ఓ ఆడ కూతురా


ఓ ఆడ కూతురా 

vic

ఇప్పుడేదో హడావిడి చేస్తున్నారు
ఉరేయ్యాలంట!
ఎవరెవరిని ఉరేద్దాం?
పురాణాల దగ్గర మొదలుపెట్టి
యుగ యుగాలుగా లెక్కిస్తూ పొతే
ఏనాటికి తేలేను ఈ సంఖ్య?
ఈ లోపు ఇంకెన్ని కౌరవ సభలో!
ఎందరి పడతుల కన్నీటి ప్రళయాలను
తనలో కలిపేసుకుందో ఈ కాలం.
సముద్రంలో జారిపడిన మరో కన్నీటి చుక్కవు నువ్వు…అంతే!
* * * * * * * * * * * * * * *
ప్రగతంటే?
చదువని, ఉద్యోగమని తృప్తి పడ్డావా?
ఓ నా పిచ్చి తల్లీ
ప్రగతంటే ….విశాలత్వం, సమానత్వం
కలలు కనకు!….అదెప్పటికీ సాధ్యం కాదు!
* * * * * * * * * * * * * * *
స్వేచ్చంటే?
“ఇది నేనని”, నిర్భయంగా బతికే హక్కు
బయట సంగతి పక్కన పెట్టు
ఇంటి గుట్టు విడమర్చుకో! ఇట్టే తేలిపోతుంది
కొలతలు మాత్రమే పెరిగిన పంజరంలో ఎగురుతూ
అదే స్వేచ్చని మురిసి పోతున్నవ్ కదూ!
* * * * * * * * * * * * * * *
ఓ నా ఆడకూతురా
దుస్తుల్లో వంపులు చూసే కళ్ళకు
చుడీదారైతే నేమి? జీన్సు ప్యాంటైతేనేమి? స్కట్టైతేనేమి?
మద మెక్కిన మృగాల చేతిలో
చీరకొంగు చాలదూ?
* * * * * * * * * * * * * * *
ఉద్వేకం, ఉక్రోషం
నిరసనలు, నినాదాలు…ఎంత కాలం?
ఒక్క మాట, మరోలా అనుకోకు
ప్రాణం నిలిచి ఉంటే….
సమాజం బతకనిచ్చేదా?
మరో మాట..తప్పు గా అనుకోకే
సమాజం అంటే ఎవరు?

This entry was posted in కవితలు, కష్టం, మహిళ. Bookmark the permalink.

13 Responses to ఓ ఆడ కూతురా

 1. Rajani says:

  Wow…so touching. Especially, Mundu intiguttu vidamarchuko.. Kolatalu maatrame perigina panjaram .. Hatsoff for these words Praveena. Bratiki unte samajam bratakanicheda? No..ide best. Maanasikam ga prati roju rape cheyabadutu pillala baagu kosam Istam leni manugada saagistunna abhaginilu enta mandi Leru?

  • Rajani garu@ “Have you been following news “, I asked my frd
   “hmmmm…being a lady I have enough at home. So, don’t ask me to watch news”, that’s her response.I am left with no words…ఇది ఎందఱో ఇంటి గుట్టు. Thank you.

 2. Mauli says:

  @ప్రగతంటే?
  చదువని, ఉద్యోగమని తృప్తి పడ్డావా?
  ఓ నా పిచ్చి తల్లీ
  ప్రగతంటే ….విశాలత్వం, సమానత్వం
  కలలు కనకు!….అదెప్పటికీ సాధ్యం కాదు!

