నిదుర
అలసట కనురెప్పల మాటుకి చేరినా
కనులు మూతపడవే వింతగా!
నిదుర దరిచేరదే నిర్ధయగా!
నడిరేయి చిక్కటి చీకట్లలోనూ
అరమోడ్పు కనులలో
అదే అలజడి
అవే తలంపులు
అవే సుడులు మడులు
అవే తంత్రాలు, తరుణోపాయాలు
అవే పరిధిలు, ప్రణాళికలు
అవే వృత్తాలు
అంతే వ్యత్యాసాలు….
అమ్ముల పొదితో
ఒడిలో ఒదిగి
ఆదమరిచి నిదుర పోయేదేలా?
యుద్దాంతర విశ్రాంతిలో శాంతి ఎంతో మరి?
విరామంలో సేద త్రిశంకు స్వర్గమే!
ఉండీ లేనట్టుంటే ధీరత్వమే…..
నాన్న బరోసాలోని భధ్రతలో ఇమిడిపోయి
అమ్మ లాలనలో జోలపాట ఆలకిస్తూ
ఆదమరిచి ఈ లోకం మరిచి
హాయిగా, కమ్మగా
బుజ్జాయిల నిదురపోవాలనే ఓ కల….
Chala Chala chalaa bagundi
పరిధి దాటిన ఆలోచనల ప్రపంచ ప్రయాణానికి..
ప్రమేయాలు,ప్రమోదాలు..
కనురెప్ప మాటున కానరాని నిదురమ్మ జాడలు..
baagaa chepparu baavundi
బాగుంది. కొంచెం ఫ్లాట్ గా వుందేమో అనిపించింది,..