మూడేళ్ళ ప్రయాణం


మూడేళ్ళ ప్రయాణం 

flr

 ఏమంత ఆలోచించకుండానే ఆలోచనలు అని మొదలుపెట్టేసిన ఈ బ్లాగ్ కు ముచ్చటగా మూడేళ్ళు  నిండాయి. ఈ ఆలోచనలను నేనే మొదలుపెట్టినా, నాలో భాగమైపోతుందని ఆ నాడు నేను అనుకోలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అనుభూతులు.

రాయటం ఒక అనుభూతి. విమర్శలు ప్రశంసలు అన్నీ ఆ తర్వాతే. అనుభూతి కోసమే జీవించే క్షణాలు కొన్నుంటాయి, ఇవి అలాంటివే. కధ రాస్తున్నప్పుడు ఆ పాత్రలతో కొన్ని రోజులు సహ జీవనం చేస్తాం. ఆ కొన్ని రోజులు పాత్ర మనస్తత్వంతో ఘర్షణ పడుతుంటాం. ఆ విశ్లేషణ భలే బాగుంటుంది. I simply love that feel.  అందుకే రాస్తుంటాను కాబోలు.

అరా కొర చదివిన పుస్తకాలే తప్పితే సాహిత్యంతో పెద్ద పరిచయం లేదు నాకు. కానీ నాకో చెడ్డ అలవాటు, ఎదురైన  ప్రతీ సంఘటనను పరిశీలించటం, ఆలోచించటం. నా పరిసరాలు, నా చుట్టూ మనుష్యలు మనస్తత్వాల చుట్టూ తిరుతుంటాను. Good or bad, I am a reserved person. My circle is very limited. 🙂

నా రాతలను కేవలం ఆలోచనలు అని మాత్రమే అంటాను. నన్నెవరైనా రచయిత అంటే నాకు చాలా ఏంబ్రాసింగ్  గా ఉంటుంది. నా దృష్టిలో రచయిత స్కోప్ చాలా పెద్దది. Scope means depth of maturity and understanding of the world of people.

నన్నెవరైనా ఎక్కువ మెచ్చుకుంటే సిగ్గుపడతాను కుడా  🙂  I know about myself, right?

The best compliments I received so far are,

One of my Indian colleagues said once, “Your talks are very inspiring ever since you started writing your blog. Without your talks I would have gone into depression,”  నిజానికి నేను చేసింది ఏమీ లేదు. ఆవిడే చాలా ధైర్యవంతురాలు. సర్ధుబాటుకి అణిగిమణిగి ఉండటానికి నడుమ ఒక సన్నటి  గీత ఉంటుంది. Be yourself అని మాట్లాడుకునేవాళ్ళం.

పర్సనల్ స్పేస్ కధ చినుకు మాస పత్రికలో అచ్చయినప్పుడు, నాకు ఈ మెసేజ్ వచ్చింది.

చదవడం పూర్తయ్యాక, కొద్దిసేపు ఆలోచన లో పడేసింది మీ కధ. మా ఇంట్లో చాలావరకు ఇంటిపనులు ఇద్దరం కలిసే చేసుకుంటాం,, మా ఆవిడకి లేట్ అయినప్పుడు నేనే ఈవెనింగ్ వంటంతా చేస్తాను. అలా చేయటం ద్వారా నేనోదో ఆమె కి చాలా సాయం చేస్తునట్లు, అసలు అలా చేసినందుకు నాకెంతో ఋణపడి ఉండాలి అనే ఫీలింగ్ నాకూ కలుగుతుంది. (మీ కధలో రాసినట్లు) , “మీ కధ చదువుతుంటే అనిపించింది.. “కరెక్టే కదా, అతి సా ధారణంగా, భార్య భర్త సమానంగా చేసుకోవాల్సిన పనులు కదా ఇవి,. …..మరి నేనేంటి ఇలా ఫీల్ అవుతున్నాను అనిపించింది”. thank you for enlightening me.

Honestly, ఈ మెసేజ్ చదివాక నాకు చాలా ఆనందంగా అనిపించింది.

