ఆ మూల
ముసురు ఎప్పుడు కమ్ముకుందో
ఎండిన ఈ నేల వదిలిన మట్టివాసన
హృదయానికి తగిలేదాకా తెలీయనే లేదు…
ఈ నేల
ఇంతగా ఎప్పుడు ఎండిపోయిందో
ఆ వాన నీళ్ళు దోసిట్లో పట్టి
కళ్ళాపు జల్లే దాకా తెలీయనే లేదు…
ఆ ముసురూ
వదలనంటోంది
ఈ దోసిలి నిండనంటోంది
ఆ వాకిలి తడవనంటోంది….
“Aa musurika (Mususru ika) vadalanantondi – Dosilika (Dosili ika) nindanantondi – Rendoo jaragakundaane vaakili tadisi poyindi ” Might have good sense about enjoying the Rain.
అద్బుతమైన పదచిత్రాల మధ్య తడిపారు .. అభినందనలు