మొక్కను విరగ్గోట్టిందేవరు?
మా ఊర్లో బంతి మొక్కల పండగ మొదలైంది. పసుపు జల్లినట్టి పసుపు బంతి, కుంకుమ జల్లినట్టు కారబ్బంతి మడులతో ఊరంతా రంగురంగుల పండుగగా కనుల విందుగా ఉంది. ఆ అందాలను చూసి మేము కూడా కొంచెం ఆవేశపడి, ఈ సంవత్సరపు గో గ్రీన్ పధకాన కొన్ని బంతి మొక్కలు కోనోక్కొచ్చి కుండీలో పెట్టేశాం.
ఆకు కొమ్మ పువ్వు కొన్న కొత్తలో మోజు మస్తుగా ఉంటుంది. (కొన్నాళ్ళకు తిక్క తీరుతుంది అని అక్వేరియం కొన్నాక అనుభవంలోకి వచ్చింది). రోజు శ్రద్ధగా మొక్కలకు నూరు పోస్తూ తెగ మురిసిపోతున్నాం.
ఇంకా ఆ మురిపెంలోనే ఉండగా, మూడు మొక్కలు ఒక దాని తర్వాత ఒకటి విరిగిపోయాయి. రౌండ్ టేబుల్ సమావేశమయ్యి తప్పేవరిదని తేల్చే కార్యక్రమానికి ఈ వీకెండ్ ముహూర్తం పెట్టాం. వాదోపవాదనలు బహు జోరుగా సాగాయి. రాష్ట పరిస్తితి కారణాన ఈ మధ్య టీవీల్లో వార్తలు, వాడులాటలు తెగ చూసేస్తున్నామేమో, ఆ బుద్ధి మాక్కూడా అంటినట్టుంది.
“నువ్వే నీళ్ళు పోసేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఉండవ్”
“నేనా, హౌ డేర్ యు బ్లేమ్ మి! మగ్గులోని నీటిని అరచేతులతో మొక్కలకు పోసే జాగ్రత్త నాది”
ఓ లెవెల్లో హోరాహోరున సాగినా తప్పెవరిదో తెల్చుకోలేకపోయాం.
పనిలో పనిగా మా చెలికత్తెపై (అదేనండి, ఇంటి సహాయకురాలు) కూడా నెపం మోపెసాం.
టేబుల్ రౌండ్ కు అటోకడు, ఇటోకడు కుర్చున్న మా బుడంకాయలు, టామ్ అండ్ జెర్రీ షో చూస్తున్నట్టు కళ్ళు అటు ఇటు తిప్పుతూ తెగ ఇకిలించేస్తున్నారు. వీళ్ళ నవ్వులో ఎదో తేడా ఉంది! (అసలు వీళ్ళు సరిగ్గా ఉన్నది ఎప్పుడులే!)
అప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లిటిల్ monsters పైకి మళ్ళింది. అనుమానమే లేదు, ఈ అల్లరి రాక్షసులు ఇద్దరు బాల్ ఆడుతూ, మొక్కలపైకి కొట్టి ఉంటారు. వీళ్ళదే తప్పని సాక్షాల అవసరం లేకుండా నిర్ణయించేసాం.
తీర్పు తెల్చేసాక, బాబు కొడుకులు క్రికెట్ ఆడుకోవటానికి గ్రౌండ్ కు వెళ్లారు. అబ్బాబ్బ ఇల్లెంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేనండి.
అలా ఇలా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ బాల్కనీ గ్లాస్ దగ్గరకు వచ్చా. అక్కడ రెండు పిట్టలు బంతి మొక్కలను పొడుస్తున్నాయి. పువ్వులను పొడిచి తినటం మాత్రమే కాదు, కొంచెం పెద్దగా ఉన్న మొక్కను ఈ రెండు పక్షులు అటొకటి ఇటొకటి పట్టుకుని కిందకు వంచుతున్నాయి. ఇంకేం ఉంది, కొమ్మ విరిగి పోయింది.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి…ఆ సీన్ చూడటం ఎంత బాగుందో. హుస్ హుస్స్స్ అని వాటికి తోలేయ్యాలనిపించలేదు. శబ్దం చెయ్యకుండా అక్కడే నించుని చూసాను. ఎక్కడ ఎగిరిపోతాయోనని లోపలకు వెళ్లి కెమెరా తెద్దాం అని కుడా అనిపించలేదు. I simply loved it. బుజ్జి పొట్ట కోసం దేవుడి ఎన్ని మార్గాలను సృస్టించాడో కదూ.
ఇళ్ళంతా నిశబ్దంగా ఉండేసరికి ఈ పిచ్చుకలు వీస్ డే అని పొరపాటు పడి ఫుడ్ ఆరగించేద్దాం అని వచ్చేసినట్టున్నాయి.
క్రికెట్ అయ్యాక ఇంటికి చేరిన సైన్యంతో నా ఇన్వెస్టిగేషన్ చెప్పా . ఆ సీన్ అంత బాగుందో కూడా విడమర్చి చెప్పాక, పిట్ట పొట్ట కోసం మొక్కను చంపుతావా? తప్పంతా నాదేనని తేల్చేసి ఎంచక్కా నవ్వేసుకున్నారు ఈ దుర్మార్గులు.
హతవిధీ !
అప్పుడు ఇపుడు తీసిన ఫోటోలను ఈ పోస్టుకు వాడేసుకున్నా…
lovely
ఫొటోస్ బాగున్నాయండీ .. 🙂
The flowers look so nice. Congrats. Wish I could use them.
🙂 బాగుంది పోస్ట్ మరియు ఫోటోలు.మీరు పక్షులు తినడం చూసారు .మా ఇంట్లో ఉడుతలు తింటున్నాయి .నావి సేం ఫీలింగ్స్ ..రాధిక( నాని )
praveena gaaru,narration bavundi,photos chaalaa baavunnayi.
liked it a lot!