వేసవి సెలవులు — జ్ఞాపకాల పొదరిల్లు
వేసవి సెలవులు….అదొక మధురాతి మధురమైన బాల్యపు జ్ఞాపకం. నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం ఈ టపా.
అసలు….సెలవలకు ముందు ఈ పరీక్షలు ఎందుకు పెడతారో? అని తెగ తిట్టుకునేదాన్ని. పుస్తకాల ముందు కూర్చుని, సెలవుల్లో ఊరెళ్ళి ఏమేమి చెయ్యాలో ప్లాన్ వేసేసుకుంటూ, ఊహించేసుకుంటూ చదువుతున్నట్టు ఆక్టింగులు, ఎగ్జామ్స్ కి చదువుకోమని కోసం పొద్దున్నే లేపుతుంటే, “అబ్బబ్బ…ఇంకెన్ని రోజులు” అని విసుక్కుంటూ, సగం నిద్రలోనే రోజులు మళ్లీ ఓసారి లేక్కేసుకుని తృప్తి పడిపోతూ ఉండేదాన్ని.
పరీక్షలు అయిపోగానే..బీరువాల పైన పెట్టేసిన సూట్ కేసులు, బాగులు దింపుకుని, దులుపుకుని బట్టలు సర్దుకోవటంతో సందడి మొదలు.
ట్రైన్ ఎక్కగానే కిటికీ సీటు కోసం నేను, చెల్లెళ్ళు తెగ పోట్లాడేసుకునేవాళ్ళం. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని…పోట్లాడటంలో కూడా నేనే సినీయర్. మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం చేసుకుని సర్దుకునేవాళ్లము. నువ్వు ఎక్కువ సేపు కూర్చున్నావ్ అంటే కాదు నువ్వే ఎక్కువ సేపు కూర్చున్నావ్ అని తగువులాటలు సాగుతూనే ఉండేవి. పాపం అమ్మ, ఎలా బరించేదో..
రైలు ప్రయాణం ఓ అద్బుతం. రాత్రి అవ్వగానే బెర్త్ పైకెక్కి పొడుకోవటం, తెల్లారగానే స్టేషన్ రావటం, దిగిన తర్వాత లగేజీలు లెక్కపెట్టుకోవటం. హడావుడే హడావుడి.
ట్రైన్ దిగిన తర్వాత మా పల్లెటూరు వెళ్ళటానికి బస్సు ఎక్కేవాల్లము. దారిపొడుగునా పచ్చటి పొలాలు, పిల్లగాలి మాకు స్వాగతం పలుకుతున్నట్టుండేది. బస్సు కిటికీలో నుంచి ఇంతెత్తున వుండే వాటర్ ట్యాంక్ కనపడగానే
మా వూరు వచ్చేసిందన్న ఆనందం వురకలేసేది.
ఆ మట్టి రోడ్డుపై నడుస్తుంటే, “పలానా వాళ్ళ మనవరాళ్ళు కదూ, పట్నం నుంచి వస్తున్నారా? అంతా కులాసానా”, కనిపించిన వారందరూ అడిగేవారు. సెలెబ్రిటి అనే పదం ఆరోజుల్లో తెలిదు. మనల్ని గుర్తుపట్టి, ప్రేమగా పలకరించటానికి మించిన స్టేటస్ ఏముంటుంది కదూ.
మాది చాలా పెద్ద ఇల్లు. ఇంటి చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లు. పూల చెట్లు, కోటాన్స్, సపోటా, దానిమ్మ, కొబ్బరి, అశోక చెట్లు….చాలా ఉండేవి. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకునేది సన్నజాజి పందిరి. అమ్మమ్మ, అమ్మ, మేము, ఇప్పుడు మూడేళ్ళ మా కూతురు (చెల్లి కూతురు)…నాలుగు తరాలు పెట్టుకున్నాం ఆ పూలు.
