నా కళ్ళజోడు క(గా)ధ …కొంత సొంత డబ్బా
కాదేది కధకు అనర్హం అన్నట్టు నాకొక కళ్ళజోడు క(గా)ధ ఉంది.
నేనొక చిన్న సైజు కళ్ళద్దాలు మొహానికి తగిలించుకుంటాను. నా కళ్ళజోడు వెనుక దాగున్న కొంత సెల్ఫ్ డబ్బా మోతనుకోండి ఈ టపా.
నాకొక అరివీర భయంకర తెలివి తేటలు కలిగిన చెల్లి రత్నం ఉంది. నాకన్నా మూడేళ్ళు చిన్నది. నా జోడుకు చెల్లికి సంభందమెట్టిదనినా….
నేనూ డిగ్రీ చదువుతున్న రోజుల్లో,లెక్చరర్ గారు నల్లబోర్డుపై రాస్తున్న చిన్న అక్షరాలు కనిపించేవి కావు.
చివరి బెంచీ బ్యాచు..బోర్డుకు బుర్రకు మధ్య దూరం ఎక్కువై కనిపించట్లేదేమోనని చాలానాళ్ళు సరిపెట్టుకున్నా.
పక్కన కూర్చున్న ఫ్రెండ్ బుక్కులో నుంచీ ఎక్కించుకోవటం అలవాటై….ఎక్షమ్ లో ఎక్కించుకునే సదుపాయం లేకపోవటాన్ని బెంచీ గుద్ది గుద్దీ తీవ్రంగా ఖండించాలని పదే పదే అనిపించినా…చదువు విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే డాడ్ గుర్తొచ్చి, ఏం ఖండించాలనుకున్నానో మర్చిపోయే అమాయకపు రోజులు అవి..
కాలేజిలో, ట్యూషన్స్ లో ఈ అక్షరాల మసక ఇలా సాగుతూ ఉంది.
ఇక ఇంట్లో, మేము ముగ్గురము అక్క చేల్లెల్లము. వేసుకునే డ్రస్సు దగ్గర నుంచీ…రోడ్డిపై సైటు కొడుతున్న రోమియో దాకా చర్చించేసుకునేవాళ్ళం. ఎంసెట్ దగ్గర నుంచీ పోస్ట్ గ్రాడ్యుఏషన్ దాకా ప్లానింగులు వేసేసుకునేవాళ్ళం.
మా రూం గోడకు “వెంకట్రామా అండ్ కో” కాలెండర్ వేలాడుతూ ఉండేది.
చెల్లితో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో నాకు నా అక్షరాల ఇబ్బంది గుర్తొచ్చేది.
“నీకు కాలెండర్ పైనున్న ఆ చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయా?”, అని అడిగేదాన్ని.
చెల్లి వీర లెవల్లో ఫోసులు ఇచ్చి, “ఆ పెద్ద నంబరు కనిపిస్తుందా? వారాలు చదువు..పండగలు కనిపిస్తున్నాయా?”, అని నన్ను నానా రకాల హింస పెట్టి…
“నీ మొహం…ఆ చిన్న అక్షరాలు నీకే కాదు, ఎవరికీ కనిపించవ్. నాక్కూడా పెద్ద అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దూరం నుంచీ చిన్న అక్షరాలు ఎవరన్నా చదువుతారెంటి? నువ్వు, నీ అనుమానాలూనూ”, అని తేల్చిపడేసింది.
ఆ రాణి గారు చిన్నప్పటి నుంచీ బాగా చదివేదని అందరికీ తెగ impression. అందుకే నేనూ కూడా నమ్మేసా.
డిగ్రీ అయిపొయింది. పై చదువులకు హాస్టల్ కు వెళ్ళే ముందు ఎందుకైనా మంచిదని eye డాక్టర్ దగ్గరకు వెళితే..
ఒక కన్నుకు ౦.5 , మరో కన్నుకు 0.75 సైట్ వుందని చెప్పి, చేతిలో కళ్ళద్దాలు పెట్టారు.
ఆ రోజు నా బాధ వర్ణణాతీతం. ఫ్లాష్ బ్యాక్ రీళ్ళు రీళ్ళుగా తిప్పా, ఊహ తెలిసిన నాటి నుంచీ ముందు రోజు దాకా ఎవరెవరు నా కళ్ళు మీనాల్లా, అందంగా ఉంటాయని పొగిడారో గుర్తు తెచ్చుకుని తెచ్చుకునీ విషాదవదనంతో (ఏడుపుగొట్టు మొహాన్ని ఇలా కూడా అనొచ్చు) రెండు మూడు రోజులు గడిపా.
