స్థితి


స్థితి

ఆనందమూ కాదు, విషాదమూ కాదు
అదో స్థితి
మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే
ఎద మొత్తం  మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే  స్థితి…..స్తబ్దత!
శూన్యత కాదు  స్తబ్దత!

ఈ స్తబ్దతలో
శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది..
సమాధానాల అన్వేషణలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
అక్కడ
ఎన్నాళ్ళుగానో  నిక్షిప్తమైన మణులు
వెలికి వచ్చి నిలదీస్తాయి !
ఆ మాణిక్యాలలో ఏమి వుండదు ….ఒక్క స్వచ్ఛత  తప్ప!

ఒక్కోసారి
ఈ ఏకాంతపు  నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు వారధిలో నడవటం
అత్యవసరం…

This entry was posted in కవితలు, కష్టం, జీవితం. Bookmark the permalink.

3 Responses to స్థితి

  1. sridevi Padala says:

    I know how it feels like…Recently I’ve personally experienced this state…It really feels divine….or best way of saying is actually that it can’t be described in words…just feel it/experience it

  2. satya says:

    అవును…

    స్పష్టత కోసం…
    స్వచ్చత కోసం….
    పవిత్రత కోసం…

    బాగా రాసారు…
    -satya

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s