ఓ పెళ్లి
పిలుపులు అయిపోయాయి. పోస్టులో పంపించాల్సిన శుభలేఖలు వెళ్ళాయి , బొట్టు పెట్టి పిలవాల్సిన దగ్గరి బంధుమిత్రులను పిలవటం దాదాపుగా అయింది.
ఇంక షాపింగ్ హడావుడి గురించైతే చెప్పనే అక్కర్లేదు. పీటలపై జంటను కుర్చోపెట్టే క్షణం ముందు వరకూ ఎవరో ఒకరు ఎదో ఒకటి కొంటూనే ఉంటారు పెళ్లి పేరున.
పెళ్లికొడుకు సపరివారసమేతానికి పట్టు వస్త్రాలు, పంచిపెట్టటానికి తీపి పదార్ధాలు, ఖరీదైన గాజు గిన్నెలు లగ్నపత్రికన భారీగానే సరఫరా అయ్యాయి.
మండపం పూల డెకరేషన్, దండల డిజైన్లపై తర్జన భర్జనలు సాగుతున్నాయి.
“పెళ్లి మట్టుకు ఘనంగా చెయ్యాలి”, పెళ్లి కూతురి తల్లిదండ్రుల చెవుల్లో ఈ డిమాండ్ రీసౌండ్ ఇస్తూ గాబరాపెట్టిస్తుంది.
ఆనందం, భయం, బెరుకు, ఎక్షమెంట్ అన్నీ కలిసి అయోమయంగా ఉంది పెళ్లి కూతురుకు . పెళ్లి కొడుకుది దాదాపుగా అదే పరిస్తితి.
పెళ్లి రెండు నెలల క్రితం కుదిరింది. పెళ్లి కుదిరాక ఒకటి రెండుసార్లు కలిసారు. ఫోన్ సంభాషణలు బిల్లును భారీగానే పెంచాయి. అమ్మాయి మాటతీరు అబ్బాయికి నచ్చింది. అబ్బాయి ఫ్రెండ్లీ నేచర్ తో అమ్మాయి హ్యాపీగానే ఉంది.
సరిగ్గా తెలీని వ్యక్తితో జీవితం పంచుకోవటం, తనను అర్థం చేసుకుంటారో లేదో, ప్రేమిస్తారో లేదో, తన ఇష్టాలను గౌరవిస్తారో లేదో, తమ అభిప్రాయాలు కలుస్తాయో లేదో, భాగస్వామిని చేసుకుంటున్న వ్యక్తి వ్యక్తిత్వం తెలీకుండానే ఇతను/ఈమె తో కలిసి బతకాలి…ఇలాంటి సంశయాలు ఎన్నో ఇద్దరిలోనూ.
నిన్నటి దాకా పరిచయం లేని వ్యక్తిని ఈ రోజు చూపించి, “నువ్వు ఇతన్ని/ఈమెను ప్రేమించాలి, కలిసి నూరేళ్ళు బతకాలని,” అమ్మ నాన్న నిర్ణయించినట్టుంది. ఇలాంటి సమయాలలో ప్రకృతి ప్రసాదించిన ఆకర్షణ చాలా వరకు సాయం చేసినా, పెద్దలు కుదిర్చిన వివాహంలో అమ్మాయి అబ్బాయిల మనసు దగ్గరవటానికి పెద్దల ప్రభావం ఎంతో ఉంటుంది.
మన పెళ్లి వ్యవహారాలలో ఈ పెద్దరికం వేస్తున్న కొన్ని తప్పటడుగులు ఏడడుగులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
సంబంధం వచ్చిన దగ్గర నుంచీ పెళ్లి కుదిరే వరకు అన్నీ పాజిటివ్ గా చూస్తారు. కాబోయే వియ్యకులు ఒకరికి ఒకరు ఎంతో గొప్పగా కనిపిస్తారు. కుటుంబం మంచిది, అబ్బాయి బుద్దిమంతుండు, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మర్యాదగల మనుష్యలు,అమ్మాయి మంచిది, కలివిడిగా ఉంటుందంట …ఇలా అన్నీ మంచిగా మాట్లాడుకుంటారు.
ఆ మాటలను వింటున్న అమ్మాయి/అబ్బాయి గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు.
సంబంధం కుదుర్చుకుని పెళ్లి ఏర్పాటులు మొదలుపెట్టడం ఆలస్యం ఇరువైపుల నుంచీ సన్నాయి నొక్కులు మొదలయితాయి.
కట్నం పట్టింపు లేదంటూనే పెట్టుపోతలు,పెళ్లి ఖర్చులు, బంగారపు లెక్కల దగ్గర చీలి పేచీలు మొదలు. సంబధం కుదుర్చుకునే ముందే ఈ లెక్కల మాటలు తేల్చుకున్నా కూడా ఏవో పేచీలు.
