కృత్రిమత్వంలో నేను నా లోకం


కృత్రిమత్వంలో నేను నా లోకం

ఇదిగో ఇక్కడే
నేను మనిషన్నది గుర్తుకువచ్చి…
అలా నిశ్చలంగా ఆగిపోయాను
పాదాలు రెండూ భూమిలో పాతేసి
చేతులు రెండు బార్లా జాపి
వంద మైళ్ళ వేగంతో దూసుకుపోతున్నలోకాన్ని కౌగిలించుకోవాలనుకున్నా
వింతగా అంత లోకం ఇట్టే పిడికిలిలో ఇమిడిపోయింది.

ఒదిగిన నా గుండె నుంచి ఓ ఆలోచన జారి
ఇదిగో…వీధి గుమ్మపు అరుగుపై నా పక్కనే కూర్చుంది.
మౌన వత్రం పాటిస్తున్న మునుపుంగవుల్లా
మేమిద్దరం ఒక్క మాటన్నా మాట్లాడుకోలేదు
గడ్డం కింద చేతులు ఆనించుకుని నిశ్శబ్దాన్ని మాత్రమే ఆలకిస్తున్నాము

ఆమూలన
చిగురులేస్తోంది ఓ మొక్క —– అచ్చం పసికందులా
పువ్వులు స్వచ్చంగా నవ్వుతున్నాయి —– చిన్ని తల్లి నవ్వులా
జలపాతం ఉరకలేస్తోంది —— యవ్వనపు పొంగులా
సెలయేరు ప్రవహిస్తోంది —— నడివయసు గాంభీర్యంలా
వృద్ద వృక్షం భోదిస్తోంది —– తాతయ్య అనుభావాలలా

కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెల కురుస్తోంది
మనసంతా మల్లెల పరిమళం ఆవహించినట్టనిపించింది

అలా ఎంతసేపు కుర్చున్నామో?
ఓ వర్షపు చినుకు బుగ్గలను తడిమింది
ఉలిక్కిపడి ఒకళ్ళను ఒకళ్ళం ఎన్నోయుగాలుగా విడిపోయి కలుసుకున్నట్టు చూసుకున్నాం
కన్నీటిపొర మసకగా కమ్మేసింది మా రూపాలను

మరో మూల
ఎక్వేరియం —– ఎంతందంగా ఉందని!
నాలుగు వైపులా గాజు అద్దాలు
అడుగున గులకరాళ్ళు
అలంకారంగా ప్లాస్టిక్ మొక్కలు
ఊపిరికి ఆక్సిజన్ పంపు
వెలుతురుకి ఎలెక్ట్రిక్ బల్బు
వేళకు తిండి
అబ్బో ఎన్ని హంగులో!
హుషారుగా తిరిగే రంగు రంగుల చేపలను
కృత్రిమ కాలువలో కుక్కేసి
అందాల పెట్టెలో సర్దేసిన నాగరికత

ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుంది
ఊపిరి అందట్లేదు
మనసు మెలి తిరిగిపోతోంది
ఆలోచన నిలదీస్తోంది
అనుభవం హెచ్చరిస్తోంది
కంటతడి గుండెసడిని గుర్తుచేస్తోంది
బావాల తీవ్రతలో కొట్టుకుపోతున్ననా?

ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి
నా పక్కనే ఉన్న గాజు తోట్టేలోకి దూకేశా..
వంద మైళ్ళ వేగంతో కొట్టుకుపోతూ…….

This entry was posted in కవితలు, కష్టం, కాలం. Bookmark the permalink.

12 Responses to కృత్రిమత్వంలో నేను నా లోకం

 1. Simply Superb

  Awesome

  🙂

  ఇదేంటి చిత్రం గా మనసులో ఆలోచనలు కదా !

  మనసుతో ఆలోచనలు అంటాడేమిటి ఈయన అనుకున్నా !! తొలుత…

  కాని, సాక్షి స్థానే నిలబడి చూస్తే… ఆలోచనలు మనసు తోనే…

  అది మూగాబోయాక మిగిలేది నేనే… అనిపించింది

  నిన్నటి మీ valentine gift అదుర్స్..||

  Can ఐ Take the Text please ….

  ఏమంటారు?

  త్వరగా బదులివ్వండి ప్రవీణ గారు..,

  ~!~

  • ఎందుకో ‽ ఏమో @ “అంటాడేమిటి ఈయన ” ..హ్హా హా..నేను అమ్మయినండి.. ప్రవీణ 🙂

   Can ఐ Take the Text please ..why not, U can happily take it.
   నేను సరదాగా బరికేస్తూ వుంటాను…మీకు నచ్చటం..నాకెంతో హ్యాపీ గా ఉంది..
   Thank you…

 2. వాసుదేవ్ says:

  “కృత్రిమ కాలువలో కుక్కేసి
  అందాల పెట్టెలో సర్దేసాము…” కవిత్వాన్ని బతికించేవి, పండించేవి ఇదిగో ఇలాంటి వాక్యాలే ప్రవీణాజీ..కవితలో అక్కడక్కడా ఇలాంటివి వెంటాడే ఈ వాక్యాలు ప్రొజాయిక్ స్థితి నుంచి కొంచెం పొయిట్రీ వైపు నడిపించాయి.

