పల్లెటూరిలో ఓ రోజు


పల్లెటూరిలో ఓ రోజు

నేనేదో పెద్ద చుట్టానయినట్టు అమ్మమ్మ తాతయ్య తెగ మర్యాదలు చేసేస్తున్నారు.

“ఇక్కడ కూర్చో తల్లీ, మంచినీళ్ళు తాగుతావా? అయ్యో కరెంటు పోయిందే….”, అంతేలే!  ఎప్పుడో ఓసారి వెళ్ళివస్తుంటే ఇలాకాక ఇంకెలా ఉంటుంది?

అయితే మాత్రం!!! “అమ్మమ్మ, ప్లీజ్…నేనేమి చుట్టాన్ని కాదు ఈ ఇంటికి”, హమ్మ…మన అధికారాన్ని వదులు కుంటామేమిటి ఎంత చుట్టపు చూపులైతే మాత్రం.

ఒక స్టేజి దాటాక జీవితంలో ఎంత బిజీ అయిపోతామంటే, చిన్న చిన్న ప్రేమలు ఆప్యాయతలు, అంతకన్నా చిన్ని చిన్ని సరదాలు పక్కన పెట్టేస్తాం. నిజానికి ఇదంతా తీరిక, సమయం లేకపోవటమేనా? కాదనుకుంట!  ప్రయారిటీ లిస్టు జంబల్ అయిపోవటం అనిపిస్తుంది నాకు.

స్నేహితులను కలవకపోవటానికి, అమ్మమ్మతో మనసారా కబుర్లు చెప్పలేకపోవటానికి సవా లక్ష కారణాలు చెపుతాం! అందులోనూ ఆడవారికి వెతకాలే కానీ కోటి కారణాలు ఉంటాయి.  ఈసారి ఇలా కాదని,   నా ప్రయారిటీ లిస్టును కొంచెం రీఆర్డర్ చేసే ప్రయత్నం చేసాను.

స్మృతులలో బాల్యపు జ్ఞాపకాలు మధురం. అందులోనూ సెలవులలో గడిపిన ఆ పల్లెటూరు, అమ్మమ్మ తాతయ్య  ప్రేమ అత్యంత మధురం. 10th క్లాసు వరకు ప్రతీ సెలవులకు పల్లెకు వెళ్ళేవాళ్ళం. ఇంటర్ కు వచ్చాక చదువుల హడావుడిలో పడిపోయాం. ఆ తర్వాత పరుగులు… ఒక్కసారి వెనక్కి వెళ్లి వస్తే ఎంత బాగుండు!

మొన్న సమ్మర్ వెకేషన్ కు ఇండియా వెళ్ళినప్పుడు కెమెరా భుజానేసుకుని మా పల్లెటూరులో ఓ రోజు గడిపి వచ్చాను. నా అనుభవాలు ఇక్కడ….

“ఇబ్బంది పడతావ్, కారులో వెళ్ళు”,  అని అమ్మానాన్న గొడవ చేసినా వినకుండా బస్సులోనే వెళ్తానని బయల్దేరాను. మనది మామూలు లెగ్గు కాదు కదా! ఉద్యమం బందు మొదలయ్యాయి.  బస్సు స్టాప్ లో గంట వెయిటింగూ 😦

అదే రోజు ఏదో పనిపై మామయ్య కూడా ఊరు వెళ్తున్నాడు. నన్ను బస్సు ఎక్కించి తను బండిపై వెళ్ళాలి. బస్సు ఎంతకీ రాక పోయేసరికి, ఇంక లాభం లేదని, “పద బండిపై వెళ్దాం. కూర్చోగలవా? నడుం నొప్పి వస్తుందేమో!”, అన్నాడు.

“హి హి హి…నాకేం బాధ లేదు. ఆ తర్వాత నన్ను తిట్టకూడదు”,   ముందే  వార్నింగ్ ఇచ్చా. మామయ్యకు అర్థం కాలేదు. పాపం, మన కళాపోషణ రేంజ్ మామకు తెలీదు..

