సీతమ్మ వాకిలిలో సిరిమల్లె చెట్టుకు పూయని పువ్వులు


సీతమ్మ వాకిలిలో  సిరిమల్లె చెట్టుకు పూయని పువ్వులు

మొత్తానికి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూసేసా……
ఒక్క మాటలో తేల్చేసి చెప్పాలంటే, మన వాళ్ళు మంచి అనుకునే ఓ మాదిరి సినిమా కోసం ఎంతగా  మొహంవాసిపోయి ఉన్నారో అర్థమయింది.

శాడిస్టిక్ విలన్లు, ఆకాశంలో నుంచి ఊడిపడే హీరోలు, షోకేస్ రబ్బరు బొమ్మ హీరోఇన్లు…డిష్యం డిష్యుం ఫైట్లు, వెకిలి కామిడీ, మీనింగ్ లెస్ పాటలు వుండే సినిమాలతో దిక్కుతోచక అవే దిక్కులు చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకులకు సీతమ్మ వాకిలి సిరిమల్లె చెట్టు వాన జల్లు, చిరు జల్లు కాదు కానీ…చేత్తో నీళ్ళు చిలకరించినట్టు ఉంది అనుకొవొచ్చు అని నేననుకుంటున్నా…..

హై  జంపులు, లాంగ్ జంపులు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఈ సినిమా. కుటుంబ నేపధ్యం ఉండటంతో సినిమా బాగుంది అని అనిపించేలా  చేస్తుంది.
కధలోకి వెళ్ళాలంటే..అసలు కధే లేదు!

నాకు వింతగా తోచిన, గుర్తున్న కొన్ని విషయాలు…

1. అన్యోన్యంగా ఉండే కుటుంబంలోని తల్లి పెద్ద కొడుక్కి ఏదన్నా ఉద్యోగం చూసుకో అని చెప్పటానికి బయపడుతూ వుంటుంది!!
2. నానమ్మను, ప్రియురాలిని మన చిన్నోడు,పెద్దోడు ఏమేవ్, వసేవ్ అని పిలుస్తూ వుంటారు!!!
3. నేను రెక్కలు ఇచ్చాను అని చెప్పే తండ్రి కొడుకులిద్దరూ పెళ్లీడు వయసొచ్చినా ఇంకా జీవితంలో సెటిల్ అవ్వరు!!
పైగా ఎవరన్నా ఏం చేస్తున్నావ్ అని అడిగితే కోపం తెచ్చేసుకుంటూ వుంటారు!!

ఈ జీవితంలోనే వీడు నీకు అన్న, వాడు నీకు తమ్ముడు లాంటి  కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.మహేశ్ నటనలో sharpness బాగుంది.
ఏదైనా కానీ, మంచి ఉద్దేశ్యంతో తీసిన సినిమా అయినా కుడా కధ బలంగా లేకపోవటం, కుటుంబ విలువలను, బంధాలను లోతుగా చూపించే దృశ్యాలు లేకపోవటంతో ఆకట్టుకునేలా లేదనిపించింది నాకు.

This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

10 Responses to సీతమ్మ వాకిలిలో సిరిమల్లె చెట్టుకు పూయని పువ్వులు

 1. david says:

  ప్రవీణ గారు నేనూ ఈ మధ్యనే ఆ సినిమా చుసాను….నాది కూడా సేం అభిప్రాయం. అసలు ఆ సినిమా ద్వారా ఏం మెసెజ్ ఇవ్వాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు.

 2. anu says:

  meeru movie tho connect avva leka poyaru..,mi first doubt yenduku cheppadu ante bada padutadu yemo ani ala ne chinnodu tho baga matladuthadu,close ga untadu kada vadu chebithe vintadu yemo ani asha.
  eka 2)ala pilavadam prema tho ne..aa prema piliche valaku matrame artham avutundi meeku
  yevaru ayina chala istam unte prema ga muddu perlu tho pilustaru kada ala..
  eka 3)software 2008/2009 lo baga padi poyindi baga chadive valaku jobs raledu,first class degrees untayi market bagundadu recission antaru jobs ravu,vastundi yemo ane asa ala try chestunna time lo yem chestunnav?yedo okati chusuko ante kopame vastundi.
  may be mi life antha happy ga undavatchu correct time lo job,marriage ala but chala mandi jeevithalu ee movie lo unnatle untayi.

  I said my views and opinions.If i said any thing wrong or my words made you anger iam sorry

 3. anrd says:

  * ప్రవీణ గారు, నా పేరు అనూరాధ. అయితే ఇక్కడ anu పేరుతో వ్యాఖ్యానించినది నేను కాదు.
  * నేను కూడా ఈ సినిమాలో నిరుద్యోగసమస్య గురించి నిన్న ఒక టపాను వ్రాసాను.
  * అందుకని పై వ్యాఖ్యను కూడా నేనే రాసానని మీరు అనుకుంటారేమోనని ఇదంతా రాసానండి. ఈ anu ఎవరో నాకు తెలియదు.
  * ఇలా జరగటం ఆశ్చర్యంగా ఉంది.

 4. అర్జున రావు కర్నాటి says:

  ఆద్యంతం హింస ,అశ్లీలం చూపించి ,చివరగా కొంత మంచిని చెప్పే ఎన్నో మేటి తేలుగు సినిమాల కంటే ఈ సినిమా చాల బావుంది..మనమేం చదువుతున్నామో తెలియకుండా చదివి నిరుద్యోగులుగా నిలిచి పోయే ఎంతో మందికి (ఉద్యోగా మార్గాల గురించి చెప్పలేదు కానీ )ఓ కనువిప్పుగా ఉండాలి అని ఆశించి తీసిన సినిమా ఇది.ఇంకా కుటుంబం లో ఉండే ఆత్మీయత ,అనురాగం ,పెద్దరికం, గురించి కొంచెమైన వివరించిన సినిమా ఇది..మీరన్నట్టు కథ మాత్రం లేదు…అశ్లీలత లేకుండా,హింస లేకుండా ఓ పెద్ద సినిమా తీయడం చాల కష్టం..శేఖర్ కమ్ముల గారిలా చిన్న సినిమా లు తీయ వచ్చు..

  ఏదైనా నిర్మాతల సాహసం ఫలించింది..ఓ చక్కటి సినిమా కోసం వేర్రేత్హి ఉన్న జనానికి,అంత మంచి సినిమా చూయించ లేక పోయినా కుటుంబ సమేతంగా ఇంట్లో టీవీ లు కూడా చూడ లేక పోతున్న ఈ రోజుల్లో ,అందరూ కలసి వెళ్ళే సినిమా తీసారు..ఏదైనా మీరు రాసింది చాల వరకూ కరెక్టే ప్రవీణ గారు..థాంక్స్

 5. Hari Krishna says:

  Aa cinema lo ‘Seetamma’ gaaru tappa andaroo baagaane chesaaru anipinchindi. Message emee lekapoyinaa enjoy chesaanu…. Pandagaki maa ooru vellinappudu choosaanu, edo maa vaallato saradaagaa…..

 6. Anonymous says:

  chetta cinimalu istapadevariki ee cinema nacchadu………………….

 7. Anonymous says:

  yedi yemaina kani, telugu cinema ni udharinchandi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s