నూలుగుడ్డ నూరేళ్ళు కట్టమని తెలిసినా, మా తాహతకు తగ్గ బట్టలు పెట్టలేదనో, మర్యాదలు సరిగ్గా జరగలేదనో…ఏవో ఏవో అభ్యంతరాలు.
కొన్ని రోజుల క్రితం వరకు గొప్పగా చెప్పుకున్న సంబధం, కుదరగానే పేలవంగా మారిపోతుంది. అమ్మాయి అబ్బాయి ఆనందం అయోమయంలో పడిపోతుంది.
వీటికి తోడూ చుట్టుపక్కల అమ్మలక్కల ప్రశ్నలు, హెచ్చరికలూను!
“మీ ఆడపడుచు మహా గడుసుగా ఉంది, జాగ్రత్తమ్మ”
“మీ అత్తగారు తెలివైదేనోయ్, ఎలా వేగుతావో ఏమిటో”
ఎక్కడ చదివానో గుర్తులేదు కానీ, అత్త కోడళ్ళ బంధాన్ని ఇలా నిర్వచించారు. నువ్వు నేను కలవక ముందే మనిద్దరినీ శత్రువులుగా నిలబెట్టింది ఈ సమాజం అన్నారు ఆ రచయిత.
తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సమాజం నిర్ణయించిన బంధంలోనికి ఆ దంపతులను అడుగులు వేయిస్తూ తెలిసో తెలియకో లేక లౌక్యం ఎక్కువయ్యో మన పెద్దవారు చేస్తున్న చిన్న చిన్న తప్పులు ఆ యువ జంటపై ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో ఆలోచించరు.
“మీ ఆవిడకు కాఫీ పెట్టటం కూడా సరిగ్గా చేతకాదే!”
ఈ చిన్న మాట చాలదూ అబ్బాయిలో అసంతృప్తి బీజం వెయ్యటానికి?
చిగురించాల్సిన దాంపత్యపు బంధాన్ని హంగు ఆర్బాటాలు, పట్టు వస్తాలు, నగల గోలల్లో నిలక్ష్యం చెయ్యని పెద్దరికం కావాలి.
అత్తవారిల్లంటే యుద్ధరంగం కాదు, ప్రేమమయం అని చెప్పే పెద్దరికం కావాలి.
Very good.
Thank you 🙂
>>నువ్వు నేను కలవక ముందే మనిద్దరినీ శత్రువులుగా నిలబెట్టింది ఈ సమాజం
ఈ బ్లాగర్ అన్నారు 🙂
https://www.blogger.com/profile/05911835110407316783
Thanks a lot Nagarjuna garu. blame my poor memory 🙂
చదివినప్పుడు అనుకున్నాను చిన్న చిన్న పదాలలో ఎంత లోతైన అర్థం చెప్పారు అని.
Usually these things ( sorry feelings ) are forgotten by people very conveniently. Ego Issues play major role. Our marriage was completed in three days after we first met her place . So we had no chance to have these comments 🙂
Any way your story is very good.
Thank you,
Surendra
Surendra garu@ no doubt at the end ego plays.
So you are lucky in that way 🙂
Thank you.
hi praveena recently saw ur blog awsome work 🙂 keep going 🙂
Sravanti @ glad u liked it 🙂
బాగుంది ఈ పోస్ట్ కుడా, థాంక్స్ ప్రవీణ గారూ 🙂
ధన్యవాదాలు హర్షా గారు.
బాగా చెప్పారండీ ప్రవీణ గారు. అందరూ తమ దృక్పధాన్ని మార్చుకోవాల్సిన అవసరం తెలియజేస్తోంది ఈ కథ.
తల్లితండ్రులు కూడా పిల్లలకి పెళ్లి తర్వాత అరచేతి లో స్వర్గం చూపించకుండా ప్రాక్టికల్ ఆలోచన అలవాటు చేస్తే మంచిదని నా అభిప్రాయం.
“నువ్వు నేను కలవక ముందే మనిద్దరినీ శత్రువులుగా నిలబెట్టింది ఈ సమాజం అన్నారు ఆ రచయిత.”
ఇది నేను కోతి కొమ్మచ్చి – ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మ కథ లో చదివినట్టు గుర్తు.
ఏంతో కొంత అందరిలోను మార్పు రావాలి. ఒకవైపు ప్రగతి సాధిస్తునే మరో వైపు కొన్ని పల్లి విషయాలలో ఆచారాలని, పద్దతులని హాస్యాస్పదంగా వ్యవహరిస్తూ కాబోయే దంపతుల మనసుల్లో అసంతృప్తి నాటేస్తున్నారు.
ధన్యవాదాలు
బావుందండి పొస్ట్ !
థాంక్స్ రాధిక(నాని) గారు.
చాలా చక్క గా చెప్పేరు ప్రవీణ.. పెళ్ళి లోని అసలు సారాంశాన్ని వదిలి కొసరు ల మీద వెంపర్లాడే మన అందరి గురిం.చి
థాంక్స్ ఉమ గారు
Chala baga chepparu praveenagaru..
bagundi praveena garu.