అప్పుడు బయటకు తీసా కొత్తగా కొన్న DSLR కెమారాను. మరి మన ప్రావీణ్యం అంతా చూపించాలి కదా 🙂

దారి పొడుగునా, “మామా ఇక్కడ ఆపు, మావయ్య మళ్ళి  ఆపు ఫోటోలు తీసుకుంటా”, అంటూ ఓ లెవెల్లో హింసించా.

(You may click on photo to see slid show)

 

పంట కాలువ, వంతెన…తాటి చెట్లు…

ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆప్యాయతతో పాటూ సీతాకోక చిలుకలు, నూరు వరహాల పువ్వులు స్వాగతం పలికాయి.

ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నా, కనీసం వాకిలి ఊడ్చి ముగ్గేసే పని వాళ్ళు దొరకకున్నా, తాతయ్య తన గార్డెనింగ్ హాబీ కొనసాహిస్తూనే ఉన్నారు. అమ్మమ్మ ఇంటిని అద్దంలా ఉంచుతుంది. శారీరకంగా మానసికంగా ఎన్ని బాధలు ఉన్నా ఈ స్వచ్చమైన గాలి, ఈ ప్రకృతి మమ్ముల్ని సేద తీరుస్తుంది అంటుంది అమ్మమ్మ. ఇక్కడ తప్పితే ఇంకెక్కడా ఉండలేం మేము అంటారు.

ఈ వినాయుకుడు ఎక్కడుంటాడో చెప్పనా? అమ్మమ్మ రోజు పూజ చేసే తులసి కోటలో  ఉంటాడు. చిన్న విగ్రహం.  ఫోటో భలే తీసాను కదూ 🙂

ఈ ఫొటోలన్ని ఎంతో అందంగా ఉన్నాయి కదూ. కానీ, ఆ పచ్చదనం వెనుక తీరని కష్టం, ఆగని కన్నీరు ఉంది. వర్షాలు లేక, కరెంటు లేక, నీళ్ళు లేక, సమయానికి లేబర్ దొరకక, చేతిలో పెట్టుబడి లేక పల్లెల్లో వ్యవసాయం చేస్తున్న వారి బతుకులో పచ్చదనం మచ్చుకైనా లేదు. చివరకు పొలాలు కౌలుకు తీసుకోవటానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు.

చుట్టుపక్కల చాలా ఇళ్ళు పాడుబడిపోయాయి. ” ఆవిడ చనిపోయింది, ఆ పెద్దాయన కొడుకు దగ్గర ఉంటున్నారు. ఎదురిళ్ళు కొంతకాలం అద్దెకు ఇచ్చారు. వాళ్ళు కాళీ చేసి వెళ్ళాక ఎవరూ రాలేదు. పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయింది.”..హ్మ్ ఒక్కో ఇంటికి ఒక్కో గాధ.

మూడు తరాలుగా మన సమాజంలో వచ్చిన మార్పు, ఆ మార్పుల్లో మూలబడిపోయిన  పల్లె… కాలం ఎంత ఖర్కశం!

ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పు కుంటుండగానే సాయంత్రం అయిపొయింది. అమ్మమ్మ వండిన కజ్జికాయలు, కొబ్బరి బూరెలు లాగించి, డాబా పైకి వెళ్లాను.   ఇదిగో ఇంత అందమైన సూర్యాస్తమయాన్ని కనులారా చూసాను.

This slideshow requires JavaScript.

గుడికి వెళ్దాం అన్నాను. తాతయ్య పూజారికి ఫోన్ చేసి, “మా మనవరాలు వస్తుంది”, అని చెప్పారు. ఆహా ఏమి రాయల్ ట్రీట్మెంట్ 🙂

పూజారి గారి స్పెషల్ పూజ అయ్యేసరికి చీకటి పడింది. ఏడయింది.  స్ట్రీట్ లైట్స్ వెలిగి వెలగక బిక్కుమంటున్నాయి. అమ్మమ్మ ధైర్యంగానే ఉంది. నిజం చెప్పొద్దూ..నాకైతే భయం వేసింది. రోడ్డుపై నరమానవుడు కనిపిస్తే ఒట్టు.

