ఆ జ్ఞాపకాలు
ఊగిసలాడుతున్న ఆ జ్ఞాపకాలు
ఊడిపడిపోతే ఎంత బాగుండు!
రెప్పల్లో ఇరుక్కున్న ఆ నలుసు
ఒకేసారి
కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండు!
ఎన్నిసార్లు అనుకుంటానో,
ఆ క్షణాలు తిరిగి రాయగలిగితే చాలని!
ఆ అనుభవాల శకలాలు అసలేం మిగలనట్టు
శిధిలమయితే చాలని!
తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలపులు
పాతుకుపోయిన ఆ గురుతులు
వెంటాడుతూనే ఉంటాయి…
avunandi jnapakalu ante konni ebbandi pedatayi mari konni aanandaanni estayi…baavundi mi kavita
chakkani kavitha,
jnapakalu vetaduthune untai.
cool.
చాలా బాగుంది ప్రవీణ గారు.. అయితే జ్ఞాపకాల్లాంటి personal and private విషయం గురించి కదా ఈ కవిత .. అలాంటప్పుడు ” ఎన్నిసార్లు అనుకుంటామో” అని generic గా కాకుండా “అనుకుంటానో..” అంటే బాగుండేదేమో కదా..!!
అలాగే last stanza లో “..తలంపులు” కంటే “తలపులు” better పద ప్రయోగమయ్యేదేమో..!!!
Thank you Ravi garu. మీరు సూచించిన పదాలు అర్థవంతంగా వున్నాయి. Updated it..
entha bagundo….Jnapakaalu bangaaru gani laantivi….maaaatallo cheppaleni anubhooothi….
JNAPAKALU ANNI KEVALAM JNAPAKALU KAVU . AVI MIGATA JEEVITANIKI PRANALIKALU KUDA KAVACHU. MEE KAVITA BAVUNDI