ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin


ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin.

images

ఛాన్స్ దొరకటం పాపం….మా భారతీయత, మా సంస్కృతీ, స్త్రీ దేవత, పూజలు, మా కుటుంబాలు, మేము అంటూ అబ్బో ఓ లెవెల్లో గొప్పలు చెపుతాము.స్ శ్ శ్స్స్స్ స్స్స్ ……మెల్లగా , ఇంక మన ముసుగులు తియ్యాల్సిన సమయం వచ్చినట్టుంది కదూ! (పర్లేదు..పర్లేదు…తెలుగు బ్లాగ్ కాబట్టి పరాయి వారు చదవర్లే.)

ఆరు గజాల చీర, రూపాయి కాసంత బొట్టు, డజను మట్టి గాజులు, మూరెడు పువ్వులే భారతీయతకు నిదర్శనం అనుకునే ఓ మహా మేధావుల్లారా…..కండువాలు, పంచెలు, తలపాగాలు గురించి మాట్లాడరే?
పొందూరు ఖద్దరు పంచె కట్టుకుని యమహా బైకు జామ్ జామ్మని దూసుకుపోగలరా?
సామి….అంత చిన్న కారణాన్ని వదిలేసి ఎందుకయ్యా ఎగిరెగిరి పడతారు?
జీన్స్, పాంట్స్, షర్ట్స్ లో అసభ్యత కనిపించిందా? సరే!
మరి చీరల్లో అసభ్యత లేదా? ఓహో..భారతీయత అడ్డోచ్చిందా!
దుస్తుల్లా తీసి పారేసే సంస్కారమా మనది?

అర్థనగ్న వస్త్రాలతో నటించే నటీమణులను, అలాంటి పాత్రలను సృష్టిస్తున్న దర్శక నిర్మాత మహాశయులను, ఆ సినిమాలను ఎగబడి చూస్తున్న ప్రేక్షకులను తిట్టండి,తాట తియ్యండి.

అబ్బాబ్బే…ఇలాంటివి మనమెందుకు చేస్తాం? మనదసలే విశాల హృదయమును, సువిశాల భారతీయము కదా!

కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో ఎవరన్న ఏమన్నా అన్నారో మన మనోభావాలు ఆఘమేఘాలపై విచ్చేసి కించపరచబడతాయి, ఖండ ఖండాలుగా ఖండించబడతాయి.

షేవింగ్ క్రీం దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ దాకా స్త్రీని భోగ వస్తువుగా చిత్రించబడినప్పుడు, రింగ రింగా పాటల్లో అసభ్య పదజాలం వినిపించినప్పుడు, సినిమాల్లో వ్యాపార వస్తువుగా, టీవీ సీరియళ్ళలో కుటుంబ విలనిగా దర్శన మిచ్చినప్పుడు…అదంతా వినోదం, వినోదాన్ని వినోదంగానే చూడాలనే మేధావితనం మనది.
ఓ మేధావుల్లారా ……Throw this mind set on dust bin.

ఏమిటీ??!!!
“సమాజం” చేతిలో అమానుషంగా చంపివేయ్డ్డబడ్డ ఆ అమ్మాయి ఆ దుర్మార్గుల చేతులు పట్టుకుని, మీరు నా సోదరుల్లాంటి వారు, నన్ను వదిలెయ్యండి అని వారి కాళ్ళపై పడివుండాల్సిందా??!!
అయ్యా మేధావి…గదిలో తలుపేసి కొడితే పిల్లి సైతం తిరగబడుతుంది. ఇంత చిన్న విషయం తెలియాలంటే, వేదాలు పురాణాలు చదవక్కరలేదు, స్వామిజిలు కానక్కర్లేదు.
కేవలం..కేవలం…వివేకం, సంస్కారం వుంటే చాలు. దురదృష్టవశాస్తూ మూర్ఖత్వం రాజ్యమేలుతుంది మన భారతంలో.

