భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (పార్ట్ 1 ) — How to keep hubby quite while getting ready to go out
మనం షికారుకు వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్న రోజున హబ్బిని (hubby ) బాత్ కి లాస్ట్ లో మాత్రమే వెళ్లనివ్వాలి. అనగా ఇంట్లో అందరు రెడీ అయిపోయాకే అయ్యవారిని “గెట్ రెడీ” అనాలి.
లేకపోతేనా……
అయ్యిందా…ఇంకెంతసేపు….త్వరగా…కానీ కానీ…..టైం అవుతుంది…ఇంకెంతసేపు……
నస నస….విసిగించేస్తారు.
ఇక తప్పని పరిస్తితుల్లో ఈ సాధింపు ఆపాలంటే, ఇలా చెప్పాలి….:)
look dear…..I need 15 more minutes to get ready . గడియారంలో పెద్ద ముల్లు ఎక్కడ వుంది? ఆ ముల్లు అదిగో ఆ నెంబర్ దగ్గరకు వచ్చేదాకా నన్ను మాట్లాడించోద్దు. ఈ లోపు “అయ్యిందా” అని అన్నావో…ఇంకో ఐదు నిముషాలు ఆడ్ చేసేస్తా..మరి నీ ఇష్టం….
కామ్ గా వుండడం తమరి వళ్ళ కాకపోతే…టీవీ పెట్టేసుకుని, ఏదన్నా న్యూస్ చానెల్లో దూరిపో…నేను రెడీ అయ్యాక పిలుస్తాలే, అప్పుడు పలుకు.
ముందే చెపుతున్నా…ఈ న్యూస్ అయిపోగానే వెళ్దాంరా అన్నావో ఊరుకోను….
(ఇలాంటి జీవిత సత్యాలు చాలా ఉన్నాయి..మళ్లీ రాయాలి అనిపించినప్పుడు రాస్తా)
chala chala interest ga vundi
chala chala bagundi
“ముందే చెపుతున్నా…ఈ న్యూస్ అయిపోగానే వెళ్దాంరా అన్నావో ఊరుకోను….”, ఆశ్చర్యం గా ఉన్నదే …………మా ఇంట్లో విషయాలు మీకు ఎలా తెలిసిపోయాయి ???
ఇన్ని విద్యలు తెలిసి మమ్మల్నెం దుకు ఇబ్బంది పెడతారు? .మీరు తయారవడానికి ఎక్కువ కాలం కావాలంటే ఇంకా ముందే మొదలు పెట్టవచ్చుకదా? అయినా ఈ తగువు ఇప్పటిది కాదులెండి. సరదాగా ముళ్లపూడి వారి జోక్ ని గుర్తుకు తెచ్చుకోండి. –.అద్దంలోచూసుకుంటూ తన అందాలను సవరించుకుంటున్న రాధతో శ్రీ కృష్ణుడు రాధా రధం తయారుగా ఉందనగానే రాధ ఇట్టే వచ్చె అంటుందిట. రాధ తయారై వచ్చే సరికి బయట కాడిలాక్ కారు సిధ్ధంగా ఉందట.దీనికి వ్యాఖ్యానం అవసరమా?
Superrrrr
మా యింట్లో వ్యతిరేకం! 🙂
Very nice idea…pl don’t tell to my wife
Super andi..nenu kuda ide pani chesta…mari Sree varlaku em pani undi vallu okkalle ready ayite chalu kada, manam pillalni ready chesi manam ready ayesariki…”inka enta sepu” ane question maha irritating..keep posting..!