తిలకం దిద్దుకుందామని అద్దంలోకి తొంగిచూస్తే
అందం ఎక్కిరించింది
చివుక్కుమన్న మనసు
మధిని తట్టిలేపింది….
నేను కనిపించగానే
అమ్మ కళ్ళలో మెరిసే నా రూపం
నన్ను చూడగానే
బిడ్డ కళ్ళల్లో ఎగిసిపడే ఆనందం
ఈ అద్దానికి ఏమి తెలుసు
నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో….
మొన్నీమధ్య
థాంక్సండి అనగానే ఆటోవాలా పెదవులలో దాచుకున్న కృతజ్ఞత
రోడ్డు దాటించానని పెద్దాయన బోసినవ్వుతో చెప్పిన కృతజ్ఞత
ఈ అద్దానికి ఏమి తెలుసు
నా నవ్వు ఎంత అందంగా ఉందో….
nICE
CHAKKAGA UNDI
?!
సూపర్…ఎంత బాగా రాశారో……
Nice …..Good one. Try with the words “అందం nanu ఎక్కిరించింది”
“చివుక్కుమన్నnaa మనసు”.”నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో….” Naa kallu enta andam gaa untaayo.Almost similar SUGGESTION (Not Correction,please) in the landing sentence “నా నవ్వు ఎంత అందంగా ఉందో….”,Naa navvu enta andamgaa untundo……(A self confidence merged ). – Got me ?
అద్దం వున్నదున్నట్టు చూపించే కల్లాకపటం తెలీని ఒక సామాగ్రి మాత్రమే కదా.
అంతర్ సౌందర్యం గురించి దానికేంతెలుసు.
కానీ ఈ రోజులలో కొంతమంది అద్దం కన్నా అద్వాన్నంగా వ్యవహరిస్తున్నరు కదా వారినేం చేద్దాం……….?
చాలా బావుంది…ఈమధ్య మనుషులు కూడా మనసులు లేని అద్దాల్లానే తయ్యారవుతున్నరు…:(
sphurita garu@ నిజమేనండి..ప్రాణం లేని అద్దానికి మనసు లేని మనిషికి తేడ ఏముంటుంది కదూ.