ఏదో ముడిపడుతున్న బావన
అంతలోనే విడిపోతున్న వ్యధ
ఎప్పటికైనా వదులయ్యేదేగా?
తెలిసినా బదులేది?
మనసుకు ఊరటేది?
వాడిపోయే పువ్వులే
మాలల అల్లిక మానగలమా?
ఎగిరిపోయే పక్షే
గూటిలో పొదుగుట ఆపగలమా?
ఏ దారి ఎటు పోవునో
బాటసారి పయనం ఆగునా?
దారి పొడుగునా కుశల ప్రశ్నల పలకరింపులే
మార్గమంతా ఒంటరి పయనమే
ముడి పడి విడి పడినా
ఏకాంతమే మైత్రీ బంధం…
so true. That’s why, enjoy the journey now – not worry about destination tomorrow. Enjoy the fragrance of flowers now – not worry about they wilting tomorrow. In short, live in the moment.
Exactly కొత్తపాళీ garu…live the moment, that’s the life.
మార్గమంతా కుశల ప్రశ్నలే
కుటిల నీతులే
తెలిసే చేసే ప్రయాణమే ఇది
ప్రసూనసిరివేద గారు @ నిజమే..తెలిసి తప్పక చేసే ప్రయాణమే ఒక్కోసారి.
‘ఏదో ముడిపడుతున్న బావన – అంతలోనే విడిపోతున్న వ్యధ’ కంటే ‘ఏదో ముడి పడుతున్న భావన – ఎప్పటి కైనా విడి పడతామేమో అన్న వ్యధ’, అని రాస్తే , కొంత వరకూ పోజిటివ్ రచన లాగా ఉండేది అనుకున్నాను – మీ ఉద్దేశ్యం ?
The landing sentences (ముడి పడి విడి పడినా – ఏకాంతమే మైత్రీ బంధం…) might have suite better, I felt.
హరి కృష్ణ గారు @ ఎప్పటి కైనా విడి పడతామేమో అన్న వ్యధ, ఈ లైన్ బాగుంది. Thank you
మీ కవితలు కొన్ని చదివాను. శైలి, భావమూ, పదాలూ అన్నీ అద్భుతం గా ఉన్నాయి. కానీ ఏదో నిరాశ. నాలో కాదు. మీలో. మీ కవితల్లో… generally gloomy గా అనిపించాయి. coincidence అయితే సంతోషం. You can give us (Or event to yourself) more inspiring poetry. Good luck.