లెక్కల సంబంధం
ఆరుబయట
మడత మంచాలలో పడుకుని
వెన్నెల వెలుగులో
లెక్కపెట్టిన నక్షత్రాల
లెక్క తేలకుండానే
బాల్యం వెళ్ళిపోయింది…
బెండకాయ కూర తినటానికి
లెక్కలు రావటానికి
సంబంధం తెలీకుండానే
చదువైపోయింది….
ఇప్పుడు తెలిసిందల్లా
నోట్ల కట్టల లెక్కలతో సంబంధమే….
బాగుంది!
Awesome one – Exclusively the landing sentence.