సపోటా చెట్టు కింద పేడతో అలికిన అరుగుపై పొయ్యి వుండేది. ఆ పొయ్యి కేవలం మా ఆటల కోసమే. ఎన్ని వంటలు వండి వార్చేవాల్లమో.
పెద్ద బావి కూడా వుండేది. ఆ బావిలో నీళ్ళు తోడటమే అతి పెద్ద సాహసం అని ఫీల్ అయిపోయేవాల్లము.
తాతయ్య పెరట్లో దూలానికి ఉయ్యాల కట్టేవారు. రెండు తాడుల మధ్య గోనిసంచిని కూర్చోటానికి వీలుగా అమర్చేవారు.
ఆవులు, గేదెలు, కోళ్ళు..ఎంత సందడిగా ఉండేదో ఇల్లంతా.
ఒక రోజు ఏమైందో చెప్పనా?…గేదె కుడితి తాగుతుంటే, నేను అత్యుత్సాహంగా కుడితి తొట్లో ఏముందో చూద్దామని తోట్లోకి వంగి చూసాను. గేదె గారికి చిర్రెత్తినట్టుంది….. కొమ్ములతో అదిరించింది. భయంతో అరుచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి పరిగెత్తి మంచం ఎక్కాను. ఆ భయం కొన్ని రోజుల పాటూ ఉంది.
గేదెలకు గడ్డి తినిపించేవాల్లము. అసలే భయం కదా..ఆమడ దూరం నుంచుని, చేతులు వీలైనంత చాచి..గడ్డి మొనలను పట్టుకుని గేదె గారి నోటి దగ్గర పెట్టేవాల్లము. భలే మజాగా వుండేది.
కోళ్ళతో కబాడీ ఆడేవాళ్ళము. వాటి వెనుకాల పరిగెత్తుకుంటూ వెంబడించేవాళ్లము. అమ్మమ్మ వాటిని బెదరకొట్టకండి అని అంటున్న వినే వాళ్ళమే కాదు.
ఇంక వేసవి సెలవలంటే…..మామిడి పళ్ళు, కొబ్బరి బొండాలు, తాటి ముంజులు, తేగలు, సీమ చింతకాయలు…..ఎన్నో. ఇవి కాకుండా అమ్మమ్మ వండే పిండివంటలు, వెన్నుండలు, చెక్కలు, కారప్పూస, కొబ్బరి బూరెలు… ఇంకా చిన్ననాటి నేస్తాలు, వారితో ఆడిన ఆటలు.
కాస్త ఎండ తగ్గే వేళకు తాతయ్య, మావయ్య కొడవలితో కొబ్బరి బొండాలు, ముంజికాయలు కోసిచ్చేవాళ్ళు. నాకిప్పటికి ఆశ్చర్యమే U షేప్ లో వుండే కొడవలితో ఈజీగా ఎలా కట్ చెయ్యగలరో అని?!
రాత్రుళ్ళు పడక ఆరుబయటే. మడత మంచాలు, నవ్వారు మంచాలు బయట వేసుకుని ఆకాశం వైపు చూస్తూ మావయ్య చెప్పే కబుర్లు వింటూ నిద్రలోకి జారుకునేవాళ్లము. మేనమామ ప్రేమ ప్రత్యేకం. (he is no more now ..miss you మావయ్య. ఆనందాన్ని గుర్తుచేసుకుంటూ రాసుకుందామంటే…కళ్ళల్లో నీళ్ళేందుకు తిరుగుతున్నాయి? మేనమామ కదా..)