అదేమిటో?..సమాజంలో ఏ చెడు జరిగినా స్త్రీయే కారణమంట! ఆమె పిల్లలను సరిగ్గా పెంచట్లేదంట. మరి పురుషులు ఏ చేస్తునట్టు? బిడ్డ శారీరకంగా తల్లి నుంచి వేరు పడ్డాక, ఆ బిడ్డను సాకే భాద్యత తల్లి తండ్రి ఇద్దరిదీను.
తండ్రి తల్లిని ట్రీట్ చేసే విధానం నుంచే ఆ కొడుకు స్త్రీని గౌరవించటం నేర్చుకుంటాడని మన పురాణాలు చెప్పలేదా?

మనకు ఇదో భావ దారిద్ర్యం…పాశ్చాత్యం, పాశ్చాత్యం… పాశాత్య పోకడలు.

అదేమిటో..ప్రపంచంలో భారతీయులు మాత్రమే కాపురాలు చేస్తునట్టు, మనకు మాత్రమే కుటుంబాలు వున్నట్టు తెగ ఉదర కొట్టేస్తారు. మన గృహ హింస గురించి మాట్లాడరే? ఇంట్లో నరకాన్ని అనుభవిస్తూ సామాజిక కారణాల చేత బయటపడలేని అబాగ్యులు (స్త్రీలు, పురుషులు) ఎందఱో. చీటికీ మాటికీ విడిపోని కాపురాలు మనవి అన్నది ఎంత నిజమో, చిత్కారాలు బరిస్తూ సాగుతున్న జీవితాలు అంతే నిజం.

స్త్రీ ఉద్యోగం, సంపాదన అన్నది కంపూటర్లు వచ్చాక మొదలవ్వలేదు మహా ప్రభో! పల్లెల్లో పొలాల్లో కూలి పని చేస్తున్న ఆడవారు మీరు, మేము పుట్టక ముందు నుంచే వున్నారు.

స్వేఛ్చ అనే టాపిక్ రాగానే…. వెంటనే పబ్బులు, క్లుబ్బులు అంటూ మాట్లాడతారు. ఒక వర్గాన్ని తీసుకొచ్చి స్వేఛ్చ దుర్వినియోగం అంటూ వాపోతారే! ఆ వర్గం సమాజంలో సగటు స్త్రీని represent చెయ్యదని మనవారికి తెలిదా??

ఉరేయ్యాలి , చంపెయ్యాలి, నరికేయ్యాలి…….ఆపండి ఆపండి …..ఆపండాపండి…
కోర్టులతోనో, శిక్షలతోనో సమాజం బాగు పడుతుందనుకుంటే…అసలు ఈ సమాజం పాడయ్యేదే కాదు.

తియ్యండి ముసుగులింక! మన మూలల్లో వున్నా హిపోక్రసిని ఊరేయ్యండి…..

This entry was posted in కష్టం, ప్రజాస్వామ్యం, మహిళ, వ్యాసాలు, Uncategorized. Bookmark the permalink.

19 Responses to ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin

  1. Sekhar says:

    Good one! Definitely they have to throw their minds in dust bin.

  2. Anonymous says:

    Praveena Garu, finally someone has guts to say something about this hypocracy. everybody talks about women and their responsibilities etc its about time everybody open their eyes and act with a bit of responsibility.

    • ఎదుటి వారి బాధ్యతల గురించి అందరు నీతులు చెప్పేవారే! ఎవరు వారి బాధ్యత గురించి మాట్లాడనే మాట్లాడరు. తుమ్మినా దగ్గినా స్త్రీ లదే తప్పు.. Thank you.

  3. Mauli says:

    ఓంప్రదం అద్దిరిపోయింది ప్రవీణా. అస్సలు ఎక్కడా టెంపో తగ్గలేదు. ఎదురుగా నిల్చోని తిట్టేస్తున్నట్లు ఉంది.

    @స్త్రీ ఉద్యోగం, సంపాదన అన్నది కంపూటర్లు వచ్చాక మొదలవ్వలేదు మహా ప్రభో!

    wow, ultimate !!

