కాఫీ కప్పే!


కాఫీ కప్పే!

images

సగం తాగిన కాఫీ కప్పును విసురుగా నెట్టేసాడతను
టేబుల్ పై ఒలికిన చుక్కలపై ఒక్క చూపన్నా చూడకుండా
తన షులో తన పాదాలను ఇరికించేసుకుని
పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ
ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

భారాన్ని మోస్తూ ముడుచుక్కూర్చుంటే ఇళ్ళు సాగదని
చీర కొంగుకో, చున్నీ అంచుకో
మూటగట్టగలిగినంత మూటగట్టి
నడుం బిగించిందామె.

మూల మూలలా పొడిగుడ్డతో దుమ్మును దులుపుతూ
కాఫీ టేబుల్ దగ్గరకు వచ్చింది.
బాధగా కసిగా గట్టిగా తుడిచినా వదలవే ఆ చుక్కలు!

ఆమె పెదవులు బిగిసి ఉన్నాయి.
నుదిటి నుంచో, కంటి నుంచో
ఓ చుక్క రాలిపడింది.
ఎండిన ఆ మరకలపై చెమ్మ చేసి వదిలించింది!

పిల్లల పాలు
పోపులో ఆవాలు
ఏవి గతి తప్పలేదు!

సూరీడు సెలవు తీసుకునే వేళ అతను తిరిగిచ్చాడు
తళతళలాడుతున్న టేబుల్ పై సిద్ధంగా ఉన్న
కాఫీ కప్పును అందుకున్నాడు.
చిక్కటి నురగలు కక్కే కాఫీ అతనికి ఇష్టం!

లోపల వంటింటి గట్టుపై
విరిగిపోయిన పాలను ఆమె శుభ్రం చెయ్యలేదని
ఆమె కప్పు అంగులమైనా కదలలేదని
అతనికి తెలీదు!

This entry was posted in కవితలు, మహిళ. Bookmark the permalink.

11 Responses to కాఫీ కప్పే!

 1. సత్య says:

  చాలా కాలం తరువాత!

  చిత్రీకరణ చాలా బాగుంది కంటికి కట్టినట్టుగా…
  చాలా బాగా రాసారు.

  పెద్దలు చెబుతుంటారు…..
  నిజానికి దీవెనెలు బాధలుగా , ఇబ్బందులుగా,నిరాశలుగా, వైఫల్యాలుగా జీవితలోకి ప్రవేశిస్తాయట.
  కాని మన ఓపిక, మన సహనాలు వాటిని ఆనందాలుగా, సంతోషాలుగా అసలైన నిజరూపలోకి మారుస్తాయట.

  -సత్య 🙂

  • సత్య గారు@ అవును చాలా కాలం తర్వాత రాసాను 🙂
   మీదైనా రెస్పాన్స్ బాగుంది. థాంక్స్

 2. రాధిక (నాని) says:

  కళ్ళకు కటినట్టు ..చదువుతుంటే చాలా బాగుంది.బాగా రాసారు

 3. Praveena gaaru konchem vyvidhyam lopinchindani, kaani baaga vrasaru andukega sri sri garu annaru meeru vrasi choopettaru
  pardhasaradhi

 4. ఎన్నెల says:

  చాలా బాగుంది. ఇళ్ళు అన్న చోట ఇల్లు అని ఉండాలేమో అని మాత్రం అనిపించింది.

 5. Madhavi says:

  Modati safari friends facebook post dwaara mee blog ki vachaanu. But after looking at this, I couldn’t stop reading all the rather most of the posts. Chaala baagunnaayi. Thanks for such a wonderful blog. Mostly I am a spectator in the blogs, but I felt like commenting on these blogs as they all looks very close to my thoughts. I guess I am the frequent visitor here from now.

 6. వంశీ says:

  చాలా బాగుంది.బాగా రాసారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s