నువ్వు


నువ్వు

నీ ఒక్కో కన్నీటి చుక్క
వేల వేల ప్రళయాలై నన్ను ముంచెత్తుతున్నాయి

నీ జ్ఞాపకాల సడిలో
ఓ విషాదగీతం నా గొంతును నులిపేస్తుంది

నా నిశబ్దపు గోడలను తడుముతున్న నీ ప్రతిధ్వని
చీకటి రాత్రుళ్ళు పై కప్పుపై కదలాడే నీ ఛాయా చిత్రాలు
కదలాడుతూ కదలాడుతూ ఆగిపోయే కాలం

హమ్…ఎన్నని చెప్పను?

రాయిలా మారలేని నా అసహాయతను గుర్తుచేస్తున్న
ఈ గుళకరాళ్ళను
నా నిశ్చల తటాకంలో గుమ్మరిస్తున్నది ఎవరు?
నువ్వా? నేనా?

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

3 Responses to నువ్వు

 1. satya says:

  ఇంకెన్ని గాధల గులకరాల్లని నీ తటాకం లో కుమ్మరిస్తే
  నీలోని బాధల ఉప్పెన పొగిపొర్లుతుందో చూద్దామని కాబోలు…!

 2. ఒక్కో కన్నిటి చుక్క ఉద్వేగాన్ని , ఉప్పెనని ఆపేందుకు కడుతున్న ఆనకట్ట..

 3. Hari Krishna Sistla says:

  Awesome Mam…..should have tried the word ” చీకటి నిశీధి ” instead using the term ‘ చీకటి రాత్రుళ్ళు ‘.
  Similarly the landing might have had been still emotional.The word ” రాయిలా మారిన ” may it self indicate “అసహాయత”. The case other you should have gone as ” కనీసం, రాయిలా మారలేని నా అసహాయతను….” ( you are no stiff as a stone or not in a position to react towards the situation – Got me ?).
  Good any way.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s