సినిమాలు…పిల్లల పరిశీలన
లత “ఎందుకో ఏమో”….పాట హమ్ చేస్తుంది.
“అమ్మా, నువ్వు ఆ పాట పాడకూడదు”, అన్నాడు ఐదేళ్ళ బుజ్జిగాడు.
లత ఆశ్చర్యంగా, “ఏ నేనెందుకు పాడకూడదు” అడిగింది.
“నీకు తెలిదా? ఇది boys సాంగ్” అన్నాడు.
“what ?? boys song , girls song అని ఉంటాఏంటి?”, కాస్త చిరాగ్గానే అడిగింది లత.
“ఉంటాయి.ఎందుకో ఏమో సాంగ్ boy పాడతాడు, girl పాడదు”, అని explanation ఇచ్చాడు.
“నువ్వు…నీ observation . చాలా ఎక్కువైంది…listen , There is nothing called boy’s song or girl’s song. If the song is good enough, we all can sing “, వాడికి అర్థం అయ్యేటట్టు చెప్పటానికి ప్రయత్నించింది లత.
…..
…..
………. కొంచేసేపు సీరియస్ గా ఆలోచించాడు బుజ్జుగాడు.
“అమ్మా, నీకో సీక్రట్ చెప్పనా?”
“చెప్పు చెప్పు” అంటూ వాడి దగ్గరకు వచ్చింది లత.
“మరే..మరే…you know …girl are bad “, చెవిలో గుసగుసలాడాడు.
లత కోపాన్ని ఆపుకుంటూ, “ఎందుకలా అన్నావు?”, అని అడిగింది.
“మరీ…షీలాకి జవాని బాడ్ సాంగ్ కదా. ఉలాల ఉలాల dirty సాంగ్ కదా”, అంటూ ఇంకో మూడు నాలుగు పాటలు చెప్పాడు.
అవాక్కయిన లత, “అలా కాదు కన్నా, మంచి మంచి సాంగ్స్ చాలానే వున్నాయి”, అంటూ రెండు మూడు పాటలు చెప్పింది.
“అమ్మా, మరీ అందులో ఆంటీలు సరిగ్గా డ్రెస్ చేసుకోరు కదా. tummy కనిపిస్తుంది. shame shame “, వాడి reasoning వాడు చెప్పాడు.
ఇంకేమి చెప్పాలో అర్థం కాని లత, భర్త వైపు కోపంగా చూసింది.
“నేను ఏమి చెయ్యను? క్రికెట్ చూస్తున్న, న్యూస్ చూస్తున్న ఈ సినిమాల ఆడ్స్ వస్తూనే ఉంటాయి”, నవ్వాలని ప్రయత్నిస్తూ చెప్పాడు రఘు.
“అలా కాదు బంగారు..అమ్మ గర్ల్ యే కదా? అమ్మమ్మ, పిన్ని, అత్త వీళ్ళందరూ గర్ల్స్ . Your teacher is also a girl. నీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది girls వున్నారు కదా? Tell me are they bad? “, అనునయంగా అడిగింది కొడుకును.
” oh …. no ,I don’t mean that అమ్మా. ” , కాసేపు ఆలోచింది “I mean only songs are bad” , అని declaration ఇచ్చాడు.
భారంగా నిట్టూరుస్తూ పనిలో పడిపోయింది లత. శక్తివంతమైన మీడియా, సమాజంలో మార్పులు అనే పదాలు లత బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి…
nice artical nizam ga eella ne aavutharu pillallu ranu ranu..
good baagundi.. its fact also.
హలో! ప్రవీణ గారు,
This is ఎందుకో?ఏమో! Shiva
మీ post చూస్తుంటే నాకో సంగతి జ్ఞాపక మొస్తోంది,
సరే! కదా! జ్ఞాపకాన్ని comment చేద్దాము అనుకుంటే,,
బోల్డెంత space పట్టేటట్టు ఉంది అందుకే నా blog లో post చేద్దామని
morning నుంచి ఖాళి దొరికినప్పుడల్లా try చేస్తూ ఉంటె
ఇప్పటికి పూర్తి అయ్యింది.
మీ వాడి పరిశీలనా బాగుంది,
వాళ్లకు ఏది మంచో ఏది చెడో తెలిస్తే చాలు,
ఎందుకంటే,,,
మీ వాడు చెప్పిన రెండు చెడ్డ పాటలు ఏమాత్రం భావం పైనో దృశ్యం పైనో మనసు పెట్టక పోతే
dance వేయించేటంత josh ఉన్న పాటలు (శబ్ద పరంగా)
అర్థాన్ని వదిలి శబ్దాన్ని పట్టుకుంటే ఇలా అవుతుంది,
కాని మీ బుడతడు ఆలోచిస్తున్నాడు ఎంతైనా
మనసుతో ఆలోచనలు కదా! ఎక్కడకి పోతాయి? తెలివి తేటలు?
అందుకే ఏది ఏమిటో అని గుర్తించే విజ్ఞత మొదలైంది,
సరే
ఒక మారు మీకు వీలైనప్పుడు నా post ని చూడ గలరు
సాయిరాం
http://endukoemo.blogspot.in/2012/05/ques.html
చక్కటి పోస్ట్ వేసారండి.
Interesting.
A missing piece of the puzzle in the above interaction is the definition/idea of what is good or what is bad. Please allow me to ask this. ఆయా పాటల్లో కనిపించిన అమ్మాయిలు “Bad” అనే నిర్ణయానికి బుజ్జిగాడెలా వచ్చాడు?? Is that a good conclusion? Is that the right conclusion?
Pingback: కిడ్స్ డైరీ | ఆలోచనలు…