పదేళ్ళ ప్రవాసంలో నేను చాలా మిస్ అయినది, like minded people నాకు తారసపడకపోవటం. మంచి పుస్తకం చదివితేనో లేక మంచి సినిమా చూసినప్పుడో ఆ విషయాలను చర్చిచాలనిపిస్తుంది. ఆలాంటి చర్చలకు కాస్తో కూస్తో అభిరుచి ఉన్నవాళ్ళు ఉండాలి. సోషల్ నెట్వర్కింగ్ లు , బ్లాగులు ఆదరణను పొందటానికి కారణం అదే అనుకుంట!

మన సమాజంలోని హిపోక్రసి తో నాకు తగని పేచి. అందులోనూ స్త్రీల విషయాలలో మరీనూ.

నువ్వెప్పుడు లేడీ ఓరియెంటెడ్ టాపిక్స్ రాస్తున్నావు. నీకో ముద్ర పడిపోతుంది అని నా సన్నిహితులు నన్ను హెచ్చరిస్తూ ఉంటారు. I do understand their concern, at the same time..ఈ ముద్రలతో నాకేం సంబంధం? నాకేం రాయాలనిపిస్తే అదే రాస్తాను, ఎవరో ఎదో అనుకుంటే అనుకోనీ.

గత మూడేళ్ళలో నేనేం నేర్చుకున్నాను?

నా ఆలోచనల్లో కొంత క్లారిటీ, ఎంతో కొంత పరిపక్వత వచ్చింది. Of course a long way to go.

నాకు సలహాలు ఇచ్చి ప్రోత్సహించే స్నేహితులు, పెద్దలు పరిచయం అయ్యారు.

All the more I enjoy writing…

Happy New Year తో పాటూ నీ బ్లాగ్ పుట్టిన రోజని విష్ చేసే ఫ్రెండ్ ఉన్నారు. I enjoy blog wish more than new year wish.

పాత పోస్ట్ చదువుతుంటే, కొన్ని సిల్లీ గా ఉండి డిలీట్ చేసెయ్యాలి అనేలా వుంటాయి. మరికొన్ని, ఇది నేనే రాసానా అనే ఆశ్చర్యం అబ్బురం.

I know my strengths and limitations too. I don’t try to sail in multiple ships, rather I adjust space in my ship to accommodate all my priorities. Blog is simply a part of it.

నన్నెంతో అభిమానించి ప్రోత్సహించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

This entry was posted in నా అనుభవాలు, Uncategorized. Bookmark the permalink.

14 Responses to మూడేళ్ళ ప్రయాణం

  1. రాధిక (నాని) says:

    బాగుందండి ..మీ” ఆలోచనల “కి అభినందనలు 🙂

  2. Deepthi says:

    Wishing your blog many many more wonderful years, deyyam!

  3. Anonymous says:

    Congrats mam

  4. Jaipal says:

    దాదపు రెండేండ్ల పైన అయిందనుకొంటా ‘ఫేస్ బుక్’ లో మొదటి సారి మిమ్మల్ని కలుసుకొని కవితలతో ఒక్కసారి పలకరించుక్న్నాము అంతే …మీకున్న శతకోటి శ్ర్యేయోభిలాషిలలో నన్ను గుర్తుపెట్టుకున్నరా అని అడిగితే నా అమాయకత్వాన్నీ ఇట్టే పసిగట్టెస్తరేమో…. ఐనా పర్లేదు… నా అమాయకత్వం నా అభిలాష అనుకోండి …… ఇంకా గుర్తురాలేదా?…..గుర్తుచేయటానికి ప్రయత్నిస్తాను … మీరు రాసిన ఒక కవితకి సమాధానంగా రాస్తూ, బహుషా అది మీ అభిమనాన్ని చూరగొనడానికేమో లేకపొతే మీ కళ్ళను నా వైపు తిప్పుకోవాలని ఆశగానో ఒక ప్రతికవిత రాసను… అది పూర్తీగా గుర్తులేదు ..అందులోని కొన్ని లైన్స్ ….

