మనసు ఆకలి
రోజులు గడుస్తూనే ఉంటాయి
జీవితం సాగుతూనే ఉంటుంది
అంతా సవ్యంగా ఉన్నట్టే ఉంటుంది
అంతలోనే
ఎక్కడో ఏదో రాగం శృతి తప్పినట్టు
మరేదో గానం మూగబోయినట్టు
ఏమూలో అసంతృప్తి సెగ రాచుకుని
దావానలమై మనసంతా పరుచుకుంటుంది…….
కానవస్తున్న గమ్యం
కనికరం లేకుండా పరుగులు పెడుతున్నట్టు,
నిచ్చెన చివరి మెట్టు చేరాక
ఆ విజయం మరో పరాజయంలా పరిహాసం చేస్తున్నట్టు,
తమని తాము చూసుకోలేని కళ్ళు
అద్దంలో మసగబారినట్టు
మనసుని కమ్మేస్తాయి కన్నీరు ఒక్కోసారి……..
ఆదరి నుంచి ఈదరి చేరాక
అనుభూతులు వెతుకుతుంటుంటే
అనుభవాలు మాత్రమే తారసిల్లుతుంటే
రహదారి నడకకే కానీ
నివాసానికి కాదని
కాగుతున్న ఎండ వేడిలో
చలువ కళ్ళద్దాలు దాచేసిన
ఎర్రజీర
మనసుకి మాత్రమే కనిపిస్తుంది ఒక్కోసారి…..
ఈపూట తిండి ఆ పొట్టకు ఈ పూటకే
మనసు ఆకలి అంతే…….
chala baga rasaru.. keep it up
చెప్పలేన౦త బావుంది ప్రవీణ గారూ… కవిత చదువుతుంటే అర్ధంకాని ఆవేదన, మనసులో ఎక్కడో దాగిన బాధ… మీ కవితలు చదువుతుంటే మనసుకు ముసుగు తీసేసినట్లుగా ఉంటు౦ది. ధన్యవాదాలు.
nice!
Good – an emotional one.
Good writing to call .If the sentence ” కాళ్ళు ఇంక సహకరించనంటాయి…”was been induced before “ఈపూట తిండి ఆ పొట్టకు ఈ పూటకే”,might have shown self satisfaction for session (I mean you are to end satisfied session.)-OK ? If you prolong the writing with sentence “మాపటిదెవరికి ఎరుక ..”mean you are worried of following session too which may stay end less.