నువ్వు నేను కలిసినప్పుడు
కుశల ప్రశ్నల పలకరింపులతో
కాలం గడిపేస్తాం….
కన్నీటిని కనురెప్పలతో కప్పెయ్యాలని
కనుపాపతో గదంతా వెతుకుతాం…
భారంగా దొర్లే క్షణాలను
బరువైన చిరునవ్వుతో మరింత కుంగదీస్తాం…
ఆమాట ఈమాట మధ్య
వినిపించే నిట్టుర్పుతోనో
ఆచూపు ఈచూపు మధ్య
కనిపించే దాపరికంతోనో
నడి సముద్రపు ఈతగాడిని
తీరం చేరనివ్వం…
నిశ్శబ్దపు అగాధాలు
లోకాభిరామాయణంతో పూడ్చేస్తాం..
కాఫీ టిఫిన్లు అయ్యాక
వీడ్కోలు చెప్పుకుంటాం
మరోసారి మనసు విప్పాలని ఆశిస్తూ…
చాలా బాగుంది
Thanks చిన్ని ఆశ garu..
I request your opinion if ‘భారంగా దొర్లే క్షణాలను’,was been replaced by ‘Bhaarangaa Dorlina Ksahaanalanu’.
You’re right Hari Krishana garu..I will update. thx andi
Praveena gaaru, your self has accepted for correction. But i feel what you already used words are meaningful. భారంగా దొర్లే క్షణాలను
బరువైన చిరునవ్వుతో మరింత కుంగదీస్తాం…. If your intention is to say both activities are happening simultaneously, words used are meaningful.
నిజమే కదూ! బాగా వ్రాశారు!
ధన్యవాదాలు రసజ్ఞ గారు
చాలా ..చాలా బాగుంది
ధన్యవాదాలు డేవిడ్ గారు..
chaalaa bagunnadi mee blog
?!
nice one it is good thing telling to one who we love moree