ఆమె ప్రశ్నలు సమాధానాలు


ఆమె ప్రశ్నలు సమాధానాలు

అతని ఎన్నో ప్రశ్నలకు ఆమే సమాధానం
ఆమె ప్రతీ సమాధానం నిలదీసే ప్రశ్నే ఆమెకు
ఆ ప్రశ్నల్లో అస్థిత్వాన్ని వెతుక్కుంటూ
ఆ సమాధానాలలో వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా
ప్రశ్న సమాధానాల
మధ్య అగాధంలో
జారిపోతూ ఎగబాకుతూ
సంధికాలం దాకా చేరగలిగింది స్త్రీ….

ఆనాడు
దేవతవి అన్న బిరుదు తగిలించి
పూజించబడాలంటే
పలానా లక్షనాలుండాలన్నా
సంకెళ్ళలో బంధించి
మంచితనపు ముద్ర
నుదిటిపై  ముద్రించి
కట్టని గుడులలో పూజలందుకున్న
ఆమె కోరుకున్నది
దైవత్వమా?
సాటి మనిషన్న అభిమానమా?

ఈనాడు
మరుభూమిలో కత్తులు రువ్వినా
కర్మాగారాలలో మరమత్తులు చేసినా
దేశాలు ఏలినా
అహంకారపు గనులు తవ్వి
ఆధిపత్యపు రాకెట్లు ఎక్కి
విశ్వం దాకా చేరిన
ఆమె పయనం
మానవాళికి నిరుపించినది మార్గదర్శకం కాదా?

ఏనాడైనా
ఎన్ని బాధ్యతలలో నలిగినా
ఆ ఇల్లాలు ఇంటికి దీపమే
ఎన్ని బంధాలు ముడిపడినా
ఆ కూతురు పుట్టింటికి బంధీయే
ఎంత ఎత్తుకు ఎదిగినా
ఆ తల్లి ఒడిలో బిడ్డ పదిలమే

ఇప్పుడిప్పుడే
ఆమె ప్రశ్నలకు
అతను సమాధానాలు వెతుకుతున్నాడు…

This entry was posted in కవితలు, మహిళ. Bookmark the permalink.

6 Responses to ఆమె ప్రశ్నలు సమాధానాలు

 1. Anonymous says:

  nice sis

 2. Hari Krishna Sistla says:

  Good Idea.Highly emotional one,I felt.
  ” సంకెల లో బంధించి”,Might have suited well.Similarly the word “Nuduti pai ‘nantinchi’ ” might have suited well. Glad if you could check the sentence “మరుభూమిలో కత్తులు రువ్వినా “,You did want to express something other, I believe.

 3. jyothirmayi says:

  ప్రవీణ గారూ గొప్ప గొప్ప భావాల్ని పదాలలో ఎలా కూరుస్తారో మీరు. సూటిగా గుండెకు తగిలేలా ఉంటాయి, చాలా బావుంది.

 4. బావుంది ప్రవీణ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s