ఆ క్షణాలు


ఆ క్షణాలు

అనుభూతి  కోసమే జీవించే ఆ క్షణాలను
మనసు కెమేరాతో ఫోటోలుగా తీసి
మధి  ఆల్బంలో భద్రంగా దాచేసుకోవాలి…

అపుడో ఇప్పుడో
మనసు భారమైన క్షణానో
కన్నీరు ఉప్పొంగుతున్న  నిమిషానో
దాచుకున్న ఆల్బం తెరచి
ఫోటోలను మునివేళ్ళతో సుతారంగా స్పర్శిస్తే చాలు…
జీవితం అందమైనదే, కాదన్నదెవరు?
ఈ స్థితా లేక కాలమా?
రెండు కరిగిపోయేవేలే…
ఇలా అప్పటికప్పుడే
విత్తనం మొలకెత్తి  ఆశ  చిగులేస్తుంది

అందుకోసమే
దృక్పధపు  అల్మరాను  మొదట్లోనే విశాలంగా నిర్మించుకోవాలి
ఆల్బం సైజును పెంచుకోవాలి కదూ  మరి…
ఫోటోల లెక్క పెరగాలంటే
అనుభూతి కోసమే ఆ  క్షణాలు జీవించాలి….

This entry was posted in కవితలు, కాలం, జీవితం. Bookmark the permalink.

4 Responses to ఆ క్షణాలు

  1. Rajani says:

    Wow. Praveena garu…..enta bagundante…cheppalenu. Phots evarikosamu kaadu anduke …manakosam…when we go down the memory lane..we feel like …we had great moments once…and life is beautiful.! Thanks for such a lovely poem..

  2. హలో అండీ !!

    ”తెలుగు వారి బ్లాగులు” తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

    వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
    ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ …
    ఒక చిన్న విన్నపము ….!!

    రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

    మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
    మీ అంగీకారము తెలుపగలరు

    http://teluguvariblogs.blogspot.in/

    • దీపావళి శుభాకాంక్షలు..
      మంచి ప్రయత్నం. నా బ్లాగ్ తప్పక చేర్చండి. ధన్యవాదాలు

  3. Anonymous says:

    NICE….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s