గుండె గదిలో ఆ మూలన….
గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు
మనసు తలుపులు తెరిచి నిన్ను గెంటేయ్యలేను
అలాగని
జీవితానికి నిన్ను పట్టాభిషేకమూ చెయ్యలేను
ఊహ తెలిసిన నాటి పరిచయం నీతో
కొంతకాలం ఇద్దరమూ కలిసే పెరిగాము
ఆతర్వాత నిన్ను ఎదగనీయకుండా నొక్కేసాను
కానీ నాకేం తెలుసు
నువ్వు నాకంటే ఎప్పుడో
ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావని
నీ ఎత్తును తలెత్తుకుని చూడటం నాకెంతో గర్వం
నా గర్వాన్ని చేరుకోవాలన్న నా బలం
తప్పొప్పుల నడుమ నున్న గీతంత అల్పం
ఏం చెయ్యను..కాలంతో పరుగులే నాకు తెలిసిన జీవితం
ఒంటరితనంలో నిన్ను తలుచుకుని దుఃఖిస్తూ వుంటాను
ఏకాంతంలో నీతో ముచ్చట్లు చెపుతూ వుంటాను
నాలో ఇంకా బతికున్న నేను నువ్వు
అందుకే
అంతరాత్మ…..నిన్ను గుండె గదిలో ఆమూల బంధించేసాను!
భావావేశం, భాషా సౌందర్యం చాలా అక్కట్టుకున్నాయి కానీ “ఒంటరితనంలో నిన్ను తలుచుకుని దుఃఖిస్తూ వుంటాను” లాంటి వాక్యాలు మరీ వచనమైపొయాయి ప్రవీణాజీ…..ఇవి మీకు తెలియని విషయాలు కాదు కాని కవితావేశంలో దాటేశారేమో…..కాని చదివించారు మీ రచనని
అవునా వాసుదేవ్ గారు, మరి సెంటెన్స్ లా ఉందా.. I will try to change it. Thanks a lot for ur response.
Awesome literature.Hats off to your writing.
Mee ettuni talettukuni choodadam naakento garvakaaranam.
antharaatma’nu bandhinchagalamaa..? bandhinchaavante neeku neeve saati praveenaa ,,,,,,,,,,,,,,,nee bhaavaalu deep gaa unnaayee ..shubhabhinandanalu
ధన్యవాదాలు భూమి గోపాల్ గారు..