తాళం వెయ్యాల్సిన తలంపు
చాలా కాలానికి తెరుచుకున్న
తలుపుల నుంచీ తలంపు
బయటకు బయలుదేరింది…
అందమైన లాన్లు
క్రమశిక్షణగా నాటిన మొక్కలు
నీటిని వేదజిమ్ముతున్న ఫౌంటైన్ల
నడుమ
నియాన్ లైట్ల వెలుతుర్లో
మెరుస్తున్న నున్నటి తారు రోడ్డుపై
నడుస్తూ దారులు వెతుకుతుంటే
సైన్ బోర్డులన్నీ
నింగి నేల కలిసే చోటుకే చూపిస్తున్నాయి….
రోడ్డుపై పలకరించ మానవుడు లేడు
ఉన్నవన్నీ యంత్రాలే
పొల్యూషన్ కి అలవాటు పడ్డ ప్రాణాలే
క్షణం తీరికలేని ప్రయాణాలే….
తిరిగి తిరిగి
అలసి సొలసి
ఒంటరిగా వెనక్కు తిరిగిన తలంపు
తలుపులు బిడాయించుకుని
PC లో విండోస్ (OS )
కిటికీ ఊచలకు వేలాడుతున్న
బ్రౌజరు డబల్ క్లిక్ తో
గూగుల్ బాబాయి కాళ్ళ దగ్గర పడి
సలహా అర్దించింది
“How to lock సెన్సిటివ్ room’s thought డోర్”….
(ఒక సాయంత్రం కబుర్లు చెపుకుంటూ బాల్కనిలో గంట సేపు వుంటే …రోడ్డుపై ఒక్క మనిషి కనిపించలేదు. కార్లు రయ్ రయ్ మంటూ దుసుకుపోతున్నాయి..దానికి కాస్త పైత్యం ఆడ్ చేశా…. lol )
అభివృద్ది క్రమశిక్షణ పేరులతో ఒంటరౌతున్న సమయం
మనిషి కోల్పోతున్న సున్నితత్వాన్ని, పిసి పై ఆధారపడే తత్వానికి లోనౌతున్న విధానాన్ని బాగా చెప్పారు
ధన్యవాదాలు జాన్ హైడ్ కనుమూరి garu…
కవిత చాలా బాగా రాశారు.
ప్రవీణ గారూ …….మీకు మీ ఊళ్ళో కూడా ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందా ??
Hari Krishna garu: This was my experience one evening…
ప్రవీణ గారు! ఎమిటండి.. ఇలా రాసుకుంటూ పోతే ఎలా చెప్పండి? సరదాగా చెప్పాలంటే.. మీలో ఓ జక్కన్న ..ఓ తిక్కన్న అంతఃర్లినంగా ఉన్నట్లంపిస్తుంది. చాలా బావుంది.
thotakuri garu: హ్హ హ్హా ….పైన ఒప్పేసుకున్నాను కదా…పైత్యం ఆడ్ చేశాను అని…:)
మీ కోసం ఈ ఫేస్ బుక్ పోస్టింగును పంపలేకుండా ఉన్నాను
15th jun :- I got attached with ovary
17th jun :- I’m a tissue now
30 Jun :- Mom said to dad, “ You’re going to be a father”
MOM AND DAD ARE VERY HAPPY
15th Sept :- I Can feel my heartbeat
14oct :- I have Little hands, legs head and a stomach.
13Nov :- Today i was in a Ultra scan
WOW ! I m a girl
14Nov : I was DEAD!
My mom and dad Killed me.
WHY?
Is it just Because I was a girl?
People love to have a Mother , AWife, and of course a girlfriend too
Then why not a daughter !!!
If You’re a Human….. Pass it to Everyone by copy this message
Pls
“SAVE GIRL CHILD”..
డబ్బు, అంతస్థు యావలో పడి పరిగెత్తే వాళ్ళ వలన ఏర్పడే వాతవరణమే అది. ఎంత పైకి రావాలని అనుకున్నా మరీ గాలి దొరకనంత పైకి రావటం మంచిది కాదు కదా!!! దీనికి విరుగుడు మందే “సంతృప్తి”
RadhaKrishna garu: “సంతృప్తి”..కరెక్ట్ గా చెప్పారు..