ఇంటికి చేరాం. ఎక్కడా అలికిడి లేదు. మా ఇంట్లో వెలుగుతున్న లైట్ తప్పితే ఇంకేమి లేవు.

పగలు  ప్రశాంతంగా అనిపించిన ఊరిలోని నిర్మానుష్యత  రాత్రికి తెలిసొచ్చింది నాకు. పట్టణాల అపార్ట్మెంట్ల ఇరుకుతనంలోని అలికిడి సందడి గుర్తొచ్చాయి.

పాడి పంటలతో కళకళలాడిన ఊరు ఎంత బోసిపోయిందో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

ఆ రాత్రి కలత నిద్ర, of course దోమల గోల కూడానూ!

ఇప్పుడు నిద్ర పట్టిందో, శివాలయంలోని “ఓం నమశ్శివాయ” మంత్రానికి మెలుకువ వచ్చింది. పెరట్లో  అమ్మమ్మ గారెల్లోకి పచ్చడికని కత్తి పీటపై కొబ్బరి ముక్కలు కోస్తుంది.  తాతయ్య మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నారు.  చల్లటి గాలి…

ఇంతలో చిరు చినుకులు మొదలయ్యాయి. బ్రష్ చేసుకో, కాఫీ ఇస్తాను అంటుంది అమ్మమ్మ. బ్రష్ లేదు, గ్రిష్ లేదు… కాఫీ తొందరేమీ లేదు అనుకుంటూ కెమెరా పట్టుకుని వాకిట్లోకి వచ్చేసా…

ఈ సన్నజాజి పందిరితోటి మా అనుభందం నాలుగు తరాల నాటిది. అమ్మమ్మ, అమ్మ, మేము,మా కూతురు..మేమందరం ఈ పువ్వులు పెట్టుకున్నాం. వెళ్తూ వెళ్తూ మా చిన్ని తల్లికి పెట్టటానికి ఈ సన్నజాజులు కోసుకెళ్ళాను.. చిన్ని పిలకేసి పూలు పెట్టి ఫోటో కూడా తీసుకున్నా.

వర్షంలో తడుస్తున్న రామ చిలుకలు…

ఇన్ని జ్ఞాపకాలను పోగేసుకుని తిరుగు ప్రయాణమయ్యాను….

(పేస్ బుక్లో ఫొటోస్ అప్లోడ్ చెయ్యటానికి, స్టేటస్ అప్డేట్ చెయ్యటానికి తీరిక ఉందే! బ్లాగ్ లో పోస్ట్ రాయటానికి టైం లేదా?? కహానీలు చెప్పకు అని ఘాటుగా మొట్టికాయలు వేసిన  దుర్మార్గులందరికి…హి హి హి థాంక్స్ 🙂 🙂  )

This entry was posted in నా అనుభవాలు, వ్యాసాలు, Photography, Uncategorized. Bookmark the permalink.

38 Responses to పల్లెటూరిలో ఓ రోజు

 1. నాకో సామెత గుర్తొస్తోంది. ఆ సామెతలో కొబ్బరికాయ ఉంటుంది 🙂
  ఫొటోలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నాట్ల సీను అసలు మరీను. నాట్ల సమయంలోనూ, కోతల సమయంలోనూ కోస్తా వెంబడి పేసెంజరు రైల్లో వెళ్ళడం ఓ గొప్ప అనుభవం.
  అమ్మమ్మకీ, తాతయ్యకీ, స్పెషల్ పూజ పూజారిగారికీ మప్పిదాలు.
  పాపం మావయ్య! ప్చ్. ఐనా ఎవరో ఒకరు హింస పడకపోతే ఇలాంటి బ్యూటీ ఎలా సృష్టించబడుతుంది?

