చిన్నప్పుడు, ఆకాశమంటే ఏంతో ఇష్టం!
నీలం రంగును గుమ్మరించి
పలుచగా పరిచి
అక్కడక్కడా తెల్లటి మేఘాలను అలకరించినట్టు
తలపించే పగళ్ళు…..
చీకటి తెరకు
జాబిలిని తగిలించి
నక్షత్రాలను జల్లినట్టు
వెన్నెలను కురిపించే రాత్రుళ్ళు….
ఓహ్…ఎన్నెన్ని ఊహలో…..
ఇంద్రధనుస్సు రంగుల కధ తెలుసా?
నోటుబుక్కులోని తెల్లకాగితానికి రంగులద్దాక
వాటర్ కలర్ డబ్బాలో
మిగిలిన నీటి చుక్కలను
ఆకాశంలోకి విదిలిస్తే
అవే ఇంద్రధనుస్సు రంగులయ్యాయంట!
నల్లటి మబ్బుల్లో నీళ్ళుంటాయని
పాఠాలలో నేర్చుకున్నా
కురిసే ప్రతీ చినుకు అధ్బుతమే నాకు!
ఇప్పటికీ, ఆకాశమంటే అంతే ఇష్టం
అందాన్ని మించిన అనంతాన్ని
ఆ అనంతంలో ఇమిడీకృతమైన అందానికి
ప్రతీకైన
ఆకాశమంటే ఇప్పుడు ఇంకా ఇష్టం….
చిన్నప్పుడు ఆకాశం గురించి ఎన్ని సందేహాలో!ఆకాశం నీలం రంగులోనే ఎందుకుంది?చంద్రుడి లో ముసలమ్మ ఎందుకుంది?చిన్నప్పటి సంగతులన్నీ గుర్తొచ్చాయి.ఇంధ్రదనస్సు చూసి చాలా ఆనందించేవాళ్ళం.వర్షం పడినప్పుడు పడవల్ని చేసేవాళ్ళం.ఇంద్రధనుస్సు రంగుల కధ చాలా బావుంది.
చైతన్య @ చంద్రుడిలో ముసలమ్మా…భలే గుర్తుతెచ్చారు. ధన్యవాదాలు
నాకు కూడా భలే ఇష్టం:-)
పద్మార్పిత గారు @ same పించ్ 😉 ..ధన్యవాదాలు
adbhtam ga undi praveena garu..Chinnappudu arubayata padukoni aa anatamaina aakasanni chustu ascharyapoyina rojulu, allukunna kadalu..aa anadam gurutu techaru. ipudu..nakshatralani chusi enni rojulu ayindo..aakasam vaipu chuse teerika edi? Thanks for a lovely poem.
అవును రజని గారు, చిన్నప్పుడు ఆరుబయట పొడుకుని ఆకాశం వైపు చూస్తూ, నక్షత్రాలు లెక్కపెడుతూ నిద్రలోకి జారుకోవటం ఎంత అధ్బుతమైన అనుభవమో కదూ. వెన్నెలను చూసి ఎన్నాళ్ళయిందో? ధన్యవాదాలు
అందాన్ని మించిన అనంతాన్ని …
ఆ అనంతంలో ఇమిడీకృతమY న అందానికి ప్రతీక ఐనా ఆకాశం అంటే నాకు కూడా చాల చాలా ఇష్టం ప్రవీణ గారు …
అవీ చీకటి తెరకు జాబిలిని తగిలించి నక్షత్రాలను జల్లినట్టు వెన్నెలను కురిపించే రాత్రుళ్ళు………ప్రవీణ గారు …