  4. ఉరిశిక్షలు వేసినంతమాత్రాన నేరాలు తగ్గవు. తనకి తప్పకుండా శిక్ష పడుతుందనిపించినప్పుడు లేదా తొందరగా శిక్ష పడుతుందనిపించినప్పుడు నేరస్తుడు భయపడతాడు కానీ కేవలం కఠినమైన శిక్షలు చూసి భయపడడు. మన దేశంలోని రేపిస్ట్‌లలో 25‌% మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని పోలీసులే ఒప్పుకున్నారు.

    • ప్రవీణ్ గారు@ఒక వైపు ఢిల్లీ సంఘటనతో దేశం గగ్గోలు పెడుతూనే వుంది , మరో వైపు ఈ అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. స్త్రీ కి ఆత్మా రక్షణ, పురుషుడికి స్త్రీ ని గౌరవించటం నేర్పించాల్సిన సమయం ఇది.

      • ఉరి శిక్షలు అమలులో ఉన్న దేశాలలో సింగపూర్ మాత్రమే నేరాలని తగ్గించడంలో సఫలమైంది. అక్కడ ప్రాథమిక ఆధారాలు దొరికినా శిక్షని అమలు చేస్తారు. మన ఇండియాలాగ “పది మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క అమాయకునికి కూడా శిక్ష పడకూడదు” అనుకుని నేరస్తులని వదిలెయ్యడం జరగది.

  5. G says:

    మీరు మాత్రం ఆపొద్దు. ఇలాగే కొనసాగించండి ఈ ఆవేశం. ఆలోచనా వివేకం. బాగుంది. నైస్ one

  6. Anonymous says:

    g8 article madam

  7. Srinivasannaji says:

    We have tour throw our mindsets & our system .. Good prveena keep it up

  8. david says:

    చాలా బాగ చెప్పారు ప్రవీణ గారు…నేను మీ అభిప్రాయంతో ఏకిభవిస్తున్నాను. పురుషాధిక్య విష సంస్కృతి మారనంత వరకు ఇది ఇంతే..

  9. Anonymous says:

    అయ్యా మేధావి…గదిలో తలుపేసి కొడితే పిల్లి సైతం తిరగబడుతుంది. ఇంత చిన్న విషయం తెలియాలంటే, వేదాలు పురాణాలు చదవక్కరలేదు, స్వామిజిలు కానక్కర్లేదు.
    కేవలం..కేవలం…వివేకం, సంస్కారం వుంటే చాలు. దురదృష్టవశాస్తూ మూర్ఖత్వం రాజ్యమేలుతుంది మన భారతంలో.
    ———————————
    aa samskaram aaa vedaalu, puraanala nunchay nerchukovaali or parents nunchi nerchukovaali. samajam nunchi nerchukotaaniki ledhu ippudu unnaa paristhithi.

    • నిజం చెప్పాలంటే ఈ ఉదాహరణలో పిల్లికి ఎవరు నేర్పించారు. బహుసా ప్రకృతే నేర్పిస్తుంది తిరగబడమని. మన మేధావులు లొంగిపొవల్సిన్ది అని చెప్పటం చాలా దారుణం.

  10. SOMASEKHAR says:

    manchi artikal .. marpuravali ( nalo undi )

    ఎదుటి మనిషి వైపునుండి ఆలోచిస్తే … ప్రతి మనిషి గొప్పవాడు ..

    (వారి పరిస్థితి, పెంపకం వారిమార్పు వస్తుంది : ఉదా :-ఒక పులిపిల్ల , గోర్రెలా గుంపు లో చేరి గొర్రెగా మేలుగుతుంది
    … నువ్వు పులివి ..అని రక్తాన్ని ఎరాచుసినప్పుడు ..ఆ పులి , పులిలా చంపడం మొదలెడుతుంది .. )

    ఎదుటి వారి కష్టాలు మరియు భావాలూ అర్థం చేస్కొంటే …. వారి గురించి తెలుస్తుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s