  —————————————————–

  క్లారిటీ లేదు ప్రవీణా , నేను ఆలోచిస్తున్నదే మీరు వ్రాసారేమో అని అనుకున్నా ఖచ్చితత్వం లేదు.
  ప్రగతంటే ….విశాలత్వం, సమానత్వం అని మీరు చెపుతున్నారా ? లేకా అలాంటి భావాలన్నీ కలలు అని చెబుతున్నారా. మీరు చెప్పాల్సినది మొదటిది అని నా అభిప్రాయం. వీలయితే సరి చెయ్యండి.
  ‘ఓ ఆడ కూతురా’ అనడం కాస్త ‘అబల ‘ అనే అర్ధాన్ని ధ్వనిస్తుంది. మనం ఈ స్థితి ,ఆలోచన ను వదిలెయ్యాలి. ఏమంటారు ?

  • Mauli garu@ I am sounding dull here. ఈ ఢిల్లీ సంఘటన మొదటది కాదు, చివరదు కాదు. చట్టలతోనో, కటినమైన శిక్షలతోనో మార్పు వచ్చేస్తుంది అని నమ్మితే మనల్ని మించిన ఎస్కాపిస్ట్ లు మరొకరు వుండరు. మన మైండ్ సెట్, మన attitudes మారనంత కాలం మన సమాజం ఇలాగె వుంటుంది. ఆ ఆశావాదం లేక ఓ ఆడ కూతురా అన్నాను.
   ప్రగాతంటే చదువని, ఉద్యోగం కాదు పిచ్చి తల్లి…విశాలత్వం, సమానత్వం. ఇవి రెండు ఎప్పటికి రావు అని చెపుతున్నాను.
   ఈ మాత్రం హోప్ వున్నా , “ప్రాణం నిలిచి ఉంటే…. సమాజం బతకనిచ్చేదా?” అని అడిగేదాన్ని కాదు.

 3. Anonymous says:

  wow super mam

 4. Nagendra says:

  Chala baga chepparu…vyavasthalo..vidanaalalo..manashullo ravali maarpu..chattalu, sikshalu manushulni marchalevu..koncham bayapettagalavu anthee…

  Mee Blog chaduvuthuntee chala anadamga undandi..naaku ilanti alochanalu unnayi kaani..meeru rastunna vidanam..vishaymlo spashtatha chala chala bagunnayi…

  • Thank you Nagendra garu. చట్టాలు, కటినమైన శిక్షలు మార్పును తీసుకొస్తాయి అనుకుంటే, మనకు మించిన ఎస్కేపిస్ట్ లు మరోకరుండరు. Our mindset and attitude plays a role here.

 5. heart touching…i agree with you

 6. david says:

  చాలా బాగా రాశారు..

 7. Thank you youngfemiistsdavidraj, david garu.

 8. ఒక ఆడపిల్ల బట్టలిప్పి గంతులేస్తుంటే వినోదమా….మనింట్లో కూడా అలాంటి పిల్లలే ఉన్నారే…అటువంటిది కాదూ…ఇష్టపడో డబ్బులకాశపడో చేస్తు౦ద౦టున్నారేమో . బుద్ది చెప్పడం మాని గుడ్లు మిటకరించి చూస్తున్న జనాల నేమనాలి. అలాంటి అసభ్య చిత్రాలను తీస్తున్న దర్శకులను ఏ వైద్యుడి దగ్గరకు పంపించాలి. తమ నటనతో ప్రజలను మెప్పించలేని హీరోలు ఐట౦ గర్ల్ అడ్డుపెట్టుకుని హీరోయిన్ లను అర్ధ నగ్నంగా చేసి తీసిన సినిమాలు హిట్టయితే ఆ ఘనత తమదే అంటున్న హీరోల నభిమానించే అభిమానులనేమనాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన వేలితో మన కన్నే పోడుచుకు౦టున్నాం.

  • సినిమాలు మాత్రమె కాదు జ్యోతిర్మయి గారు, టీవీల్లో వచ్చే ఆడ్స్ కుడా అంతే. NDTV discussion లో ఒకావిడ అంటున్నారు, Post independent cinimaa portrayed women as sati saavitri and as we proceed nowadays cinema portraying women as item girl. Movies are not just entertainment..it has effect on society too

 9. satya says:

  super!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s