అబ్సర్డ్ పైయింటింగ్
మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు
కుంచె కొసలకు వేళాడి వేళాడి
ఏ కలనో జారిపడి
అలుక్కుపోయిన రంగుల కలబోత
వృత్తాల గర్భాల్లో అనంతాలు
వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు
మోహమో, వ్యామోహమో
ప్రేమమయమో, ద్వేషపూరితమో
జీవమో, జీవచ్చవమో
ఏమో
ఏవేవో అర్థాలు
అంతులేని అయోమయాలు
హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి
ఆలోచనల అలలు ఎగిసెగిసిపడి
చిక్కు ముడులలో బిగిసి బిగిసి
పాళీ కొనలకు అటు ఇటు ఊగిసలాడి
స్తబ్దత నిశ్శబ్దము నీడలో
చిత్రించబడిన ఆకారం
ఆ మోములో
ఆనందమో విషాదమో ఎవరికెరుక?
వీక్షించిన ఒక్కోమారు ఒక్కో బావం…
ఆచిత్రంలో
అన్నీ ఆద్యంతాలకు పరుగులు తీస్తున్న గీతలే…నా ఆలోచనల్లా
అన్నీ దిక్కులను వెతుకుతున్న రేఖలే…నా ఆశల్లా
అన్నీ శూన్యంలో అంతమవుతున్న ఆకృతులే…మనిషి మరణంలా
మా గోడకు వేలాడుతున్న అబ్సర్డ్ పైంటింగ్
అచ్చు గుద్దినట్టు నాలా………
nice.
However, I’d say the art is more likely surrealist, than absurd.
http://en.wikipedia.org/wiki/Surrealism
http://en.wikipedia.org/wiki/Absurdism
ప్రవీణగారూ,
మనః పూర్వక అభినందనలు. చక్కని విషయం తీసుకుని జీవితానికి అన్వయిస్తూ పోలికలలో పొరపాట్లులేకుండా చిక్కగా రాసిన కవిత ఇది. నాకు బాగా నచ్చింది. మీ దగ్గరనుండి ఇలాంటి మంచికవితలు రావాలని కోరుకుంటున్నాను.
అభినందనలతో