నడి వయసు
ప్రౌడత్వం పెద్దరికాన్ని ఆపాదించుకుని
తెల్లవెంట్రుకై పాపిటలో మెరిసింది.
పెద్దరికం గాంభీరాన్ని తెచ్చిపెట్టుకుని
నుదుటి మడతల్లో అనుభవమైనది.
నిజానికి
జీవితం ఎప్పుడో మొదలయినా
జీవించటం ఇక్కడే ఆరంభమైంది …..
ఆశయం, ఆచరణల నడుమ నలిగే ఆలోచన
నిన్న రేపటిల మధ్య వారధయింది ఇక్కడే…
హక్కు, బాధ్యతల మధ్య బారం తెలిసోచ్చినది ఇక్కడే…
కల, నిజం నడుమ సాక్ష్యం నేడయినది ఇక్కడే…
చదువు నేర్పిన నిబద్ధత
ఆదాయం తెచ్చిన భద్రతల మధ్య
స్వతంత్ర్యం నలిగింది ఇక్కడే…
యవ్వనపు జలపాతం దాటాక
నెమ్మదించిన నదీ ప్రవాహంలో
సుడిగుండాలు ఈదింది ఇక్కడే..
ఆవేశపు అగ్ని పర్వతం చల్లారాక
లావతో ఆకృతులు చేసుకున్నది ఇక్కడే…
సుఖానికి, దుఃఖానికి నడుమ వేలాడింది ఇక్కడే..
నేనెవరో తెలిసింది
నాకేం కావాలో చెప్పింది ఈ వయసే…
ఆశకు, హద్దుకు మధ్య సర్దుకుపోయిన
అసలు సిసలు జీవితం మొదలయింది ఇక్కడే…
By middle age, life gets adjusted between expectations and limitations.
office lo pani leka..google search engine lo telugu blagulu ani kottanu ..ventaney koodali ani..telugu blagula samuhaaram ani vachindi…andulo vetukutu vetukutu..me blog open chesanu…
chala baagunnai me posts.. i impressed a lot anna maata…
Good One.
(As you wrote some do realize their responsibilities but some do cover that with a Hair Dye.)
mimmalni choosthe naaku chaala jalasi, entha baaga study chestharu lifeni……
Excellent.. excellent.. wonderful expression of thoughts..
I was surfing through facebook and came across your poem as one of my friends commented on it. That is a beautiful opportunity for me to read a nice one in telugu after a long time.
Please keep going. I have this blog on my favorites.
V.Nice-
“నిజానికి
జీవితం ఎప్పుడో మొదలయినా
జీవించటం ? ఆరంభమైంది …..”
kadha………wonderful