కస్టమర్ సర్వీస్


కస్టమర్ సర్వీస్

డ్రైవింగ్ నేర్చుకునే రోజుల్లో రోజూ క్యాబ్స్ లో తిరగాల్సివచ్చేది. టాక్సీ ఎక్కి university అడ్రస్ చెప్పిన తర్వాత…ఆప్ ఉదర్ పడతా హై? అనే ప్రశ్నతో మొదలయి , నేను స్టూడెంట్ ని కాదు, ఐ వర్క్ థేర్ అనే సమాధానంతో ఆగకుండా..ఏమి పని? ఎంత జీతంలాంటి పర్సనల్ ప్రశ్నలతో విసిగించే టాక్సీ డ్రైవర్స్ అంటే విసుగ్గా వుండేది.

సమాధానాలు దాటవేస్తూ, ” గవర్నమెంటు ఈ టాక్సీ డ్రైవర్స్ అందరికీ కస్టమర్ ట్రైనింగ్ ఇస్తే బాగుండు” అని మనసులో అనుకునేదాన్ని. (Taxi’s comes under RTA)

కొంత హెల్త్ సమస్యతో ఒక ఫ్రెండ్ specialization చేసిన ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. చూయింగ్ గమ్ నములుతూ, మధ్య మధ్యలో సెల్ కాల్స్ ఆన్సర్ చేస్తూ..పేషెంట్ ప్రాబ్లం ఎంత సిరియస్సో చెపుతున్న ఓ విద్యాధికుడు. ఇంకేం రాయను ఆ డాక్టర్ గురించి??!!

డాక్టర్స్ రోజుకు ఎంతో మంది పేషెంట్స్ను చూస్తూ ఉంటారు. పేషెంట్ కూ వుండే ఆత్రుత, కంగారు ఖచ్చితంగా డాక్టర్ కు ఉండదు, ఉండకూడదు. ముమ్మాటికి పేషెంట్ బాధ అనే emotion పేషెంట్ దే!

డాక్టర్ మోహంలో బాధను వెతుక్కోడు పేషెంట్. sincerity , seriousness, confidence …. Professionalism లేని డాక్టర్ తో మాట్లాడుతున్న ఆ పేషెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అంత పెద్ద చదువు చదివిన ఆ డాక్టర్ కు తెలియకపోవటం లేక పట్టకపోవటం ఎంత దారుణం!

ఎన్నికస్టమర్ సర్వీసు ట్రైనింగ్ క్లాసులకు పంపిస్తే అర్థం అవుతుంది ఈ డాక్టర్ కు, పేషెంట్ తో ఎలా మాట్లాడాలో?

బాడీ లాంగ్వేజ్ లో negligence కనిపించకుడదన్న చిన్న విషయం తెలియని ఈ డాక్టర్ ని ఎలాంటి  కస్టమర్ సర్వీసు ట్రైనింగ్ క్లాసులకు పంపించాలి!!!

This entry was posted in నా అనుభవాలు. Bookmark the permalink.

2 Responses to కస్టమర్ సర్వీస్

  1. the tree says:

    మంచి టాపిక్ ని స్పృశించారండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s