేశాం.

నోరు జాగ్రత్త

talk

సందు చివర స్కూల్ బస్సు కనిపించగానే…
“No No…I don’t like this bus. నిన్న వేరే బస్సు వచ్చిందిగా, అది బాగుంది..నాకు ఆ బస్సే కావాలి” …..పేచి మొదలు పొద్దున్నే.

“మా బాబే??!!! మీ నాన్నని బాంకుకి కన్నం వేద్దామందాం, అప్పుడు ఎంచక్కా మనమే ఓ బస్సు కొనుక్కోవొచ్చు,” వాడి తిక్కకు కళ్ళు బైర్లుకమ్మాయి.

“కన్నం వెయ్యటమంటే ఏంటి?”, లా పాయింట్ తీసాడు….. నేను గుప్చిప్

 

ఇదంతా చదువే!!!

books

CBSC grade “1” సబ్జక్ట్స్, టెక్స్ట్ బుక్స్, నెంబర్ అఫ్ నోట్ బుక్స్ చూసి కళ్ళు గిర గిరా గిర గిరారా…రా తిరిగి డాం అని పడిపోయి ఇప్పుడే కొంచెం కోలుకోవటం మొదలుపెట్టా….
Wish me good luck to handle my kids…God help me…

 

 

 

 

………….. ఇంకో పోస్ట్ లో ఇంకొన్ని

This entry was posted in కిడ్స్ డైరీ, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s