నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది…


నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది…

అమ్మ,
చీర కుచ్చిళ్ళలో
కొంగు అంచులో
నా బాల్యం
ఇంకా వేలాడుతూనే ఉంది…

నాన్న,
లెక్కలు చెపుతూ
చరిచిన దెబ్బల్లో
ప్రోగ్రెస్ కార్డు పై సంతకం పెడుతూ
చూసిన చూపుల్లో
నా బాల్యం
ఇంకా వేలాడుతూనే ఉంది…

చెల్లి,
గిల్లికజ్జాల వాదనలో
అలకల సాధింపులలో
ఆడుకున్న ఆటలలో
పంచుకున్న రహస్యాలలో
నా బాల్యం
ఇంకా వేలాడుతూనే ఉంది…

చున్నీ చుట్టేసుకుని
కాళ్ళకు అడ్డుపడుతున్న
నా కొడుకు పసిబుగ్గలలో
నా బాల్యం
ఇంకా వేలాడుతూనే ఉంది…

This entry was posted in అమ్మ, కవితలు. Bookmark the permalink.

6 Responses to నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది…

 1. బాగుంది…
  మనవలెత్తుకునే వయసొచ్చినా మీ బాల్యం ఇలానే మీమదిలో వేలాడుతూనే ఉంటుంది 🙂

 2. sailabala says:

  bavundi praveena…

 3. ప్రవీణ గారూ..మీ బాల్యం అలాగే కలకాలం ఉంటుంది. మీరేమీ అనుకోకపోతే చిన్న సవరణ. చిన్న అచ్చుతప్పు ‘కుచ్చిళ్ళలో’ బదులు ‘కుచ్చిల్లలో’ అని వుంది.

  • ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు సరి చేసినందుకు. It was a spell mistake 🙂

 4. Hari Krishna Sistla. says:

  Excellence in writing.
  తమరి బాల్యం అలా సంతోషాలలో వేళ్ళాడుతూ గడిచింది అన్నమాట.
  ఎంతయినా బాల్యాన్ని గుర్తు చేసినందుకు సంతోషంగా ఉన్నది.- Got me ?

 5. పి. శేష శైలజ says:

  బాగుంది చాలా. బాల్యపు జ్ఞాపకాల తోటలో వర్తమానం పదనిసలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s