మనమిద్దరం సమాంతర రేఖలం


మనమిద్దరం సమాంతర రేఖలం

ఆద్యంతాలను ముడివేస్తూ
మనమిద్దరం
రెండు సమాంతర రేఖల్లా
భూమి ఆకాశం కలిసే
అనంతాలకు పరుగులుతీస్తూ ఉంటాం…..

నక్షత్రాల లెక్కలు తేలవు
సముద్రాల లోతులు అందవు
కీచులాడుకుంటూ..వాదులాడుకుంటూ
అటువైపోసారి…ఇటువైపోసారి
ఎగిరిపోతూంటాం…వదిగిపోతూంటాం

చీకటి గుహలలో వెతుకులాడుతూ
ఒకరినొకరు తడుముకుంటూ
ఏవో గతాల లోతుల్లోకి జారిపోతూ
ఒకరికొకరు ఆసరాగా ఎగబాకుతూంటాం..

నీ సిరా నీదే
నా లిఖితం నాదే
మన కావ్యం మాత్రం ఒకటే
జంటకవులం.. సృష్టి రహస్యాలం.

This entry was posted in కవితలు, కష్టం, జీవితం. Bookmark the permalink.

12 Responses to మనమిద్దరం సమాంతర రేఖలం

 1. ప్రవీణ గారు, బాగుంది. సమాంతర రేఖ అన్నది పాత ఆలోచనే కానీ, దాన్ని మీరు కవిత్వంలోకి తీసుకువచ్చిన తీరు బాగుంది.

 2. Anonymous says:

  గతాల లోతుల్లోనుండే భవిష్యత్తు శిఖరాలను ఎక్కాలి, సిరాన్ని, లేఖినిలో నింపి కాగితంపై నింపాలి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి

 3. Anonymous says:

  niku nuvve saati.

 4. Hari Krishna Sistla says:

  అనంతాలకు పరుగులుతీస్తూ ఉంటాం…..
  నక్షత్రాలూ లెక్కలు తేలవు – సముద్రాలూ లోతులు అందవు might have suited well (Indirectly embedding all the Three factors) In the similar passion,if the sentences కీచులాడుకుంటూనే – వాదులాడుకుంటూనే ;
  అటువైపునకొకసారి – ఇటువైపునకొక సారి were used,better rhyming might have been attained – I felt.

 5. లిఖితం….కావ్యం…కవులం…రహస్యాలం…
  ప్రపంచానికి మీ మీద అసూయ పుట్టబోతోంది. ద్రిష్టి మీద ఓ కవిత రాయకూడదా !!!

 6. the tree says:

  chakkaga undandi mee kavitha.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s