అతడు ఆమె —- ఆ బంధం
అతను ప్రేమిస్తున్నానన్నాడు
ఆమె అపనమ్మకంగా చూసింది
నువ్వే ప్రాణం, నీతోనే జీవితమన్నాడు
ఆమె మనసు కరిగి, ప్రేమ ఉప్పొంగింది
బంధం ముడిపడింది…..
చట్టాపట్టాలేసుకుని
జీవితపు నావలో
ఆనందపు తీరాలకు చేరాలని
కలలు కంటూ
సాగారు కొంత కాలం….
అలల ఆటుపోటులు
కలలను కుదపటం మొదలుపెట్టాయి
అతనిలో అసంతృప్తి రాచుకుంది
ఆమెలో నిర్లిప్తత చేరుకుంది
అతని కళ్ళు క్రోధాన్ని కురిపిస్తున్నాయి
ఆమె సహనం కన్నీటిగా కారుతోంది
అతను మౌనాన్ని ఆశ్రయించాడు
ఆమె మాటలు సతాయింపులయ్యాయి……
అతను ఆమె ఘర్షణలో
ఓ నడిరేయి ఆ నడిసముద్రంలో
జారిపోతున్న అతని చెయ్యందుకున్న
ఆమె కళ్ళలో
అదే అపనమ్మకం
ఆనాడు ప్రేమ కాదేమో
ఈనాడు ప్రేమ కాదా? లేదా?…..
ఆమె రెప్పల మాటున
ఎగిసి పడుతున్న జ్వాలలో
మరేదో మాట
నీకు ఈత రాదనీ కాదు
నేను తీరం చేరలేననీ కాదు
తీరని బంధం
కాదనలేని అనుబంధం….
అతని బుర్రే ఆలోచించిందో
మనసే కలుక్కుమందో
నీరు చేరిన నావలో
చేద వేస్తున్న భార్య
చెయ్యందుకున్నాడు……
ఫొటోలు చూస్తోంటే మీరు ప్రేమ ప్రయాణం సాహసం అనుకుంటున్నారని అనిపిస్తోంది.
Praveen Sarma garu: మరి అంతే కదా.. కాదంటారా? 🙂
ప్రేమ కవిత అనుకుని చదివితే విరక్తి కవితలా అనిపించి అడిగాను, అంతే.
🙂
chaalaa baagundhi praveena gaaru.
chaalaa baaga varninchaaru meeru
http://bhavanakaithapana.blogspot.com/
Nice Praveena.. Great
సముద్రయానంతో పోల్చిన మీ వర్ణన బావుంది.
ధన్యవాదాలు జ్యోతిర్మయ గారు
chaala baavundhi. praveena garu hats off to your poetry. super. wow. fromU.K
Thx for responding Venkata Rao garu..
Beautiful! 🙂
ధన్యవాదాలు మధురవాణి గారు…
Wonderful writing. No second sentence in regard.Only
అతని కళ్ళు క్రోధాన్ని కురిపిస్తున్నాయి – ఆమె సహనం కన్నీటిగా కారుతోంది -అతను మౌనాన్ని ఆశ్రయించాడు
ఆమె మాటలు సతాయింపులయ్యాయి……Just have flow in He – She sequence,I am made to understand. Still have better if used He (1st line) She (2nd line) if immediately followed by She (4th line)(Third line got as Fourth line) Followed by Fourth line with a little change “Ayinaa atanu mounaanni aasrayinchaadu.”. Got me ??
ఆమె సహనం కన్నీటిగా కారుతోంది
ఆమె మాటలు సతాయింపులయ్యాయి
అతని కళ్ళు క్రోధాన్ని కురిపిస్తున్నాయి
అయినా అతను మౌనాన్నే ఆశ్రయించాడు Is still better sequence than to the one suggested.
This looks good Hari Krishna garu.
May be U find a Similar Poem here.
http://sridharchandupatla.blogspot.com/2007/12/blog-post.html
Thx for sharing Sridhar garu. ఎక్కడా ఆపకుండా చదివించారు..చాలా బాగుంది.
అతని కళ్ళు క్రోధాన్ని కురిపిస్తున్నాయి
ఆమె సహనం కన్నీటిగా కారుతోంది
bavundi …