Happy Valentine’s Day to all married couples


Happy Valentine’s Day to all married couple

ఈ సహవాసం మొదలయి ఎన్నేలయిందో కదూ…..

ప్రేయసి ప్రియుడి స్థాయి దాటి, భార్య భర్తల స్థానాలలో ఒదిగిపోయి  చూస్తుండగానే సంవత్సరాలు  గడిచిపోయాయి..

తొలినాటి చిలిపి చేష్టలు, ఊహల ఆకర్షణ దాటి అసలైన బంధం ఏర్పడ్డాక, I love you  అని చెప్పటమే మరిచాము కదూ..బహుశా దాని అవసరం లేదనేమో, కానీ ఒక్కోసారి చెప్పుకోవటం బాగుంటుంది..ఆలోచించు.

ఇప్పుడు నీ కళ్ళలోకి చూసి love you అని చెప్పాలని ఉన్నా….ఏంటో మొహమాటం అడ్డొస్తుంది, ఈ మొహమాటపు ముసుగును తీయలేకపోతున్నా  వింతగా?!

బాధ్యతల్లో నలిగి…పిల్లల కళ్ళలో ఆనందాన్ని, వారి చిరునవ్వుల్లో సంతోషాన్ని వెతుక్కోవటంలో పడిపోయాం.

నీకోసం కొంత సమయాన్ని కేటాయించే తీరిక లేదంటాను నేను. నాకోసం నువ్వున్నావని తెలిసినా…నీ సమయంలో నా భాగం స్వల్పమే…

ఒకళ్ళను ఒకళ్ళు  విసుక్కుంటాం, కసురుకుంటాం……ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేం కదూ.

ఈ రోజు వాలెంటైన్స్ డే అంట…టీవీలు ఊదరగొట్టేస్తున్నాయ్. మనం ఎన్ని సార్లో నవ్వుకున్నాం కదూ. సరేలే…

ఇదిగో ఈ గులాబీ అందుకో….love you అని చెప్పాలంటే సిగ్గుగా వుంది, హ్యాపీ వాలెంటైన్స్ డే…

Happy Valentine’s Day to all married couple.

This entry was posted in జీవితం, నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు. Bookmark the permalink.

16 Responses to Happy Valentine’s Day to all married couples

  1. Anonymous says:

    very nice mam…నిజమైన ప్రేమ బాధ్యతలను పంచుకోవడం లోనే ఉంటుంది .. అది పెళ్లి తోనే మొదలవుతుంది….కదండీ…

  2. uday says:

    వాస్తవానికి దగ్గరగా, అందరి అనుభూతులను ప్రతిబింబించేలా…బాగుంది ప్రవీణా……

  3. pallavi says:

    very nice mam…నిజమైన ప్రేమ బాధ్యతలను పంచుకోవడం లోనే ఉంటుంది .. అది పెళ్లి తోనే మొదలవుతుంది….కదండీ…

  4. నిశ్శబ్దాల నిజాలు says:

    పెళ్ళైన వారిని యేరి, ఒక దగ్గరికి చేర్చి, పిండి, పీల్చి రాసిన నిజాలు … నిశ్శబ్దాల మాటున దాగిన పెళ్ళి జీవితాలు… నిజమే, పెల్లాని కంటే యెక్కువ ప్రేమను పిల్లలు దోచేస్తున్నారు … కాని చివరికి మిగిలేది జీవితం లో పెళ్లాం మాత్రమే … రోజా పువ్వుకు ఖర్చు దండుగ … మొగుడిగా I love చెప్పడమే better

  5. నిశ్శబ్దాల నిజాలు says:

    Wonderful. Extemporaneous writing. I like it sweet and simple and reflects my life. I liked ప్రేయసి ప్రియుడి స్థాయి దాటి, భార్య భర్తల స్థానాలలో ఒదిగిపోయి చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోయాయి..తొలినాటి చిలిపి చేష్టలు, ఊహల ఆకర్షణ దాటి అసలైన బంధం ఏర్పడ్డాక, I love you అని చెప్పటమే మరిచాము కదూ..బాధ్యతల్లో నలిగి…పిల్లల కళ్ళలో ఆనందాన్ని, వారి చిరునవ్వుల్లో సంతోషాన్ని వెతుక్కోవటంలో పడిపోయాం…నీ సమయంలో నా భాగం స్వల్పమే…ఒకళ్ళను ఒకళ్ళు విసుక్కుంటాం, కసురుకుంటాం……ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేం

    there is writer in you … PLEASE WAKE HER UP… there are plenty of readers out there to read your writings… you must reach them … I LOVE the WRITER in YOU Praveena…
    here is my title for such collation of thoughts … “Paatha badda Pellillu”…

  6. చెప్పీ చెప్పకుండా భలే చెప్పారుగా..ప్రవీణగారూ మీకు ప్రేమికుల రోజు సుభాకా౦క్షలండీ..

  7. చాలా బాగా చెప్పారండీ!

  8. rajukx says:

    చాలా బాగా రాశారు. మనస్సును హత్తుకునేలా… మనస్సులో చెప్పాలని కోరిక వున్నా.. వయస్సు తెచ్చిన పెద్దరికంతో కాస్త మొహమాటపడే వారు ఇది చదివితే తప్పక ఒకరితో ఒకరు తమ మనస్సులోనే నిద్రపుచ్చుతున్న ప్రేమను మళ్లీ మేల్కొలుపుతారు. తమ ప్రేమను వ్యక్తీకరించుకొంటారు. తిరిగి గత జ్నాపకాల ఝడిలో తడిసి ముద్దవుతారు.

  9. ప్రవీణా మనసు మూలల్లో దాగిన భావాలన్నీ వెలికితీయడం మీ కలానికే చాతనైన విద్య…యాంత్రిక జీవితాల్లో కోల్పోయిన మూగ భావాలకు మాటలు నేర్పి “ప్రేమ” అంతర్లీన ప్రకటన కాకూడదనే విషయాన్ని తెలియజేసారు…కానీ ఈ పాడు సిగ్గుకు సిగ్గుండదు…రాకూడని సమయాల్లో వచ్చి తిష్టేసేస్తుంది…..నెక్స్టియర్ బెటర్ లక్ అని చెప్తున్నా నా మనసుకు…..(సిగ్గును రానీయొద్దని….)

    థేంక్స్ చెప్పి మిమ్మల్ని పరాయిని చేయలేనంత ప్రేమతో…..

    “హ్యాపీ వాలెంటైన్స్ డే చెలీ….”

  10. Hari Krishna Sistla says:

    Let me wish you the same.
    Thanks for providing a good literature.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s