పురిటి నొప్పులు


పురిటి నొప్పులు

ప్రాణమంతా పసిముద్దలా
అరచేతిలో ఒదిగిపోయినప్పుడు
తనువు ఆణువణువూ
ఆనందంతో పులకరించిననాడు
ఒక అద్వితీయ బావన
నిలువెల్లా ముంచెత్తిన వేళ
అదిగో….అమ్మగా అలా మొదలయింది నా ప్రయాణం

అడుగడుగునా అబ్బురాలే
ఆదమరిస్తే ఉలిక్కి పడతాడేమో బిడ్డ!
అటుగా వెళ్తే
ఇటు ఏదన్నా మిదేసుకుంటాడేమో!
ఆటల్లో ఆకలి మరిచాడేమో
బుజ్జి బొజ్జ నిండిందో లేదో!
అన్నీ ఆత్రాలే….అంతులేని ప్రేమామృతాలే

దారిపొడుగునా ఎన్నెన్ని మజిలిలో
ఆనందపు అలసటతో
నడకలో అలుపంతా నా భుజానేత్తుకున్నా
నిన్ను కసిరిన క్షణం
కుమిలిన నా మనసుకు
నున్ను దండించిన ప్రతిసారి
గాయపడిన నా గుండెకు
ఊరట…..నీ ఎదుగుదలే

నీ యవ్వనపు తికమకలతో
నన్ను సతాయిస్తున్నప్పుడు
నీ రెక్కలు నీకొస్తున్నాయని తెలిసినా
నా రెక్కల మాటున
ఇంకా నిన్ను కాపాడాలనే అదే ఆత్రం…

అమ్మ ఉద్యోగం
జీవితకాలపు బాధ్యత
హక్కుల ఊసే ఎరుగని బాంధవ్యం

నిన్న కాక మొన్న
అడుగులు నేర్చిన నా బిడ్డ
ఇంతలోనే ఎంతెదిగిపోయాడు
మరి మరి…..పురిటి నొప్పులు ఇప్పుడెందుకు బాధిస్తున్నాయి?

This entry was posted in అమ్మ, కవితలు. Bookmark the permalink.

8 Responses to పురిటి నొప్పులు

  1. G says:

    “మరి…..పురిటి నొప్పులు ఇప్పుడెందుకు బాధిస్తున్నాయి?”

    aalochinchaalsina prashne 🙂

  2. వాసుదేవ్ says:

    నిజమైన నొప్పి మనసుకే కాని శరీరానికి కాదని మంచి భాషలో చెప్పారు..మళ్ళి మాతృత్వంలోని ఆనందాన్ని పంచుకున్నారు. మంచి కవిత. అభినందనలు

  3. Hari Krishna Sistla says:

    Your excellency,this was an excellent presentation.
    Instead using the word ‘ప్రయాణం’, ‘పయనం’ might have suited well. Though I can understand your feelings,The word ‘ప్రేమామృతాలే’ have n t had suited that that good,You should have tried the word ‘ప్రేమానురాగాలే'(ప్రేమామృతాలే did sound in a different way – I personally felt). You should have added other sentence “నా పై తిరగబడ్డ ప్రతి సారి – గాయపడ్డ నా గుండె కు – ఊరట నీ అభివృద్ధి” followed by the sentence ‘నా మనసుకునున్ను దండించిన ప్రతిసారి – గాయపడిన నా గుండెకు- ఊరట…..నీ ఎదుగుదలే’.(Positive point here is both the times when he HAD TO hurt your opinions or you HAD TO hurt those of his but did enjoy the final result – Got me ? )

  4. praveenaa…chaalaa adbhuthamgaa cheppaav ammaa..amma thanaanni.

  5. కొన్ని ప్రయాసలను వేరే ఆనదంలొకి మార్చుకొని పురిటినెప్పులు మర్చి పోతాము. చాలా కాలమయ్యాక అది సత్యము కాదని తెలిసి, పురిటి వాసన మనకు మనకే కొడుతుంటే, నెప్పులు పెట్టడమే కాదు సలుపెడతాయి కూడా

  6. g.obulreddy says:

    excellent praveena ji
    obulreddy

  7. Anonymous says:

    Chala bagundi prapanchamlo Amma la andari taraphuna rasinattu vundi
    Oka amma

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s