నేస్తం…..నాడు నేడు
నేస్తం
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు
కాలేజి రోజులు చుట్టివద్దాం
బెంచీ కబుర్లు
క్లాసురూము తగువులు
బ్లాకుబోర్డు గీతలు
లైబ్రరీ కాలక్షేపాలు
చెట్ల కింద టైంపాసులు
క్లాసు బంకు సాహసాలు
ఓహ్….ఆ రోజులు
పరీక్షలే కష్టాలు
మార్కులే జీవితం అనుకున్న ఆ రోజులలో
ఎన్నెన్ని లోకాలు చుట్టి వచ్చాం కదూ
భవిష్యత్తు కలలు
ఆశల మెరుపులు
ఉరకలేసే వయసులో ఆశయాలు
ఎగిసెగిసి పడే హుషారు హొయలు
H1 వీసాలు, విహంగ ప్రయాణాలు
ఓహ్…ఆ రోజులు
స్నేహామృతం సేవించిన దేవతలు జీవించిన ఆ రోజులు….
మధురస్మృతుల మల్లెల వానల్లో తడిసిన ఆ రోజులు..
నేస్తమా
ఇన్నేళ్ళు గడిచాక ఈనాడు కలిసాక
ఆ ఆనందం కన్నీరుగా దోసిట్లో నిండితే
నా నివ్వెరపాటును ఎలా దాచుకోను?
తప్పొప్పుల బారం ఎవరిదని నిలదీస్తే?
కలలు కత్తిరించిన కళ్ళతో
చిరునవ్వు పెదాల కతికించుకుని
తలరాతని తేల్చేసావ్!!!
జీవితపు చదువులో
కాలం పెట్టె పరీక్షలు రాసేది విధి రాతేనా?
బదులు లేని ప్రశ్నలడుగుతున్నానని విసుకున్నావ్
నిజమే..బదులేలేని పలితాలే ఇవన్ని!?
టెక్స్ట్ బుక్కు రాతల్లో
మార్కుల బారాన్ని మోసిన
మనలోని నేను
నీ ఈ రాతను ఏ eraserతో చెరిపెయ్యగలను?
ఎన్ని కన్నీటి చుక్కలతో ఈ అక్షరాలను అలికెయ్యగలను?
కాలం విసిరేసిన దిక్కులలో
ఇరుక్కుపోయిన స్నేహాన్ని email చెయ్యగలనా?
కమ్యూనికేషన్ గ్యాప్ లో చిక్కుకుపోయిన బంధాన్ని
బిజీ అంచుల నుంచీ మరి జారిపోకుండా రక్షించగలనా?
“తప్పొప్పుల బారం ఎవరిదని నిలదీస్తే?
కలలు కత్తిరించిన కళ్ళతో
చిరునవ్వు పెదాల కతికించుకుని
తలరాతని తేల్చేసావ్!!!”
కాలం చేసే మాయలో మాయమయ్యే స్నేహం గురించి గురించి చాలా బాగా వ్రాశారు.
నేస్తం
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు…..Where where you been all these days.A long gap ? Hope doing well with your health.
Further ,నేస్తమా – ఇన్నేళ్ళు గడిచాక ఈనాడు కలిసాక – ఆ ఆనందం కన్నీరుగా దోసిట్లో నిండితే – నా నివ్వెరపాటును ఎలా దాచుకోను?
అవన్నీ ఎందుకు ; అసలు గుర్తుపట్టండి అది చాలు (Comment made just for fun not serious )
My iPad got wet after reading this….endhukabba????
I know Deepthi..