నాన్న…నిండు ప్రేమ కుండ, తొణకడు
ఆ నుదుటి మడతల్లో
ఆ జారిన చెంపల్లో
అరచెయ్యి బుగ్గన ఆనించుకుని
నీ గురించి ఆలోచించిన క్షణాలు ఎన్నో…
ఆ మసక బారిన కళ్ళలో
నీ గురించి కన్న కలలు ఎన్నో…
ఆ చెవిటి చెవుల్లో
నీ విజయం వినాలని పడిన ఆరాటాలు ఎన్నో…
ఆ వణుకుతున్న చేతుల్లో
నువ్వు జారిపోకుండా పట్టుకున్న సంఘటనలు ఎన్నో…
ఆ మోకాలి నొప్పుల కాళ్ళల్లో
నీ కోసం పరుగులు పెట్టిన మజిలీలు ఎన్నో…
కన్నా
ఆ కళ్ళు కురిపించిన క్రోధం వెనుక
అధిమిపట్టిన కన్నీరు ఉంది….
కన్నా
ఆ చెవిన పడకూడదని
నువ్వు దాచేసాననుకున్న నీ అల్లరి వెనుక
నీ విసుగు వినీవిన్నట్టు దాటేసినా మూగ బాధ ఉంది…..
కన్నా
ఆ చరిచిన చేతుల కఠినత్వం వెనుక
నోసటిని నొక్కుకున్న ఆ చేతి స్పర్శలో
హృదయం దాకా పాకిన ఆవేదన ఉంది…
కన్నా
పౌరషంగా పలికిన ఆ పెదవుల వెనుక
నువ్వంటే అంతులేని ప్రేమ ఉంది…
కన్నా
నాన్న హీరో అన్న నువ్వే
నాన్నకి చాదస్తం అనీ అన్నావు
హీరో చాదస్తంగా మారిన క్రమంలోని
ఆర్ధత, తపనేరా….నీ నేటి జీవితం.
నాన్న…నిండు ప్రేమ కుండ, తొణకడు.
Hmm.. Touching!
ధన్యవాదాలు మధురవాణి గారు…
Its true….nice poem.
ధన్యవాదాలు పద్మార్పిత గారు..
As usual.. Touching.. good one andi.
ఆ వణుకుతున్న చేతుల్లో
నువ్వు జారిపోకుండా పట్టుకున్న సంఘటనలు ఎన్నో…
ఆ మోకాలి నొప్పుల కాళ్ళల్లో
నీ కోసం పరుగులు పెట్టిన మజిలీలు ఎన్నో…
చాలా బాగుంది ప్రవీణా గారు
nice..
ప్రతి కొడుకు గుండెను తట్టి లేపినట్టుంది.
well said.
Good writing.Really Touching. Do want to suggest landing sentence,sentimentally hesitating to do so.
chaala bavundi
exellent mam… chaduvutunte kallallo neellu vachesayi….. tandri eppatiki hero ne tana pillalakii… very nice…
Hi Praveena garu…ee rojantaa mee blog ne chaduvutunnanu. maa boss eroju office ki rakunte bagundanani anipinchindhi. mee kavithalu chaala bagunnayi especially nanna meeda kavitha. Very very……..heart touching!!!
ee kavitha yentho bagundhi rachayetaku abinandnalu.
Super kavitha.