అక్వేరియం కధ
నాకెప్పటి నుంచో ఓ బుజ్జి అక్వేరియం కొనుక్కోవాలనే కోరిక ఎప్పటికప్పుడు postpone అవుతూనే ఉంది . ఇంకా లాభం లేదు, ఈ వీకెండ్ కొనాల్సిందే అని అల్టిమేటం జారీచేశా.
“కొనటం సరే. ముందు క్లీనింగ్ సంగతి తేల్చు”, మిస్టర్ పతి పార్లమెంట్ ప్రశ్న వేసారు. హన్న …..ఎంత అనుమానం??!! (కాదులే…నమ్మకం..హి హి హి )
“ఈ సంగతి సెపరేట్ గా తెల్చేదేముందోయ్. అందరం కలిసి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం విజయవంతం చేద్దాం”, అన్నా.
“ఆ…ఆ …..అందరమా?? నేను ముందే చెపుతున్నా….”
“సరే… సరే… ఆ సంగతి నిదానంగా తేల్చుకుందాంలే. ముందు కొనుక్కుందాం..పద”, (హమ్మయ్య మాట మార్చేసానుగా!)
మొత్తానికి అందరం బయల్దేరాం. బుజ్జి బుజ్జి ఫిషులు కొనుక్కుందాం అని బుడంకాయిలిద్దరికి చెప్పా.
“నాకు turtle కావాలి”, బుడంకాయి నెంబర్ వన్ ఆర్డర్ పాస్ చేసాడు.
“turtle ఎందుకురా? చేపలు చాల్లే” , అన్నా.
“పోన్లే ఆ చేపల తోట్టిలోనే ఉంటుందిగా. కొందాం “, వాళ్ళ నాన్న సమర్ధింపు.
“అయితే…నాకు రాబిట్ కావాలి”, బుడంకాయి నెంబర్ two నిర్ణయం.
“ఈ రాబిట్ ఎక్కడ నుంచి వచ్చింది కొత్తగా”, అడిగా
“నాకేమో రాబిట్, నా బ్రదర్ కేమో turtle “…… ఓహో!
“అమ్మకేమో చేపలు, ఒక కొడుక్కేమో కుందేలు, ఇంకో కొడుక్కేమో తాబేలు….నేనొక్కడినే తక్కువ? నాకు కావాలి……మా వురి నుంచి ఓ గేదెను తెప్పించుకుంటా. బాల్కనిలో కట్టేద్దాం. చక్కగా కమ్మటి చిక్కటి పాలు ఇస్తుంది. ఏమంటావోయ్… కుడితి డ్యూటీ నీదే మరి”, మిస్టర్ పతి వ్యంగాస్త్రం.
“చాల్లే జోకులు”, అని విసుక్కునే లోపే షాప్ దగ్గరకు వచ్చాం.
అక్కడ రకరకాల చేపలు, గాజు తోట్టెలు చూస్తూ, “ఖరీదెంత?” అని అడిగితే……ఓ లెవెల్లో చెప్పాడు.
“ఏంటి..ఇంత ఖరీదా?”, నా ఆశ్చర్యం.
“పోనీ ఓ పని చెయ్యరాదు…మీ విజయవాడ బిసెంట్ రోడ్డులో తక్కువ ధరకు దొరుకుతుందేమో, అక్కడ కొనుక్కోరాదు”, మళ్లీ కామిడి.
“చాల్లే సంబడం…ఇంకో నాలుగైదు షాపుల్లో చూసి, అప్పుడు కొందాం”, అన్నా
“నాలుగైదు షాపులా??!!!….బట్టల కొట్టులు , నగల దుఖానాలే అనుకున్నా…ఇలా కూడా తిప్పుతావా”……………..
అప్పటికే లేట్ అయిదండి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ వచ్చింది. Wish me luck….
Update: అక్వేరియం కోనేసామోచ్ 🙂 🙂
🙂 good luck for next week.
best of luck mam
శుభస్య శీఘ్రం! నాకు coral reefs చాలా ఇష్టం 🙂 అవి కూడా చేర్చేద్దురూ 😉
రసజ్ఞ గారు, అదేంత పని..చేర్చెద్దాం, turtle కి తోడుగా వుంటుంది. 🙂
మరి కల నిజమాయెగా పాట పాడేశారా? Finally what came into the aquarium
Pingback: మొక్కను విరగ్గోట్టిందేవరు? | మనసుతో ఆలోచనలు…