ఆవిడ ఆమె
సృష్టి భారమంతా ఆవిడే మోస్తుందని
ఆవిడకు ఎవరు చెప్పారో?
ఆవిడ ఎలా నమ్మిందో!
త్యాగాల మూటను భుజానకెత్తుకుని
భారంగా అడుగులు వేస్తుంది.
చలాకీతనం తెలీనట్టే ఉంటాయి ఆవిడ పాదాలు.
పుస్కరానికోనాడు
ఆవిడ విశ్రాంతి కోరుకుంటుంది.
చంద్రుడు చుక్కలు గాఢ నిద్రలోకి జారాక
నిశ్శబ్దంగా కూర్చుంటుంది.
అరిగిన కీళ్ళు కళ్ళుక్కుమంటుంటాయి
కుచ్చిళ్ళలోని గజ్జెలు గళ్ళుమంటుంటాయి
ఇంతలో
భళ్ళున తెల్లారిపోతుంది
సూరీడంత సింధురాన్ని
నుదుటన అలంకరించుకుని
తన పాదాలను ముందుకు తోస్తుంది….
***************
ఆవిడ కూతురు
శోధించటం ప్రశ్నించటం నేర్చుకుంది.
ఎంత భారం తనదో
ఎన్ని మూటలు భుజానేసుకోవాలో
లెక్కలు వెలికి తీసింది.
భాద్యతను త్యాగం అనుకోదు ఆమె…
కాలాన్ని, వేగాన్ని ఒడిసిపట్టి
వడివడిగా అడుగులేస్తోంది.
ఈక్రమంలో
కుచ్చిళ్ళ స్థానాన జీన్స్ చేరింది
రూపాయి కాసంత బొట్టు దోస గింజయింది
ఇళ్ళు కొలువుల నడుమన నడుస్తున్న
ఆమె పాదాలకు
మువ్వలు లేవని
సాంప్రదాయపు సవ్వడి లోపించిందని
గగ్గోలు పెడుతున్నారు మరికొందరు….
ప్రవీణ గారు…పోయెం బాగుంది
‘కవి సంగమం’ చర్చ ఈ పోయెం రాయించిన్దా మీతో?
కోడూరి విజయకుమార్ గారు @ 🙂
అవునండి, కవి సంగమం చర్చే ఈ కవితను రాపించింది. ఈ మధ్య స్త్రీ వస్త్రధారణ పెద్ద టాపిక్ అయిపొయింది. మన సంస్కృతి, సంప్రదాయం…చివరకు మన సంస్కారం అంతా పాపం స్త్రీల దుస్తుల్లోనే ఉన్నట్టు గగ్గోలు పెట్టేస్తున్నారు. అర్థ నగ్న వస్తధారణకు, సౌకర్యావంతమైన వస్త్రాలకు తేడా తెలిదా వీరికి అనే అనుమానం కూడా వస్తుంది. జీన్స్ కి చిర కుచ్చిల్లకు పోలికలు.
Thank you andi.
whatever it may be comparison is good:-)
Thank you Padmarpita garu.
concept bhale baagundi…