మన సినిమా స్టంట్స్….
ఒకరోజు కారిడార్లో నడుస్తూ వెళ్తుంటే, నా నెక్స్ట్ ఆఫీసులో వుండే అరబ్ కోలీగ్ నవ్వు వినిపించింది. ఆయనకు చాలా గట్టిగా నవ్వే అలవాటు. నా దారిన నేను వెళ్ళిపోకుండా..ఆయన రూంలోకి తొంగి చూసి,
” మీరు నవ్వే విషయమేదో మాకు చెబితే మేము కూడా నవ్వుతాం కదా”, అంటూ కెలికాను.
నన్ను చూసి ఆయన ఇంకా గట్టిగా నవ్వుతూ, “Oh, Praveena ..come..come , I should share this with you” , అన్నారు.
నాకు curiosity ఎక్కువైపోయి , ఈయనేదో భలే విషయం చెప్పెదట్టున్నారు అనుకుంటూ కుర్చీలో సెటిల్ అయిపోయా…
సంగతేటంటే…ఇండియన్ సినిమాలపై ఫన్నీగా వుండే ఒక ఫార్వర్డ్ మెయిల్ చూస్తూ పడి పడి నవ్వుతున్నారు.
1 . బాలకృష్ణ భూమిపై నుంచొని సూర్యుడ్ని కాలితో తంతున్నాడు..To save earth ??!!!
2 . హిరో గారిని విలన్ వాడు కత్తితో పొట్టలో పొడిచాడు. కత్తి, రక్తం…. రక్తం ఆపటానికనుకుంట హిరో గారు చెయ్యి పొట్టపై వన ఫోటోలు. అదే angle maintain చేస్తూ మన హిరో ప్రేమించాడు, పెద్దలను ఎదిరించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసాడు…ఇలా సాగింది ఫోటోల పరంపర…
మన వాళ్ళను అంటే ఊరుకుంటానా?? ఎడాపెడా వాదించేసా. హాలీవుడ్ సినిమాలలో exaggeration లేదా అంటూ…పైగా బాలీవుడ్ సినిమా ఇక్కడ (దుబాయ్) రిలీజ్ అయినరోజు దియేటర్ కు వెళ్తే సగం హాల్ అరబ్బులతోనే నిండి పోతుంది…పాయింట్లు గుర్తుతెచ్చుకుని మరీ వాదించా.
ఆ మెయిల్ లాస్ట్ లో ఒక వీడియో ఉంది.
“ప్రవీణ, look at this వీడియో “, అంటూ మోనిటర్ నా వైపుకు తిప్పారు…
హు..ప్చ్ ప్చ్..ఏమి చెప్పమంటారు… 😦 😦 :(…….. 😦
మగధీర సినిమాలో మన హిరో వారు చేసే అతి విర భయకర ఫైటు…
ఆ వీడియో రన్ అవుతున్నంత సేపు ఆయన నవ్వుతూనే వున్నారు..నేను నవ్వు అప్పుకోలేక సతమత మావుతూనే వున్నాను.
కష్టపడి ఇంకాస్త వాదించి..వెళ్తూ వెళ్తూ..
“By the way Professor..that movie you showed….. that’s my mother tongue “…అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయా…. 🙂 🙂
ఏంచేస్తాం ప్రవీణ మన అదృష్టం మన దురదృష్టం
అంతే సురేష్ గారు..
Stunt leni cinima kuda cinimana
Take it easy yaar
Ram
🙂 what else we can do andi? 🙂
హీరోయిన్ గారు తలపైన కొబ్బరి కాయలు పగల కొట్టించుకున్న సీన్, హీరో గారి కోసం తపస్సు చేసే సీన్, హీరో గారు తను దేవుడని అనుకునే సీన్ చూడలేదా ?? ….చాలా మిస్ అయ్యారు…..
Hari Krishana garu @ తలపైన కొబ్బరి కాయలు పగల కొట్టించుకోవటమా…ఇది మరి దారుణం..చూసే వాళ్ళు బహు పిచ్చివల్లన్నమాట ..:)
aa kobbari kaayala scene Arundhati lodi
ఏం నొచ్చుకోకండి. ఆయన ఓర్వలేక నవ్వుతున్నాడు. అసలు వాళ్ళకి సినిమాలే లేవు, ఇంక మన హీరోల్లాంటి హీరోలెక్కడ.
నిజమే..పాయింట్ ఏ కొత్తపాళీ గారు…నవ్వితే నవ్వుకొని..మనకు సినిమాలు వున్నాయిగా, అంతే చాలు
సినిమాలన్నవి ఊహలని తెలవవా?
నేనిలా చేసుంటే బాగుండేదనేదే సినిమా.
ఇంత చిన్న విషయం మీకు ఆ అరబ్ అతనికి అర్థం కాలేదా ప్రవీణ గారు.
మన సినిమాలంతే కొద్దిసేపు నవ్వడం, కొద్దిసేపు ఏడవడం.
మా ‘”సీ” క్లాస్ సినిమా హాళ్ళ లో కి వచ్చి చూడండి.
ఇప్పటికీ హీరోయిన్ కష్టాలు చూసి ఏడిచే ఆడవాళ్ళు చాలామందేఉన్నారు ” మా ఆవిడతో సహా”.
మా ఆవిడకి మీ “మన సినిమా స్టంట్స్” గురించి చెబితే…………..
తెలుగుసినిమా గొప్పతనం గురించి అర్ధగంట ఉపన్యాసం ఇ చ్చి మీకు ఫొన్ కలుపమంది.
తప్పించుకునేసరికి తలప్రాణం తోకకు వచ్చేసింది.
Prasoonsiriveda garu @ “తెలుగుసినిమా గొప్పతనం గురించి అర్ధగంట ఉపన్యాసం ఇ చ్చి మీకు ఫొన్ కలుపమంది.తప్పించుకునేసరికి తలప్రాణం తోకకు వచ్చేసింది.”…హహహా….ఈ ఒక్క పాయింట్ చాలు ఈసారి ఆయన నవ్వితే మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చేదాం…
ప్రవీన గారు,
మీ విధానం నచ్చలేదు
అది మీ మదర్ టంగ్ పిక్చ్ ర్ అని చెప్పడం అసలు నచ్చలేదు
నేనైతే ఆ అరబ్ అతన్ని కుర్చీకి కట్టేసి ఓ “సిద్దం” ని (జగపతిబాబుని) ని చూపించేవాడిని.
ఎదుటి వాడినుంచి ఎప్పుడూ సింపతి ని పొందే ప్రయత్నం చెయ్యకండి
prasoonsiriveda garu@ హాహా…అంతేనంటారా? ఈసారి ఎమన్నా అంటే కుర్చీలో కట్టిపడేస్తా… 🙂
మగధీర లో ఫైట్ బానే ఉంటుంది కదండీ…ఎందుకు నవ్వారో!
సౌమ్య గారు, అడిగి చెపుతా..అమ్మో అడిగితే మళ్లీ నవ్వుతారేమోనండి?
naa artham leni telugu cinema ni amnna ante nenoppukonu , anthe………..vaasudev
వాసుదేవ్ గారు@ బాబోయ్ సినిమాలు, అర్థం అనే మాటకు ఆమడ దూరాలు 🙂