అప్పుడప్పుడు వరండాలో ఓ మూలన ధాన్యపు బస్తాలు ఉండేవి. ఆ బస్తాలను స్టేజిగా చేసుకుని నేను, చెల్లెళ్ళు నాట్య ప్రదర్శనలు చేసేవాళ్ళము. నాకు ఆ వయసులో ముక్కు పుడక పెట్టుకోవాలనే కోరిక వుండేది. “నువ్వు ముక్కు కుట్టించుకుంటే, వజ్రాల ముక్కు పుడక చేపిస్తాను”, అనేవాడు మామయ్య. ముక్కు కుట్టించుకున్నది లేదు కానీ తిలకంతో ముక్కు పక్కన చుక్క పెట్టుకుని డాన్సు చేసేదాన్ని.ఈ పేరా రాస్తుంటే బస్తాల వాసన ఎక్కడ నుంచి వచిందో, ముక్కుపుటలను తాకుతుంది.
ఇలా రాసుకుంటూ పొతే..ఎన్నో ఎన్నో మధుర స్మృతులు.
వానచినుకులు కాగితం పడవలను గుర్తుచేస్తూనేవుంటాయి.
వెన్నెల వెలుగు నక్షత్రాల లెక్కలను వేళ్ళపైకి తెస్తూనేవుంటాయి.
మట్టి వాసన మనసుని పల్లె దాకా మోసుకెల్తూనే ఉంటుంది.
మనసెప్పుడు బాల్యం వైపే పరుగెడుతుంది.
చిన్ననాటి జ్ఞాపకాలు మధిలో నిక్షిప్తమైవుంటాయి
అందుకే కాబోలు, వయసులో ఎంత పెద్దైనా మన అందర్లోనూ పసితనం ఉంటూనే వుంటుంది.
ఇవన్నీ స్కూల్ చదువుల వరకే. 10th క్లాసు దాటాక పరుగులు మొదలయ్యాయి. ఇంటర్, ఎంసెట్, పై చదువులు…ఆ తర్వాత ఉద్యోగం, పెళ్లి, పరాయిదేశం. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఊరెళ్ళి నాలుగు రోజులుండి ఎన్నాళ్ళయిందో అన్న నిట్టూర్పు.
ప్రతీ సంవత్సరము ఇండియా వెళ్ళినప్పుడల్లా ఊరెళ్ళి రెండు రోజులు వుండాలి అనుకుంటాను. టైం లేదనో, కుదరలేదనో…ఎప్పుడు ఏదో వంక. ఒక పూట లేక కనీసం కొన్ని గంటలకన్నా వెళ్తాను.
అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో…ఇప్పుడు ఊర్లో అంతా నిశబ్ధమే. మట్టి రోడ్లు తారు రోడ్లుగా మారాయి. కానీ, నడిచే మనిషే కనిపించరు. పలకరించే వారే లేరు.
ఒకప్పుడు కళకళలాడిన ఇంటి పరిసరాలలో పిచ్చి గడ్డి పెరిగిపోయి ఆదరణ లేని అనాధల్లా మిగిలిపోయాయి.
ఆ మండువా ఇల్లు తరాల సాక్షిగా శిధిలమవ్వటానికి సిద్ధంగా ఉంది.
ఊర్లో అక్కడక్కడ వృద్దులు ప్రేమకు,ఆప్యాయతకు నిదర్శనంగా మిగిలివున్నారు.
so heart touching.
thanks
Sneha.
mee vyaasam chaalaa bagundi, naakkudaa maa oori gurinche cheppinatlundi miru chepthe
meeru ooriloni gudi gurinchi marchipoyaru.
avunu nijam ga avi anni gnapakale.ippudu ooru velte chala illu padipovataniki siddam ga vunnayi.
Praveena Garu, ee madyane mee kavitalu follow avutunnanu, vastavaaniki daggaraga plus prat okkari jeeevitaniki Chala close ga untayi. Mee Nri jeevitam kavita ayite ennisarlu chadivano, manasuloki tongi Chesi rasinatle anipinchayi. Ilage manasuku hattukone Manchi kavitalu istuu Untarani asistunnamu.