    …………………………
    …………………………
    జ్ఞాపకాల సంద్రం లొ ఓ కగిత పడవై తేలుతూ

    ఒడ్డుకు చెరటానికి కదు నా ప్రయత్నం …ఈ ప్రయానం ఇంకో జ్ఞాపకంగా మిగిలి పోయేవరకూ…
    …………………………………………
    చంపలను తడిచేస్తేనేం గులబీ రెక్కపై అందమై నిలిచింది నా బాష్పం

    కవితాసంద్రం లో ఈదుతున్న మీకు ఓ భిందువై మిమ్మల్ని తాకిన నా చిన్న కవిత, నేను గుర్తుకు రాకపొవటం లో ఆశ్చర్యపడను.. నా పెరు జైపాల్ ..’జైపాల్ రెడ్డివారీ అనే ప్రొఫైల్ పేరుతొ ఫేస్ బుక్ లొ ఒక్క రెండుసార్లు మాట్లాడాను. ఆ తర్వతా సివిల్స్ ప్రిపరేషన్ లో ఉండటం వల్ల దాన్ని డిలీట్ చేసాను ….

    సో …మూడేళ్ళ మీ అలోచనలకు ప్రతిరూపమైన మీ బ్లాగ్ నాలుగెళ్ళలోకి పడుతున్నందుకు శుభాకాంక్షలు !! …అంతులేని అందమైన మీ అలోచనల్ని నేను అన్నీ చదవకపోయినా నేను చదివినవన్నీ నా మనసుకు హత్తుకోన్నావే …ఒక్కోసారి అనిపిస్తుంది నా జీవితప్రయానంలో ప్రవీన లాంటి అమ్మైతో సావసం జీవితాంతం దొరికితే అధౄష్టవంతునిగా ఫీల్ అవుతానేమో…ఆశ దురాశ అవుతోందని అనుకుంటున్నారేమో….! అవున్లేండి నాది గొంతెమ్మ కోర్కే !! :):):)……. మీరంటే ఇప్పటికీ ఒక చిన్న ఇంప్రెషన్…..అది ఇక జీవితాంతం ఉంటుంది….మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుంది ..వీలైతే తప్పకుండా కలుస్తాను …మీ పిల్లలు మీ భర్తకి నా క్షేమములు……..

    దీంతో పాటు …. నూతన సంవత్సర శుభకాంక్షలు!

    మీలాంటి స్నేహితురాలు నాకు జీవితాంతం దొరికితే ఆవిడ రోజూ పలకరించే కవితలలో …ఆవిడ చిరునవ్వుల స్నేహం లో సహజీవనం కోరుకొనే ………జైపాల్ …:)

    • జై పాల్ గారు, మిమల్ని కవిసంగమంలో చదివాను కదూ!
      ఎంత బాగుందో మీ ప్రతి కవిత. జ్ఞాపకాల సంద్రంలో కాగితపు పడవ…వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్.
      సివిల్స్ లో మంచి రాంక్ రావాలి. అల్ ది బెస్ట్.
      తప్పకుండా కలుద్దాం. అవునన్నా కాదన్నా ప్రపంచం చిన్నదే మరి.
      Happy new year. Thank you.

  5. gatla.krishna says:

    very nice

  6. gatla.krishna says:

    wish you happy new year.2014

  7. A beautiful sensitive recollection. Continued good luck to you an your writing.
    Just remember this – there are only a very few people who can write and even fewer who can write well. You are one of them. Do not stop writing.

  8. హర్షా says:

    గ్రేట్,
    కంగ్రాట్స్ ప్రవీణ గారూ 🙂

  9. Suresh Raavi says:

    అసలు బ్లాగ్స్ చదవటమే మానేసిన ఈ మధ్య కాలం లో అనుకోకుండా మీ బ్లాగ్ చూసి ఒక్కో పోస్ట్ చదువు కుంటూ వెనక్కి వెళుతున్నా… నిజంగా మీ ఆలోచనలు ఒక్కొక్కటి ఒక్కోలా మనసుని తాకేలా ఉన్నాయి. ఏ ఒక్క శైలికి కట్టుబడకుండా కవితలు, కథలు, కబుర్లు చిత్రాలు… అన్నీ మనసుకి హత్తుకునేలా చెప్పటం ఏ కొందరికో సాధ్యం… ఎప్పటికీ ఇలాగే రాయాలని నా కోరిక… ఆల్ ది బెస్ట్ ప్రవీణ గారూ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s