  • నారాయణ స్వామి గారు @ కిటికీ పక్క సీట్లో కుర్చుని కూ కూ ఛుక్ ఛుక్ శబ్దాన్ని వింటూ, ఆ పచ్చదనాన్ని, పొలాల్లో పనిచేస్తున్న వారిని చూడటం..నిజంగా గొప్ప అనుభవం.
   పలానా వారి పిల్లలంట అంటూ మనకు ఇచ్చే రాయల్ ట్రీట్మెంట్, మనమేమో నవ్వు ఆపుకుంటూ కొంచెం సిగ్గు పడిపోవటాలు..హహహ్హ మధురమైన అనుభవాలు.
   మొత్తానికి మామయ్య మెచ్చుకున్నాడు..మెచ్చుకోకపోతే ఊరుకోం కదా!
   సామెత ఎంతో చెప్పేయరూ, ప్లీజ్
   Thank you 🙂

 2. వావ్ !! చాలా బాగున్నాయ్ మీ ఫోటోలు ,అమ్మమ్మ ఊరి కబుర్లు .వర్షం ఫోటోలు ఇంకా బాగున్నాయి ..ఏవూరు ఇది చాలా బాగుంది.

 3. Pratap says:

  మీ Post చదువుతుంటే మనసు పచ్హని ప్రకృతి పరిమళాల వైపు, మనం మరచిపొయిన (మూలన పడేసిన అంటే బాగుంటుందేమో) మన పల్లెల్ల వైపు అలనల్లన పిల్లగాలిలా సాగిపొయింది ప్రవీణగారు. ఈ Post కు Pics మరింత వన్నెలద్దాయి. నా అనందాన్ని, సంతొషాన్ని వ్యక్తం చెయ్యడానికి నాకు ఇంతకన్నా మాటలు రావటం లేదు. మీరు అనుమతిస్తే ఈ ను లో చేద్దామనుకుంటున్నను (నాలాంటి మట్టివాసన మరచిపోయిన వారికోసం) !

  • ప్రతాప్ గారు @ తప్పకుండా షేర్ చెయ్యండి. మట్టివాసన, పిల్లగాలి మనసుల్ని తట్టి లేపుతుంది. ధన్యవాదాలు.

 4. Anonymous says:

  గ్రామీణ జీవన చిత్రాన్ని కళ్ళముందు ఉంచారు..

 5. radhika says:

  ప్రవీణ గారూ ఫొటోలన్నీ సేవ్ చేసుకోవాలని వుంది. మీరన్నట్టు పల్లెటూళ్ళు సంతోషం గా లేవు. ఫోతోలు చూస్తుంటే లోపల ఏదో భలే ఫీలింగ్.దానితో పాటూ కొంత బాధ కూడా 😦
  కొత్తపాళీ గారి సామెత మీకు అర్ధం అయినట్టు లేదు.అందులో కొబ్బరి కాయతో పాటూ కోతి కూడా వుంటుంది 🙂

  • రాధిక @ It’s a mixed feel. సంతోషంగానూ ఉంటుంది, ఎక్కడో బాధగా కూడా అనిపిస్తుంది.
   ఓహ్…ట్యూబ్ లైట్ ఇప్పుడు వెలిగింది, నా చేతికి కొబ్బరి కాయ దొరికింది అన్నారు 🙂 నిజమే!

 6. ఫొటోస్ చాలా బాగున్నాయి. macro shots ఇంకా బావున్నాయి 🙂

 7. మా వూరు వెళ్ళివచ్చినంత సంబరంగా వుంది. చదివుతున్నంత సేపూ తెలియని సంబరం ఎదో పెదాలపై నవ్వు పూయిస్తూనే వుంది.బహుశ రాసేటప్పుడు మీ అనుభూతి అయివుండొచ్చు. ఫోటోలు భలే తీశారు.

  • జ్యోతిర్మయి గారు @ నా అనుభవాన్ని, సంబరానికి అక్షరరూపం. ఊరు వెళ్ళటం ఒక మధురానుభూతి .Thank you.