ఆ తర్వాత ప్రపంచ డాక్టర్ వ్యవస్తను నోరార(కనులార) విమర్శించా. జలుబుకు, దగ్గుకు, జ్వరానికి ఇచ్చినట్టు కళ్ళద్దాలకు బదులుగా ఓ బిళ్ళ కనిపెట్టలేకపోతిరి..
ఇక, కళ్ళ జోడు మొహానికి తగిలించుకున్నాక బుర్రలో బల్బు వెలిగింది.
“నో మొహం..చిన్న అక్షరాలు ఎవరికీ కనిపించవ్…నువ్వూ, నీ అనుమానాలు..” ఈ పదాలు అదేదో సినిమాలో చూపించినట్టు నా చెవుల్లో పదే పదే వినిపించాయి.
దీనికంతటికి కారణమైన విలనీ ఎవరో తెలిసింది…పగ, ప్రతీకారం తీర్చుకోవాలి.
“దీని కంతటికీ కారణం నువ్వే. ఇక నుంచీ నా డ్రస్సులు నీకు ఇవ్వను. నువ్వూ మొన్న కొనుక్కున్న గ్రీన్ చుడిదార్ నేను తీసేసుకుంటా. నా బొట్టు బిళ్ళలు పట్టుకో..అప్పుడు చెపుతా నీ పని”, అని చెల్లిపై యుద్ధం ప్రకటించా.
కిసుక్కున నవ్విన చెల్లిని, ” చలో చలో డాక్టర్ దగ్గరకు, పద పద” అని తోలుకేల్లాక తెలిసిందేమిటంటే…..
madam గారికి అప్పటికే నాకన్నా ఎక్కువ పవర్ వుంది. ఇంట్లోకి ఇంకో జోడు వచ్చి చేరింది.
“గుడ్డి గుడ్డి రాసుకుంటే కళ్ళజోళ్ళు రాలాయంట“…
ఆ తర్వాత కాంటాక్ట్ లెన్స్ కి కొంత డబ్బు తగలేసి…కళ్ళద్దాలతో సెటిల్ అయిపోయాం.
ఇప్పుడు….”కళ్ళజోళ్ళు ధరించు వారందరూ మేధావులని declare చేసేసాం”…
అదండీ నా కళ్ళద్దాల కధ, ఓ మధుర జ్ఞాపకం.
Superb
my sister likes spectacles. but doctor never prescribed her that. he used to write some tablets, saying you don’t have any eye-sight problem.
<> ఇది మాత్రం కేక …
భళీ … భళీ … నాది, ఈ టైపు కథనే … కాకుంటే క్యారక్టర్ లు కొద్దిగా మారాయి … ఇక్కడ మా మావయ్య కూతురు … మీ చెల్లి స్థానంలో …
తరువాతి కాలం మనం మేధావుల కోవలోకి వచ్చేసాం అన్నమాటా ….
గుడ్డి గుడ్డి రాసుకుంటే కళ్ళజోళ్ళు రాలాయంట హహహ కేక! ఇది వరకేప్పుడో ఒక జోక్ చదివాను. ఒకతను ఇలానే కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళంతా చదువుకున్నవాళ్ళు, తెలివయిన వాళ్ళు అనుకుని కళ్ళజోడు కొట్టుకేల్లాడుట. కళ్ళజోడు పెట్టుకుని ఎన్ని పుస్తకాలు చూసినా అతనికి చదవటం రావటం లేదుట. ఏ కళ్ళజోడు కావాలండీ అంటే చదువు వచ్చే కళ్ళజోడు కావాలి అన్నాడుట 🙂
very interesting and funny
Nice. I too did not realize I had short sight till it was too late.
”కళ్ళజోళ్ళు ధరించు వారందరూ మేధావులని declare చేసేసాం”…(Naa goppatanaanni inta tondaragaa gurtinchinanduku Thanks.)
abbo…intha story vundanna maata mee iddari kallajolla venaka!!
choopu taggindani anumanam vacchinak kuda konta kaalam ala gadipesi chhavu kaburu challaga cheppa. peellayina vela kallajodu vachhina samasthram okkate. maa aayanaki ade pelli kaanuka.