  • వాసుదేవ్ గారు @ మీకో విషయం చెపుతా..నవ్వకూడదు మరి. ఓకే నా? నాకు ప్రొజాయిక్ అంటే అర్థం తెలిదు. గూగుల్ లో సెర్చ్ చేసి ఒక మంచి వ్యాసం చదివాను. కొంచెం అర్థమయింది. It’s more like sentences..:) Thank you.

 3. అద్బుతమైన భావ వ్యక్తీకరణ.

 4. మా అమ్మాయి జ్యోతిర్మయి మీ కవిత లింక్ పంపించింది
  నిజంగానే గొప్ప కవిత… కొంత మార్మికత ఎక్కువగా వున్నా
  మళ్ళి చదివి ఆ భావాలకు ఉప్పొంగి పోయాను
  గుండె గోడల్ని తడిమిన మీకు అభినందనలు

  • kbkreddy గారు @ పెద్దవారు…మీ అభినందనలు అందుకోవటం నా అదృష్టం. మీ అమ్మాయి జ్యోతిర్మయి గారికి కృతజ్నురాలిని.

 5. prasoon says:

  అసలు >>>>>>>
  ఇంకేం చెప్పను
  మమ్మల్ని మాత్రం ఎక్కడికో తీసుకుపోతున్నారు..
  గత జీవితమంతా(పెళ్ళికాక మునుపు) మీబ్లాగ్ లోనే వుందనేంతగా…
  మా ఆవిడా నేనూ…నిజంగా
  మీ అప్ డేట్ మైల్ వచ్చిందంటే
  మా ఆత్మీయుల నుంచి ఉత్తరం వచ్చిందన్నంత సంతోషం
  మీ Happy Valentine’s Day to all married couple చదివిన తరువాత మా ఆవిడ మొహంలోని చిరునవ్వుని ఎలా మర్చి పోగలను జేవితనికి దగ్గరగా రాయడం మీకేసాద్యం రిప్ల్య్ కోసం ఎదురుచూస్తుంటం (నేను మా ఆవిడకలసి)

  • Prasoon garu @ Felt sooo happy to read ur comment.
   “మా ఆవిడ మొహంలోని చిరునవ్వుని ఎలా మర్చి పోగలను”..What else do I need more than this expression for my writings..:)
   Thank you.

 6. Hari Krishna Sistla says:

  There is a grammatical error if you say “నిశ్చలంగా ఆగిపోయాను” (Because Nischalamgaa itself means aagipoyanu). వట వృక్షం భోదిస్తోంది might have suited well (And might perhaps have suited our culture too.రంగు రంగుల చేపలను – కృత్రిమ కాలువలో కుక్కేసి ( హంగుల డబ్బా లో కుక్కేసి – Just imagine)
  Further to call,Why so sad end mam ? Why do n t you think an alternative calling ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి-నా పక్కనే ఉన్న గాజు తోట్టేలోకి దూకేశా..వంద మైళ్ళ వేగంతో కొట్టుకుపోతూ….ఉన్న ప్రాణానికి కొత్త ఆసరా దొరికిందనుకున్నాను – might have given pleasant end.

 7. @Hari Krishna Sistla

  Its almost right అనిపిస్తుంది అండి కావాలంటే ఈ లింక్ చుడండి

  నిన్నే ఈ మూవీ చూసాను,

  ఐ థింక్ చలనం లో ఉన్నవి రెండు mind & Body

  ఈ clip లో violence ఉన్న కుడా ఒక realistic phenomena ni director చుపిండు

  దానికి ఒక commnet prepare చేస్తుంటే మీ ఈ comment mail alert గా వచ్చింది

  సో Eisenstein relativity theory కో లేక ఏదో spiritual state కి గాని
  సంబంధించినది అయి ఉంటుంది ఈ terminology .

  reason – 1
  శరీరం తో ఆగితే అది సచలం గా ఆగటం, మనసు ఆగితే అది నిశ్చలం గా ఆగటం (అమనస్కం)
  reason -2
  so grammatical mistake లేదని నా opinion ఎంచేతనంటే ఒక స్థాయి దాటాక ప్రతి లితెరతురె కూడా వేదాంతపు లోతులను సూచిస్తుంది so అలాంటప్పుడు అది పునరుక్తి దోషం అనిపించుకోదని మనవి.
  what’s ur opinion on it?

  ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s