చక్రం


చక్రం

చక్రాకార గడియారంలో
అనంతంగా అవిశ్రాంతంగా ప్రయాణించే
ఆ క్షణాల, నిమిషాల, గంటల ముల్లులే
జీవిత చక్రాల రధసారధులు…..

ముద్దులొలికే బాల్యం
ఎగిరిపడే యవ్వనం
విశ్రాంతి వృధ్యాప్యంలో పసితనం
ఆది అదే..అంతము అదే.
ఈ చక్రయాత్ర నడి మార్గంలో
మరో నూతన చక్ర సృష్టి .
వీడ్కోలు చెపుతూ వదిలి వెళ్ళే తరాలు
లయబద్ద సృష్టి నిరంతర కొనసాగింపు చక్రాలు

కురిసిన వానతో నిండిన చెరువు నీరు
వేసవి వేడితో ఆవిరై
మేఘమై వర్షించే అదే నీరు
సృష్ట౦తా చక్ర భ్రమణమే…..

కన్నీటితో కష్టం సాగిపోయాక
పన్నీటిలో సుఖం వచ్చిపోయాక
మరల మరల పలకరించేవి….సుఖదుఖాలే
బతుకు బండి తిరిగేది ఈ చక్రాలపైనే
జీవిత ‘సత్యా’లు ఈ చక్రాలే….

ఇది సత్య గారి చక్రం  http://neelahamsa.blogspot.com/2012/03/blog-post_24.html

This entry was posted in కవితలు, కాలం, జీవితం. Bookmark the permalink.

4 Responses to చక్రం

 1. Krishna says:

  wahva

 2. Anonymous says:

  jeevitha chakram ante ide

 3. Hari Krishna Sistla says:

  Nice Literature. If you could once again check the sentence “జీవిత చక్రాల రధసారధులు…..”
  Chakraala radha saaradhulu is not a proper usage,I am made to feel. Divide the sentence as jeevita chakraalu…,jeevita radha saaradhulu.(జీవిత చక్రాలు …, జీవిత రధ సారధులు (నడిచేవి చక్రాలు, నడిపించెడి వాడు రధ సారధి ).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s