చాలా బాగా వుంది కానీ ఆఖరి మూడు లైన్స్ కదిలించాయి.. మా ఊరు (మండపేట పక్కన ఏడిద) కుడా అప్పటిలో ఒక వెలుగు వెలిగింది కానీ ఇప్పుడు పరిస్థితి కొంతవరకు ఇలానే వుంది.
U r from yedida? nice I am from Dulla.
Chala bagundi. Veetiki thodu inka enno madhura smrutulu kalla mundu adutunnayi. Cheruvulo eetha kottatam, Mamidithotalo dongathananga mamidikayalu koyatam, Kothi kommachi aatalu, akka vallatho Thokkudu billa, Nethana rallu, Chintha pikkalatalu poti padi maree ade vaadini. Sayantram ayyaka Gooti billa, Goleelu….Street lightes velugulo isukatho bathu gudlu, vada pallinka, kabbaddi.. enno ennenno… Polaniki velli thatichetlaku kattina kallu kundalanu poti padi rallatho pagala kottatam vaadu ma thatayyaku piryadu cheste pillalu kadura cheptanule ani sardi cheppatam.. inka chalane gurthukostunnayi…..aahaaa aa rojule veru.
fantastic akka..na kallalo kuda nillu tirugtunayyi chaduvutu vunte…a rojulu ravu malla appatiki
Thanks to you for taking me back into the past – My childhood days.
really too good
Manasuni kadilinchindi mamayya vishayamlo, adi kuda chandamama photo petti
Really super andi ,kandlanundi nellu tirugutunai..thanxuu
ప్రవీణ మీ ఊరి లైబ్రరీ గురించి, పెళ్లి పిలుపులకి, శ్రీరామనవమికి లంగాఓనిలతో ముస్తాబై ఊరంత పిలవటం, పేరంటాలకి వెళ్ళటం,మీ ఊరి గుడి గురించి,ఇంటిముందు అమ్మమ వేసే ముగ్గు దానికి రెండువైపులా రాసే డేట్ అండ్ డే, చెరుకులు తినటం …, బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యటం కూడా ఎందులో
ఇందులో రాస్తే బాగుంటుంది.
Memories are always sweet, specially from our chilhood……………:)
Looking farward for more heart touching words from u …………..
చీకుచింత లేని బాల్యం,
బరువు బాద్యతలు తెలియని బాల్యం,
స్వచ్చమైన స్వేచ్చ కు చిరునామ బాల్యం,
చిలిపి అల్లర్ల హంగామా బాల్యం,
బొమ్మల పెళ్ళిళ్ళ పెద్దరికం బాల్యం,
ఆట పాటల్లో అలుపే ఎరుగని బాల్యం,
కలుషితాలు , కల్మషాలు ఎరగని బాల్యం,
రాజు కైనా పేద కైనా తీపి గురుతే బాల్యం
తరాలకు గుర్తుండే ఊసులెన్నో ముచ్చటగా ముటకట్టుకున్న బాల్యం,
తీయనైన బాల్యం,
తిరిగిరాని బాల్యం,
బాల్య స్మృతులు మదిని తాకగానే
కంటి తడి మదిని ముంచి
పెదవిపై చిరునవ్వు గా మిగిల్చే జ్ఞాపకం బాల్యం.
-Chaitu.
* సినిమా పోస్టర్ మీద ” తప్పక చుడండి చూ ” అనే కాప్షన్ చూసి అయ్యో ఈ సినిమా చూడకపోతే జైలు లో పెడతారేమో అని అమాయకంగా బయపడిన బాల్యం:)
నల్లమామ్మ( రామచంద్రాపురం) మెట్ల మీద నుంచి పడిపోయి మీనమ్మే నన్ను తోసేసి నా కాళ్ళు విరకోట్టింధి అంటూ శోకాలు పెడితే ఏమని నిజాయితిని నిరుపించుకోవాలో తెలియక ఉక్రోశ పడ్డ బాల్యం:(
Super……. naa chinnapati allari gnapakalu gurthukosthunnai…….. Nice ……..