ఈ లోకం ఇంతే
నేనూ ఇంతే
మంచినే చూస్తానో, చెడునే చూస్తానో
అంతా నా దృష్టిలోనే ఉందంటాను.
నీదంతా అమాయకత్వం అని నవ్వేస్తారు!
కాదే!…. నేనేమి చూడాలనుకుంటున్నానో నాకు తెలుసంటే
పాపం మంచితనమంటారు
ఈ పాపం అలంకారమెందుకో??!!
ఈ లోకమూ ఇంతే, అంతు చిక్కనంటుంది!
నేనూ ఇంతే, అవగతం కానిదేముంది?
అంతా ప్రేమమయమే అని తేల్చేస్తాను.
ఇంకెక్కడి ప్రేమ?అంతా స్వార్ధపూరితం
రుజువులు నిరూపణల జాబితా విప్పుతారు.
నిజమే కావొచ్చు…
ఖాలీ కంచాలు దొర్లుతున్నాయి
ఆకలితో అలమటించే మనసు అక్కడ
కొసరి కొసరి వడ్డించు
సూచన కాదు కర్తవ్యం….
ఈ లోకమూ ఇంతే, నువ్వు మారలేదంటుంది
నేనూ ఇంతే, నువ్వూ మారలేదంటాను
మరి తప్పెక్కడ?
నువ్వు మారావని నేనూ
నేను మారానని నువ్వూ
ఒకరిని ఒకరు సాకుగా చూపిస్తూ
అదీ కుదరకపోతే, కాలాన్నే దోషిగా చిత్రించేస్తూ ఉంటాం!
మనం మారొద్దు…
స్వచ్చంగా, స్వేచ్చగా, సూటిగా, సరళంగా….సంపూర్ణంగా జీవిద్దాం.
నువ్వు నేను అందరం ఎదుగుదాం
ఎవరూ ఎగిరెగిరి పడోద్దు
మనందరి మూలాలు మట్టిలోనేనని మరవొద్దు…
kannu inthea..
kanu paapa inthea…
lokam lothu chooDalantea….
Bagudi, Chala chala bavundi praveena.
GUD ONE
BAVUNDI PRAVEENA