ప్రపంచపు కోరికల చిట్టా
క్రిస్మస్ ఈవ్ న ఒక మాల్ లో కనిపించిన దృశ్యం. క్రిస్మస్ చెట్టు పక్కన పెద్ద బోర్డుపై రంగు రంగుల కాగితాలు పిన్ చేసి ఉన్నాయి. అవేమిటా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాం. ఆ పక్కనే ఒక చిన్న టేబుల్ పై నోటీసు పేపర్లు, పెన్నులు, పిన్స్ పెట్టి ఉంచారు. అక్కడ అందరూ తమ కోరికని ఆ పేపర్లపై రాసి బోర్డుకు పిన్ చేస్తున్నారు. It was a board of wish list.
bless Syria with peace అని రాసిన పేపర్స్ ఆకట్టుకున్నాయి.
ప్రభూ
మా సుదీర్ఘ కోరికల చిట్టాలో అసంఖ్యాంకంగా కోరిన కోరిక ఒకటే స్వామీ
యుగాలుగా మా ఆశల పల్లకీలో మోస్తున్న కోరికా అదే స్వామీ
వేకువ వెలుగులో శాంతి కిరణాలను
సాయం సంధ్యలో ప్రశాంతి పవనాలను
ప్రసాదించు స్వామీ….