ఆఖరి క్షణం విశ్వ ప్రేమలో …….
మలి సంధ్య
అంతిమ గడియలలో
క్షణాల ముల్లుకు అంకితమైపోయాను….
ఎవరో నా మునివేళ్ళు స్ప్రుశిస్తున్నారు
ఎవరో నా ముంగురులు సరి చేస్తున్నారు
ఎవరో నా హృదయ కవాటాలకు వేలాడుతున్నారు
ఎవరో నా గుండె గది గుమ్మంలో పడిగాపులు పడుతున్నారు
ఎవరో జారుతున్న నా కన్నీటిని దోసిళ్ళలో పడుతున్నారు
తనువున మిగిలిన ప్రాణాన్ని
వదిలి వేల్లోద్దని అభ్యర్ధిస్తూ
ఎవరో నన్ను పోదిగిపట్టుకున్నారు…..
క్షణం ముల్లుకు ఎంత సేపు వేలాడానో?
పాళీలోని సిరా ఎన్ని కాగితాలను తడిచేసిందో?
కుంచె నుంచి ఎన్ని రంగులు కాన్వాసు పైకి జారాయో?
ప్రాణం అణువణువునా ఎంత ప్రేమను నింపిందో?
కాలమే స్తభించిందో
నా ప్రేమే గెలిచిందో
ఆఖరి క్షణం విశ్వ ప్రేమలో సర్వత్ర తడిసి
మరో కావ్యానికి తొలి పలుకులు పలికాను….
Really Heart touching
No words to say more than that
Very nice
?!
ఎందుకో ‽ ఏమో? @ Thank you..
excellent, entha adbhutam ga raasaaru!!
ధన్యవాదాలు శర్మ గారు.
Excellent writing. Huge appraisal to you.Only Two sentences
“వదిలి వేల్లోద్దని అభ్యర్ధిస్తూ – ఎవరో నన్ను పోదిగిపట్టుకున్నారు…..”,Could not satisfy me. “వెళ్ళొద్దని”and “ఒడిసి పట్టుకుని or ఒదిగి పెట్టుకుని” might have suited well – I felt.
Hari krishna garu, I always look for ur comments, all your advices are so useful to me..thanks a lot
ఇది ఎలా సాధ్యం. ఒక మనిషిని రాత్రంతా కట్టిపడెసి చదివించేంత, అయిపోయింది మాఆవిడ ఇప్పుడె టైమెంతైందని అడిగేసింది. వుంటా. కాని నిజంగా మీబరుకుడు అద్భుతం.
Prasoonsiriveda garu, నా బరుకుడికి ఎంత పెద్ద కంప్లిమేంట్ ఇచ్చారండి…thank you, thank you
వేదాంతమా, కవిత్వమా, కన్నీరా, అనుభవమా ఏమిటిది. ఎందుకింత ఆర్థ్రృత మీగుండె లోతుల్లోనించి జాలువారే ఒక్కో పదం(వాక్యం) అధ్బుతం.
This is excellent Praveena garu!