నేస్తమా…ఆలకించు
కష్టం ముద్దాడింది
కన్నీరు చెరువయింది
నేస్తమా…..
నీ సమక్షంలో
నన్ను కరువుతీరా మాట్లాడనీ
మధ్యే మధ్యే మార్గాలు సూచించకు
నువ్వు మనసు పెట్టి సాంతం ఆలకించు
నా తప్పొప్పులు ఎత్తి చూపుతూ
సలహాలు మాత్రమే నువ్వు చెప్పు
తేలికైన నా మనసు
పరిష్కారాలు అదే వెతుక్కుంటుంది..
నేస్తమా…Just listen to me …..
Nice one
కనీసం కస్టాలు వినే వాళ్ళు లేకుండా ఛాలా మంది ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. మన కష్టాల్ని వింటేనే సాంత్వన లభిస్తుంది. అయితే కవితలో మధ్య మధ్య మార్గాలు మార్గాలు సూచించకు అని వెంటనే సలహాలు చెప్పా మంటున్నారు ఏ రెండూ కాంట్రాడిక్టరి అయినట్టనిపిస్తోంది.. దీనికి బదులు .. మధ్య మధ్య నీవు మార్గాలు చెప్పక పోయినా పర్వాలేదు విను చాలు అని వుంటే సరిపోతుందేమో.. మొత్తానికి వినదగునెవ్వరు చెప్పిన .. అని అనుకుంటే ఎంతో మందికి మనసు శాంతి లభిస్తుంది.
ఈ కవిత కి మీరు పెట్టిన బొమ్మ చాలా బాగుందండీ..!!!
nice one….
Wonderful literature. Perfection might have still attained if corrected as “Kashtam nanu muddaadindi – Naa kanneeroka cheruvayyindi “.
Good opinion of yours.