ఇది కవిత కాదు
ఎంత కాలమైంది… ఈ కలం ఒలికి
ఎంత కాలమైంది… ఈ కాగితం నలిగి
ఏదన్నా రాద్దామని మొదలు పెట్టా…
మొన్నీ మధ్య ఓ మిత్రుడు, “కవిత్వమంటే కష్టాలేనా” అని నవ్వాడు…
సమాధానమేమిటి?
విరహాలు, విషాదాలేనా కలం కార్చేది?
కన్నీరు పన్నీరులో తడిసి ముద్దయిన కాగితంలో దేని శాతం ఎంత?
ఏమో…Let me analyze it
Joysticks తో బాల్యపు గుర్తులు
కంప్యూటర్ స్క్రీన్ పై రాయబడుతూ
యవ్వనపు ఉరకలు ఇంటర్నెట్
కబంధాలలో ఇరుక్కుపోయి
జన్మ రహస్యాలు టెస్ట్ ట్యూబుల్లో నిక్షిప్తమై
ఫ్రీజర్లో మూలుగుతుంటే
ఏది కష్టం ఏది సుఖం?
నిత్యావసరాల సౌఖర్యాలలో
chemicals ను slow poison లా
సేవిస్తూ ఆస్వాదిస్తూ
తుమ్ముకు దగ్గుకు
తలనొప్పికి కాలునొప్పికి కూడా ఉలిక్కిపడుతుంటే
ఏది కష్టం ఏది సుఖం?
corporate ఉద్యోగాలలో వేలకువేలు జీతాల మాటున
జీవితపు వెన్నుపూస కుసాలు కదులుతుంటే
ఏది కష్టం ఏది సుఖం?
మనసు పొరలు చీల్చుతూ
అంతరంగపు ఆవరణకు చేరి
చిందులేస్తున్న కలం చిమ్ముతున్నది
కష్టాన్నా సుఖాన్నా?
ఏమో….తేల్చుకోలేకపోతున్నా…
ఆలోచనల వెనుక పరిగెడుతూ
మనసుకు దగ్గరగా చేరాక అనుభవిస్తున్నది
కష్టాన్నా సుఖాన్నా?
రెంటికి తేడా ఉందా?
ఏమి రాద్దామని మొదలుపెట్టాను?
మరి ఏమి రాస్తున్నాను?
అంతా అయోమయంగా ఉందే!!
మిత్రమా, సమాధానం నువ్వే వెతుక్కో
దీనిని కవిత్వమని మాత్రం అనకు…
అక్షరాలన్నీ జీవితాన్ని పెనవేసుకుంటే
రాలిపడిన భావాలు మాత్రమే ఇవి…..
నిజం చెప్పారు …..”ఇది కవిత కాదు”…. ఇది ప్రస్తుత మన జీవన సైలి…
నాకు నచిన మాట..((కార్పోరేట్ ఉద్యోగాలలో వేలకువేలు జీతాల మాటున
జీవితపు వెన్నుపూస కుసాలు కదులుతుంటే
ఏది కష్టం ఏది సుఖం?))
మీ
శ్రేయోభిలాషి
ఆలోచనల వెనుక పరిగెడుతూ – మనసుకు దగ్గరగా చేరాక అనుభవిస్తున్నది – కష్టాన్నా సుఖాన్నా?
Kashtaalanaa sukhaalanaa might have suited well as you did use word ‘ఆలోచనల’ (Not Singular but Plural) The same comment I had to make towards sentence ‘chemicals ను slow poison లా’ (Slow poisons)The word “సౌఖర్యాలలో” pushed me into trouble (sou KHA ryaala) – Got me ?
I do apologize if happened to bother you.
“Joysticks తో బాల్యపు గుర్తులు
కంప్యూటర్ స్క్రీన్ పై రాయబడుతూ
యవ్వనపు ఉరకలు ఇంటర్నెట్
కబంధాలలో ఇరుక్కుపోయి
జన్మ రహస్యాలు టెస్ట్ ట్యూబుల్లో నిక్షిప్తమై
ఫ్రీజర్లో మూలుగుతుంటే”………..అక్షర సత్యాలు Praveena. మీ కవితలో, మీ శైలిలో చాలా పరిణతి కనిపిస్తోంది. అభినందనలు.
బాగుంది. సుఖం కావాలీ కష్టం వొద్దూ అని కోరుకుంటాం కానీ చాలాసార్లు మనం ఉన్న ఉన్న పరిస్థితి కష్టమో సుఖమో నిజంగా మనకే తెలీదు.
అక్షరాలన్నీ జీవితాన్ని పెనవేసుకుంటే
రాలిపడిన భావాలు మాత్రమే ఇవి…చాలా బాగుంది..
అక్షరాలన్నీ జీవితాన్ని పెనవేసుకుంటె రాలిపడిన సత్యాలగురించి మాకు చెప్పేటందుకు ఇంకేముంతుంది ప్రవీణాజీ. ఆర్ద్రతగా రాసారు. మొదటిసారి ఆ ఈజ్ కన్పడింది మీ రచనలొ….(దీన్ని కవిత అనొద్దన్నారుగా….అందుకే ఇలా రచన్ అన్నది) అభినందనలు
http://www.andhrabhoomi.net/features/desha-771