Enough…enough is enough!


Enough…enough is enough!

 “ఆవేశంతో, భావోద్వేకంతో, అనాలోచితంగా యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలను బలిదానాలంటూ భావదారిద్ర్యాన్ని పెంచి పోషించిన నాయకుల్లారా, ఆ నాయకులకు చప్పట్లు కొట్టే ప్రజల్లారా ఇంక ఆపండి”    

Enough…enough is enough!

శవరాజకీయాలు, చావు రాజకీయాలు గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం.

ఉద్యమ తీవ్రతకు కొలమానం యువకుల ఆత్మహత్యలే అయితే…వెళ్ళిరండి! ఆ సమాధులపై నిర్మించే రాజ్యంలో ప్రజలకు  చోటుంటుందా మిత్రమా?

శ్రేయస్సుకు పనికిరాని నేతలందరూ వేదికలెక్కి రెచ్చగొట్టే ఉపన్యాసాలు. ఆ ఉపన్యాసాలలో పక్కవారిని కించపరచటం ఒక ఎత్తు అయితే, తమ వారిని రెచ్చగొట్టటం అసలు వ్యూహం.

ఛ…ఎటు పోతున్నాం??

ఆంధ్రులు ఆరంభశూరులు అనేవారంట! అదెంత నిజమో తెలీదు కానీ, ఆంధ్రులు భావదారిద్ర్యలు అన్నది చూస్తున్నాం, అనుభవిస్తున్నాం.

మొన్నీమధ్య ఒక మిత్రురాలు, “మావాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సానుభూతి కుడా చూపించలేదు”, అంది.  హ్మ్..ఏమని చెప్పాలి? చెపితే అర్థం చేసుకునే స్టేజిలో ఉన్నారా? సానుభూతి  కాదు..అసహనం, కోపం..Helplessness!!

“ఈ  సువిసైడ్స్ ఎందుకు గ్లోరిఫై చేస్తున్నారు? ఎలాంటి భావజాలం ప్రజలలోకి……..”, ఈ మాట పుర్తవ్వకముందే, where are you from  అనే ప్రశ్న, ఓహ్ అందుకే ఇలా మాట్లాడుతున్నారు అనే సమాధానం  వచ్చేస్తుంది. చివరకు ఈ టాపిక్ పక్కదారి పట్టి, ప్రపంచం చుట్టూ తిరిగి, పెరటి గుమ్మానికి తలబాదుకుని మళ్ళి చస్తుంది.

అమరవీరులు…యుద్ధంలో పోరాడి అశువులుబాపిన వారిని మాత్రమే అమరవీరులు అంటారు మిత్రమా. మనస్తాపంతో ఒళ్ళు కాల్చుకునో, ఉరేసుకున్నవారో కాదని అంటే ఇంతెత్తున లెగవరూ? అంతేలే, ఇందులో ఎవరి స్వార్ధం వారిదే!

మన పరిధి ఎంతలా కుదించుకుపోతుందంటే…కులం, మతం, ప్రాంతం, వర్గం ఎదో ఒక ప్రాతిపదికలో మనోడు దొరుకుతాడు. వాడు ఏమి మాట్లాడినా ఒప్పే, కాదన్న వారిది తప్పే.  శభాస్….శభాస్..

గుడ్డిగా వేల్తున్నంత కాలం వెళ్తూనే ఉంటాం…గొయ్యి నాలుగడుగులలోనే ఉంటుంది!

సందర్బం వచ్చింది కాబట్టి  ఈ మాట కుడా రాసేయ్యనివ్వండి.

నాయకులు , ప్రజలు ప్రాంతాలను బట్టి మంచోళ్ళు, చెడ్దోల్లు అయిపోరురా గిరీశం!
ఇప్పుడు కలుగులో దాక్కున్న నేతలు ఇటువైపైతే,
ఒక చేత్తో బంగారు పళ్లాన్ని, మరో చేత్తో విషాన్ని పట్టుకుని నాలుగు కూడళ్ళలో కాలరు ఎగేరేస్తున్న నేతలు అటువైపు!
ఆ! మనకేందులే అనే నిలక్ష్యంపు ప్రజలు ఒకవైపైతే,
మన సంబరాలలో మనం అనుకునే ప్రజలు మరోవైపు!
నువ్వు భలే అమాయకుడివోయ్ గిరీశం!

 క్రికెట్ మ్యాచ్ ఓడిపోతేనే మనోభావాలకు దెబ్బలు తగిలించుకునే సున్నిత మనస్కులమయ్యో మనం! అలాంటి మనోభావాలతో ఫుట్బాల్ ఆడి తమ పబ్బం గడుపుకునే నాయకులు మనలో కాక ఇంకెక్కడ వుంటారులే ! “మనోడు” అనే ఒకే ఒక్క కారణంతో గెలిపించిన నాయకులు మనోళ్ళు ఎలా అవుతారు బాస్?

పోయినోళ్ళందరూ మంచోళ్ళు అని పాడుకోవాలి కాబోలు..ఆ తరం, ఆ మంచితనం ఇంకేప్పటికి చూడలేం కాబోలు…

నోట్: హలో హలో విరావేశంగా కీ బోర్డు టకటక లాడించకండి. ఇందులో సమఖ్యమో, ప్రత్యేకమో మాత్రమే కనిపిస్తే..అది మీ పరిధి!

This entry was posted in ప్రజాస్వామ్యం, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు. Bookmark the permalink.

2 Responses to Enough…enough is enough!

  1. Fazlur Rahaman naik says:

    Well Said … !

  2. Praveena garu inka chaala unnayandi cheppataniki kaani okka vishayam madhyataragati prajala abhiprayalaku viluva lekunda poyindi, veella votlu evariki akharledu.Ila bloglo vaapoyeekante unna votunu sadviniyogam cheyyali prati okkaru. Ayena oka mata cheppana ‘AKKA AARATAMEGAANI BAVA BRATUKA BOYAADA’ Antaa ayipoiyindi eka savala meeds pelaalu erukovataniki siddhamga unnaru mana nayakulu
    pardhasaradhi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s