 8. Anonymous says:

  Kothi kuda vuntundi sametha lo 😉

 9. Nirupama says:

  I usually don’t comment in any blog coz I’m soooo lazy 😉 but ur post n pics made me so nostalgic that I cudnt control myself….pics are too good…reminded me of my childhood days,same royal treatment etc etc….sorry to type in English,,same reason,,I’m lazy . 😉 …very nice post…

 10. Tejaswi says:

  ప్రవీణగారూ! ఇది గ్యారెంటీగా (మా/మీ) గుంటూరుజిల్లా పల్లెటూరే అయిఉండాలి

 11. Anonymous says:

  ప్రవీణ గారు,
  మీ పోస్ట్ చదివాక, ఫొటోస్ చూసాక నాక్కూడా ఈసారి తప్పకుండా మా వూరు చూసి రావాలని వుంది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం వదిలిపెట్టిన ఊరిని మా అమ్మాయికి చూపించాలని వుంది. ఇప్పటివరకూ ఆ పనిని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఈ సారి గుంటూరు వెళ్ళినపుడు(మా అత్తగారిదీ, అమ్మగారిదీ ఆ ఊరే) నేను పుట్టిపెరిగిన చేబ్రోలు వెళ్లివస్తాను. మీ ఫోటోలు నిజంగా అథ్భుతం గా వున్నాయి.
  ……………. రాధ.

  • ఈ సారి వాయిదా వెయ్యకుండా చేబ్రోలు వెళ్లి రండి రాధ గారు. చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. మీ అమ్మాయికి కూడా తెలుస్తుంది మన పల్లెలు ఎలా ఉంటాయో. థ్యాంక్స్.

 12. bonagiri says:

  మంచి అనుభూతులు, మంచి చిత్రాలు.
  అభినందనలు.

 13. ఫోటోలు చాలా బాగున్నాయి. జీవితంలో కొన్ని ప్రయాణాలు మరో జీవితకాలానికి సరిపోయేటన్ని అందమైన జ్ఞాపకాలని ..అనుభూతుల్ని మిగుల్చుతాయి.

  ఆ అరుగులు చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది. ప్రతి ఇంటి ముందు అరుగులు. ఆ అరుగుల మీద ఎన్ని ఆటలు..ఎన్నెన్ని కబుర్లు..వాదనలు..దూషణలు..తగువులు…పంచాయితీలు…తీర్పులు..ఒక్కో అరుగునీ కదిలించాలే కానీ వందల కథలు చెప్తాయి. కరణం గారి అరుగులు ఆడవారి కబుర్లకి వేదికయితే…తాతయ్య గారి అరుగులు మగవారి కార్యస్థలం.

  వలసపోయిన బ్రతుకులు..బావురు మంటున్న వీధులు…బోసిపోయిన అరుగులు ఇదీ ఈనాటి పల్లెటూరి చిత్రం. ఊర్లో ఉన్న కొద్ది మందీ టివీలకి అతుక్కుపోయి అసలు మనుషులు ఉన్నారా ఊళ్లో అనుకునేట్లు ఉంటుంది.

  • సిరిసిరిమువ్వ గారు @ Intensity of certain feelings gives a big push.. ఊరు వెళ్లి రావటం మధురమైన అనుభూతి. ప్రతీ సంవత్సరం వెళ్ళాలి అనుకుంటాం. ఎందుకో కుదరదు. We simply don’t give importance to small pleasures.
   అరుగులు, విధులు అన్ని బోసిపోయాయి. ఒకప్పుడు మేము తిరిగిన ఊరేనా అనే ఆశ్చర్యం!
   “ఇంట్లో మనిషికి ఏదన్నా అయితే వాసన వచ్చేదాకా ఎవరికీ తెలీదు “, అక్కడ మాటల్లో దొర్లిన ఒక భావం. పాల పాకెట్లు, ఇంటర్నెట్లు పల్లెల్లోకి వచ్చాయి. కానీ పల్లెల్లో మనుషులే లేరు. ఇలా రాస్తూ పొతే ఎంతో ఉంటుంది.
   Thank you.

