వెన్నెలేది?
పౌర్ణమి రాత్రుళ్ళ లో
జోగుతూ, ఉలిక్కిపడుతూ జాము గడుపుతున్న
కనురెప్పలనడుగు వెన్నెలేదని?
నియాన్ లైట్ల వైపు అయోమయంగా చూస్తూ
బెడ్ లాంప్ వెలుగులో చరిత్ర పుటలను తిరగేస్తూ
నిఘంటువు వెతుకులాటలో రేయంతా గడిపేసే
నేటి కనులలో వెలుగేది?
ఎంతటి రసహీన జీవితం…..
(సిటీలో పౌర్ణమి రోజున కుడా వెన్నెలను చూడలేము. స్ట్రీట్ లైట్స్ ముందు వెన్నెల బోసిపోతోంది . సిటీలో బోసిపోయిన మూన్ లైట్ అనే ఆలోచనతో రాసింది.
ఈ రోజుల్లో పిల్లలకు వెన్నెల అంటే ఏమిటో కుడా తెలిదు. ఇది నిజం! నేను నా స్నేహితులను కొందరిని అడిగాను, “మన పిల్లలకు వెన్నెలంటే తెలుసా అని? కొందరు టక్కున సమాధానం చెప్పారు, మరి కొందరు ఆలోచించి చెప్పారు. చివరకు అందరి సమాధానం ఒకటే…)
pattanaalentandi pallellone teliyadam ledu vennelante…?? mi tapaa baavundi