 14. Chaala Chaala Baagunnayyandi nenu cheyyalani anukunnavi meer chesi choopistunnaru. Maari Badayee kaakapote maa voorlo kooda ilanti drusyaalu unnayi lendi. Meeku Abhinandanalu.
  Pardhasaradhi
  From Chirala

 15. Harsha says:

  At last reached 🙂
  కొన్ని వారాల క్రిందట, బాగా బిజీ గా వున్నప్పుడు ఈ ఫొటోస్, ఈ పోస్ట్ చూసాను. పల్లెటూరి ఫొటోస్, పల్లెటూరి అనుభవాలు కనిపిస్తే వెంటనే లింక్ సేవ్ చేసుకుంటాను, అయితే బిజీ గా వుండటం మూలాన నేను మీ ఈ పోస్ట్ లింక్ సేవ్ చేయడం మరిచిపోయా… గుర్తు వచ్చినపుడల్లా కొంచెం బాధగా వుంటుంది, ఎలా మిస్ చేసాను ఈ లింక్ ని అని…. ఈవాళ పట్టిన జల్లెడ లో ఈ పోస్ట్ ని పట్టేశాను… 😀

  ఫొటోస్ చాలా చాలా బాగా తీసారండీ, మీరు అభ్యంతరం చెప్పకుంటే కొన్ని పిక్స్ దాచుకుంటాను 🙂
  పల్లెటూరి పిక్స్, మాక్రోస్ ఒకటేమేటి ప్రతీ ఫోటోను అద్భుతంగా వుంది, మాటల్లేని ఆనందం ఈ పిక్స్ చూస్తుంటే 🙂

 16. Harsha garu@ మీ జల్లెడలో ఈ పోస్ట్ దొరకటం నాకెంతో హ్యాపీగా ఉంది. Bcoz I get to read a nice comment here 🙂
  ఈ మధ్యే కెమెరా ఎలా వాడాలో నేర్చుకుంటున్నా. నిజానికి కెమెరా పనితనం కన్నా లొకేషన్ అందాలే ఎక్కువ. మీకు నచ్చిన ఫొటోస్ హ్యాపీగా సేవ్ చేసేసుకోండి, ఆ క్లిక్స్ కు అంతకంటే కావల్సిందేముంది! 🙂

 17. Sudarshan says:

  it is giving me more sadness than happiness…we are all part of the group which caused destruction of villages. I can never forgive myself for not making an effort to live in a village. the negativity that created by erstwhile “revolutionary”( but irresponsible) poets, some cruel jamindars, and exaggeration that was incessantly created by writers,on the atrocities done in villages on weak people… just for their popularity ..and concocted histories spread by people in power to dance to the tunes of foreign powers for their corporate gains…successfully killed villages in India. a county is not number of cities it has but it is more of villages in a country…especially for India. recenly i read a comment bya sick person , as a review on mithunam movie…that a section of people wants to project village life as better life..just to get back their supremacy over other castes..what an absurd theory !! these sick minded people were supported by governments policies/public as liberated souls . they are now ruling India with their books and ideologies..when this poison is distributed across villages powered by illegally earned easy money from cities….villagers will be suffering and one day suddenly disappear . We will find all corporate and political goons soon all over India ..everywhere !!! Go to villages and see them one last time…theyarent going to be there anymore…

 18. Uma says:

  చాలా చాలా బాగుంది మీ ఊరు దానిని మీరు చూపించిన విధానం.. ఫొటో లు హైలైట్.

 19. lithusha says:

  Nijam cheppana idi chadivaka chala bengaga vundi 😦 pics chusi ma palleturu anukunna.., chalasepu alochincha.., madi vijayawada pakkana palleturu.. ammamma tatayya baga gurtu vastunnaru.. 😦 nenu eppudu anukunedanni maa ooru anta andanga assalu ee ooru vundadani.. Thank u praveenagaru..

 20. juvvadisrinivasrao says:

  superb

 21. amarendra dasari says:

  naalugella tarwaata choostunnaa…bhale fotolu…chakkani write up….wish you many more kobbarikaayalu

 22. తెలిసో తెలియకో పాలకులు,ప్రజలు పల్లెల్ని నిర్లక్ష్యం చేశారు. నిత్యం యాంత్రికమవుతున్న బతుక్కి మళ్లీ ఆదరణ,స్వాంతన ప్రకృతి ఒడి పల్లె తల్లి మాత్రమే.

 23. Found In Folsom says:

  Beautiful post and beautiful pictures, Praveena garu..Nijamgane chala pallello idey scene kanipistundi…Wonderful memories to treasure for a lifetime

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s